AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: కడుపున పుట్టిన పిల్లలు నిర్లక్ష్యం.. పిల్లులు, కుక్కలకు 23 కోట్ల ఆస్తిని రాసిచ్చిన వృద్ధురాలు ఎక్కడంటే..

వృద్ధులైన తల్లిదండ్రులను భారంగా భావించే పిల్లలు తమ ఇంటి నుంచి బయటకు గెంటేస్తున్నారు. లేదా వారి క్షేమం గురించి పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్న ఘటనలు రోజు ఎక్కడోచోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలపై కఠిన చర్యలు తీసుకోవలసి వస్తుంది. ప్రస్తుతం అలాంటి కేసు ఒకటి వార్తల్లో నిలిచింది. ఇది ప్రజలను ఆశ్చర్యపరచడమే కాదు వారిని భావోద్వేగానికి గురి చేసింది.

Viral News: కడుపున పుట్టిన పిల్లలు నిర్లక్ష్యం.. పిల్లులు, కుక్కలకు 23 కోట్ల ఆస్తిని రాసిచ్చిన వృద్ధురాలు ఎక్కడంటే..
China Woman
Surya Kala
|

Updated on: Jan 28, 2024 | 8:25 AM

Share

తల్లిదండ్రులకు సేవ చేయడం పిల్ల విధి .. అతి పెద్ద కర్తవ్యం. అయితే ప్రస్తుతం ప్రపంచం స్వార్థపూరితంగా మారింది. మానవ సంబంధాలన్నీ వ్యాపార బంధాలుగా మారిపోయాయి. జన్మనిచ్చిన తల్లికి పట్ల ప్రేమ ఉండడం లేదు.. పెంచి పెద్ద చేసి, విద్యాబుద్ధులు నేర్పి, సమర్ధుడైన మనిషిగా తీర్చిదిద్దిన తల్లిదండ్రుల పట్ల పిల్లలకు ప్రేమ గౌరవం అనేది ఉండడం లేదు. వృద్ధులైన తల్లిదండ్రులను భారంగా భావించే పిల్లలు తమ ఇంటి నుంచి బయటకు గెంటేస్తున్నారు. లేదా వారి క్షేమం గురించి పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్న ఘటనలు రోజు ఎక్కడోచోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలపై కఠిన చర్యలు తీసుకోవలసి వస్తుంది. ప్రస్తుతం అలాంటి కేసు ఒకటి వార్తల్లో నిలిచింది. ఇది ప్రజలను ఆశ్చర్యపరచడమే కాదు వారిని భావోద్వేగానికి గురి చేసింది.

అసలు విషయంలో వెళ్తే.. చైనాలో నివసిస్తున్న ఒక వృద్ధ మహిళ తన పెంపుడు పిల్లులు, కుక్కల పేరుతో తన ఆస్తిని 2.8 మిలియన్ డాలర్లు అంటే మన దేశ కరెన్సీలో 23 కోట్లకు పైగా రూపాయలను రాసి ఇచ్చింది. ఇలా చేయడానికి రీజన్ కూడా చెప్పింది ఆ బామ్మ.. ఇవి ఎల్లప్పుడూ తనతో ఉంటాయని పేర్కొంది. అయితే ఈ బామ్మగారికి ముగ్గురు పిల్లలున్నారు. తన కడుపున పుట్టిన పిల్లలకు కాకుండా పిల్లులకు ఆస్థి రాయడంతో నెట్టింట్లో ఈ బామ్మ చేసిన పని చక్కర్లు కొడుతోంది.

పిల్లలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని వృద్ధురాలు

ఆడిటీ సెంట్రల్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం.. ఈ మహిళ కొన్ని సంవత్సరాల క్రితం తన మొదటి వీలునామా రాసింది. అందులో ఆమె తన ఆస్తి మొత్తాన్ని తన ముగ్గురు పిల్లలకు పంచింది. అయితే ఆ స్త్రీ ముగ్గురు పిల్లలు ఆమెను పట్టించుకోవడం మానేశారు. దీంతో ఇటీవల ఈ బామ్మ తన మనసు మార్చుకుంది. తన ఆస్థి మొత్తాన్ని పెంపుడు జంవుతుల పేరున బదిలీ చేసింది. తాను అనారోగ్యంతో ఉన్నప్పుడు.. ఒక్కసారి కూడా తన పిల్లలు తనను చూడడానికి రాలేదని.. తన సంరక్షణ కోసం ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని చెప్పింది. అందుకనే తాను తన సంపదనంతా తనతో ఎప్పుడూ ఉండే జంతువులకే ఇచ్చేయాలని  నిర్ణయించుకున్నట్లు పేర్కొంది.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో వృద్ధ మహిళ కథ

షాంఘైకి చెందిన ఈ మహిళ వీలునామా రాసే విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంది. ముందుగా లాయర్ ని సంప్రదించింది. అనంతరం వీలునామా రాస్తూ.. తాను మరణించిన తర్వాత, తన డబ్బు మొత్తాన్ని తన పెంపుడు జంతువులకు …  ఆ జంతువుల పిల్లల సంరక్షణకు ఉపయోగించాలని రాసింది. చైనీస్ చట్టం ప్రకారం పెంపుడు జంతువులకు ఆస్తిని ఇవ్వడంపై ఎటువని ఆంక్షలు, నిషేధం లేదు. అయినప్పటికీ ముందుజాగ్రత్తగా మహిళ న్యాయవాదిని సంప్రదించి పక్కాగా ప్లాన్ తో తన ఆస్తిని కుక్కలకు బదలాయించింది. తన ఆస్తికి వారసత్వంగా వెటర్నరీ క్లినిక్‌ని ఎంచుకుంది. తనకు ఇష్టమైన తన పెంపుడు జంతువుల సంరక్షణనుఆ వెటర్నటీ క్లినిక్‌కి అప్పగించింది. ప్రస్తుతం ఈ వృద్ధ మహిళ కథ చైనాలోని మిలియన్ల మంది ప్రజల హృదయాలను తాకింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .