Chanakya Niti: రోజూ నిద్రలేచిన తర్వాత ఇలా చేయండి.. సిరి సంపదలు, సుఖ సంతోషాలు మీ సొంతం..
ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఇలాంటి అనేక విషయాలను చెప్పాడు. వీటిని జీవితంలో స్వీకరించినట్లయితే అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఉదయం నిద్రలేచిన తర్వాత చాణక్యుడు సూచించిన ఈ పనులను చేయడం ద్వారా వ్యక్తి జీవితంలో సానుకూల ఫలితాలను పొందుతాడు. ఈ రోజు మనం ఆచార్య చెప్పిన విషయాలు ఏమిటో తెలుసుకుందాం.. వీటిని పాటిస్తే జీవితాన్ని పూర్తిగా మార్చుకోవచ్చు.
ప్రతి వ్యక్తి తన జీవితం సుఖ సంతోషాలతో నిండి ఉండాలని కోరుకుంటాడు. సిరి సంపదలకు లోటు లేకుండా జీవించాలని.. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాలను సాధించాలని భావిస్తారు. అయితే మనం తరచుగా తెలిసి లేదా తెలియక అనేక రకాల తప్పులు చేస్తుంటాం. ఈ తప్పుల వలన విధి కూడా కోపగించి రకరకాల కష్టాలను కలిగిస్తుంది. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఇలాంటి అనేక విషయాలను చెప్పాడు. వీటిని జీవితంలో స్వీకరించినట్లయితే అనేక సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఉదయం నిద్రలేచిన తర్వాత చాణక్యుడు సూచించిన ఈ పనులను చేయడం ద్వారా వ్యక్తి జీవితంలో సానుకూల ఫలితాలను పొందుతాడు. ఈ రోజు మనం ఆచార్య చెప్పిన విషయాలు ఏమిటో తెలుసుకుందాం.. వీటిని పాటిస్తే జీవితాన్ని పూర్తిగా మార్చుకోవచ్చు.
ఉదయం నిద్రలేచిన తర్వాత ఈ పని చేయండి
ఆచార్య చాణక్య నీతి ప్రకారం ఎల్లప్పుడూ సూర్యోదయానికి ముందే మేల్కొనాలి. ఇలా చేయడం మతపరమైన దృక్కోణంతో పాటు, ఆరోగ్యానికి కూడా మంచిదని భావిస్తారు. ఉదయాన్నే నిద్రలేవడమే విజయానికి తొలి మెట్టు అని ఆచార్య చాణక్య చెప్పారు. అనంతరం రోజూ స్నానం చేసి ఆ తర్వాత భగవంతుడిని ధ్యానించాలి. ఇలా చేయడం ద్వారా జీవితంలో అనేక సానుకూల ఫలితాలను చూస్తాడు.
ఈ పని పురోగతిని తెస్తుంది
ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యన్ని సమర్పించండి. ఇలా చేయడం ద్వారా, పురోగతికి అవకాశాలు ఏర్పడతాయి. సూర్య భగవానుడు సంతోషిస్తాడు. సూర్యునికి అర్ఘ్యాన్ని అర్పించి అనంతరం సూర్యనారాయణ పేరుని జపమాల జపించాలి. సూర్య మంత్రాన్ని పఠించాలి. అనంతరం నారాయణుడికి చందనాన్ని సమర్పించండి. అప్పుడు ఈ గంధాన్ని నుదిటి, మెడపై రాసుకోండి. ఇలా చేయడం వల్ల భగవంతుని అనుగ్రహం నిలిచి మానసిక ప్రశాంతత లభిస్తుంది.
మెరుగైన ఆరోగ్యం కోసం
చాణక్య నీతి ప్రకారం వ్యక్తి ఆరోగ్యకరమైన శరీరాన్ని కలిగి ఉండటం మొదటి ఆనందం. అటువంటి పరిస్థితిలో మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇందుకోసం ఉదయాన్నే నిద్రలేచి ధ్యానం, యోగా, వ్యాయామం చేయాలి. ఎందుకంటే మీ ఆరోగ్యం బాగుంటేనే మీరు మీ లక్ష్యంపై దృష్టి పెట్టగలుగుతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు