AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mrunal Thakur: 'ఇంత చేసినా.. అవకాశాలు రావడం లేదు' హీరోయిన్ ఎమోషనల్

Mrunal Thakur: ‘ఇంత చేసినా.. అవకాశాలు రావడం లేదు’ హీరోయిన్ ఎమోషనల్

Phani CH
|

Updated on: Jan 26, 2024 | 12:13 PM

Share

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఇందులో సీతామహాలక్ష్మి పాత్రలో అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆ తర్వాత వెంటనే న్యాచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న సినిమాతో మరోసారి అలరించింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ జోడిగా ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటిస్తుంది.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఇందులో సీతామహాలక్ష్మి పాత్రలో అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆ తర్వాత వెంటనే న్యాచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న సినిమాతో మరోసారి అలరించింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ జోడిగా ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా ఓ బాలీవుడ్ మీడియాతో ముచ్చటించిన మృణాల్.. తన నెక్ట్స్ మూవీస్.. ఫిల్మ్ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. అంతేకాకుండా తాను ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి లవ్ స్టోరీ కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఇంతకీ మృణాల్ ఏమన్నారంటే…! “హిందీలో చాలా సినిమాల ఆఫర్స్ వస్తున్నాయి. కానీ మంచి ప్రేమకథ మాత్రం రావడం లేదు. అలాంటి సినిమాలు చేయాలని ఉంది. కానీ.. నాకు రొమాంటిక్ లవ్ స్టోరీస్ రావడం లేదు. నాకు అర్థం కావడం లేదు.. నన్ను నేను నిరూపించుకోవడానికి ఇంకా ఎంతగా అలసిపోవాలో. బహుశా నేను హిందీలో ఇంకా అంతగా ఫేమస్ కాలేదేమో. కానీ నాకు అక్కడ మంచి అవకాశాలు రావాలని కోకరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పేద, ధనిక విభజనేంటి.. అధికారుల తీరుపై తాప్సి సీరియస్

Jani Master: అప్పుడే పద్దతి మార్చుకున్న జానీ మాస్టర్

Deepika Padukone: దీపికను ఆగం చేస్తున్న బికినీ షో గోల

Mixup: టెంప్ట్‌ చేస్తున్న ఫిల్మ పోస్టర్‌.. నెట్టింట వైరల్

Shruti Haasan: సమంత ప్లేస్‌ కొట్టేసిన శృతి హాసన్