మొదట రేసులో ఉన్న విగ్రహం ఇదే.. తెల్లని మక్రానా పాలరాయితో రామ్‌లల్లా

మొదట రేసులో ఉన్న విగ్రహం ఇదే.. తెల్లని మక్రానా పాలరాయితో రామ్‌లల్లా

Phani CH

|

Updated on: Jan 26, 2024 | 12:28 PM

జనవరి 22న అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సమక్షంలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. అనంతరం రామమందిరం తలుపులు సామాన్య భక్తుల కోసం తెరిచారు. ఈ నేపధ్యంలో శ్రీరాముని దర్శనం కోసం దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు. గర్భాలయంలో ప్రతిష్ఠంచేందుకు విగ్రహాల తయారీని తొలుత ముగ్గురు శిల్పకారులకు అప్పగించారు.

జనవరి 22న అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సమక్షంలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. అనంతరం రామమందిరం తలుపులు సామాన్య భక్తుల కోసం తెరిచారు. ఈ నేపధ్యంలో శ్రీరాముని దర్శనం కోసం దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు అయోధ్యకు తరలివస్తున్నారు. గర్భాలయంలో ప్రతిష్ఠంచేందుకు విగ్రహాల తయారీని తొలుత ముగ్గురు శిల్పకారులకు అప్పగించారు. తరువాత ఆలయంలో ప్రతిష్ఠాపనకు రెండు విగ్రహాలను ఎంపిక చేశారు. అయితే చివరకు మైసూర్‌కు చెందిన అరుణ్ యోగిరాజ్ రూపొందించిన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. రాజస్థాన్ రాజధాని జైపూర్ నివాసి సత్యనారాయణ పాండే శిల్ప కళాకారునిగా ఎంతో పేరొందారు. తరతరాలుగా వారి కుటుంబం విగ్రహాలను తయారు చేస్తోంది. సత్యనారాయణ పాండే రామ్‌లల్లా విగ్రహాన్ని తెల్లని మక్రానా పాలరాయితో తీర్చిదిద్దారు. తొలుత ఈ విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలని ట్రస్ట్‌ భావించిందట. ఈ విగ్రహం ప్రస్తుతం ట్రస్ట్ ఆధీనంలో ఉంది. దీనిని ఎక్కడ? ఎప్పుడు ప్రతిష్ఠించేదీ ట్రస్ట్‌ త్వరలో తెలపనుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయోధ్యకు వెళ్లే బస్సులు బంద్‌ !! ఎప్పటిదాకా అంటే ??

KGF: సూపర్ డూపర్ క్రేజీ న్యూస్.. మరో సారి కేజీఎఫ్

Mrunal Thakur: ‘ఇంత చేసినా.. అవకాశాలు రావడం లేదు’ హీరోయిన్ ఎమోషనల్

పేద, ధనిక విభజనేంటి.. అధికారుల తీరుపై తాప్సి సీరియస్

Jani Master: అప్పుడే పద్దతి మార్చుకున్న జానీ మాస్టర్

Published on: Jan 26, 2024 12:27 PM