Telangana: వెంటాడిన మృత్యువు.. లారీ నుండి కారుపై పడ్డ ధాన్యం బస్తాలు.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

రాత్రి వేళ గీసుకొండ మండల మచ్ఛాపూర్ గ్రామ శివారు అపెక్స్ కాలేజీ దాటి వెళ్తుండగా.. నర్సంపేట నుంచి ఎదురుగా వరంగల్ వైపు ధాన్యం లోడ్ తో వెళ్తున్న లారీలోని బస్తాలు ఒక్కసారిగా కారుపైన పడ్డాయి. ధాన్యం బస్తాలు మీదపడి కారు నుజ్జు నుజ్జయింది. ఈ ప్రమాదం లో రాజు(60) అక్కడికక్కడే మృతిచెందారు. అతని భార్య లలిత, కుమారుడు శ్రీకాంత్, కోడలు సింధూలకు తీవ్ర గాయాలయ్యాయి.

Telangana: వెంటాడిన మృత్యువు.. లారీ నుండి కారుపై పడ్డ ధాన్యం బస్తాలు.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
Lorry And Car Accident
Follow us
G Peddeesh Kumar

| Edited By: Surya Kala

Updated on: Jan 28, 2024 | 8:53 AM

కనులు తెరిస్తే జననం.. కనులు మూస్తే మరణం.. రెప్ప పాటు ఈ జీవితం అన్నాడో సినీ కవి. ఎవరిని ఎప్పుడు ఎలా మృత్యువు కబళిస్తుందో ఎవరికీ తెలియదు.. తాజాగా వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మచ్చాపూర్ గ్రామశివారులో ఓ విషాద ఘటన జరిగింది. లారీ లోని ధాన్యం బస్తాలు రోడ్డు పై వెళ్తున్న కారుపై పడ్డాయి. దీంతో కారులో ఉన్న ఒకరు అక్కడికక్కడే మృతచెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే..

నర్సంపేట మండలం రామారం గ్రామానికి చెందిన జినుకుల నాగరాజు, అతని భార్య లలిత, కుమారుడు శ్రీకాంత్, కోడలు సింధూలతో కలిసి హనుమకొండ రామారంలోని తన మనువడి పుట్టు వెంట్రులు తీసేందుకు శుక్రవారం వేములవాడకు వెళ్లారు. అక్కడ మొక్కులు తీర్చుకున్న అనంతరం శనివారం కొండగట్టు అంజన్న స్వామిని దర్శనం చేసుకొని సాయంత్రం 8 గంటల సమయంలో హనుమకొండకు చేరుకున్నారు.

హనుమకొండలో కుమార్తె, అల్లుడిని ఇంటిదగ్గర వదిలేసి నర్సంపేట మండలం రామారంకు కారులో బయల్దేరారు. రాత్రి వేళ గీసుకొండ మండల మచ్ఛాపూర్ గ్రామ శివారు అపెక్స్ కాలేజీ దాటి వెళ్తుండగా.. నర్సంపేట నుంచి ఎదురుగా వరంగల్ వైపు ధాన్యం లోడ్ తో వెళ్తున్న లారీలోని బస్తాలు ఒక్కసారిగా కారుపైన పడ్డాయి.

ఇవి కూడా చదవండి

ధాన్యం బస్తాలు మీదపడి కారు నుజ్జు నుజ్జయింది. ఈ ప్రమాదం లో రాజు(60) అక్కడికక్కడే మృతిచెందారు. అతని భార్య లలిత, కుమారుడు శ్రీకాంత్, కోడలు సింధూలకు తీవ్ర గాయాలయ్యాయి. లారీలోని బస్తాలు రోడ్డుపై పడటంతో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ముగ్గురికి తలలకు తీవ్ర గాయాలైనట్లు ఎంజీఎం వైద్యులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..