AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మనదేశంలో ఇక్కడ ప్రతి గంటకు లక్షల్లో గోల్ గప్పలు అమ్ముడవుతాయట.. స్పెషాలిటీ ఏమిటంటే

తీపి-పులుపు-కారం రుచి ఒక్కసారి నాలుకకు తగిలితే ఆహా అనాల్సిందే. అందుకనే పానీ పురీ అమ్మే వ్యక్తి సంపాదన ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ఏమాత్రం తీసిపోదు అంటే అతిశయోక్తి లేదు. పట్టణం పల్లె అనే తేడా లేదు ఏ వీధిలో చూసినా ఇప్పుడు పానీపూరి బండి కనిపిస్తుంది. అయితే  ఒక ప్రాంతంలో గంటకు లక్షల్లో గొల్గప్పలు అమ్ముడవుతాయట. దీని స్పెషాలిటీ ఏమిటంటే..

Viral Video: మనదేశంలో ఇక్కడ ప్రతి గంటకు లక్షల్లో గోల్ గప్పలు అమ్ముడవుతాయట.. స్పెషాలిటీ ఏమిటంటే
Golgappa Mega Factory
Surya Kala
|

Updated on: Jan 26, 2024 | 10:41 AM

Share

స్ట్రీట్ ఫుడ్ లో రారాజు పానీపూరి అని చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా పానీపూరి లవర్స్ ఉన్నారు. ముఖ్యంగా అమ్మాయిలకు అయితే పానీపూరి ఉంటే చాలు ఇంకేమీ అక్కర్లేదు అన్నట్లుగా ఇష్టపడరు. అందుకనే దేశంలో అత్యంత ఇష్టమైన వీధి స్నాక్స్‌లో పానీపూరి ఒకటిగా నిలిచింది. పుల్లని, కారంగా ఉండే నీటితో నిండిన గొల్లగప్పను ఒక్కసారిగా నోట్లో పెట్టుకుని తినడం అందరికీ ఇష్టమే.. తీపి-పులుపు-కారం రుచి ఒక్కసారి నాలుకకు తగిలితే ఆహా అనాల్సిందే. అందుకనే పానీ పురీ అమ్మే వ్యక్తి సంపాదన ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ఏమాత్రం తీసిపోదు అంటే అతిశయోక్తి లేదు. పట్టణం పల్లె అనే తేడా లేదు ఏ వీధిలో చూసినా ఇప్పుడు పానీపూరి బండి కనిపిస్తుంది. అయితే  ఒక ప్రాంతంలో గంటకు లక్షల్లో గొల్గప్పలు అమ్ముడవుతాయట. దీని స్పెషాలిటీ ఏమిటంటే..

దేశ రాజధాని ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతం ఆగ్రాలో ఉన్న మెగా ఫ్యాక్టరీలో గంటకు లక్షల గోల్ గప్పాలు అమ్ముడవుతాయట. ఇక్కడ గత యాభై ఏళ్లుగా గొల్గప్పలు తయారవుతున్నాయి. ఈ ఫ్యాక్టరీ నిత్యం రద్దీతో నిండిపోయి ఉంటుంది. ఫ్యాక్టరీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మాత్రమే కాదు ఆగ్రాలోని అనేక ప్రాంతాల  నుంచి కూడా స్ట్రీట్ ఫుడ్ అమ్మకం దారులు ఇక్కడ నుంచి గొల్గప్పలను తీసుకెళ్తారు. ఇక్కడ పూరీల ప్రత్యేకత ఏమిటంటే.. వీటిని పిండితో కాకుండా రవ్వతో తయారు చేస్తారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

ఈ మెగా ఫ్యాక్టరీలో గొల్గప్పలను చేతితో తయారు చేయడాన్ని వీడియోలో చూడవచ్చు. రవ్వను తీసుకుని దానిలో సరిపడా నూనె వేసి పిండిలా కలిపి బాగా చేతితో మెత్తగా చేస్తారు. తర్వాత అప్పడంలా ఒత్తి.. దానిని గోల్ గప్పాలుగా కట్ చేసి.. వేడి నూనెలో వేయిస్తున్నారు. ఈ పనిని ఎంతో సునాయాసంగా, వేగంగా  చేస్తున్నారు. ఇది చూస్తే మీరు షాక్ అవుతారు. ఈ పద్ధతిలో గోల్గప్పను తయారు చేయడం సాధారణ చేతివృత్తిదారులందరికీ కష్టం.

ఇన్‌స్టాలో ఈ వీడియోను ఈటీసాగ్రా అనే ఖాతాలో షేర్ చేశారు. వేలాది మంది చూస్తున్నారు. ఇష్టపడుతున్నారు. రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు కూడా..

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..