Padma Awards: యాదాద్రి జిల్లాకు వరించిన పద్మాలు.. స్వయంకృషితో అత్యున్నత స్థానాలకు చేరిన కళాకుసుమాలు ఎవరంటే..

గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొత్తం 132మందికి కేంద్రం పద్మ పురస్కారాలను ప్రకటించింది. సాహిత్యరంగంలో.. ప్రముఖ సాహితీవేత్త, ఇంటినే గ్రంథాలయంగా మార్చిన కూరెళ్ల విఠలాచర్య, భగవద్గీతను బంజారా భాషలోకి కేతావత్‌ సోమ్‌లాల్‌, యాదాద్రి ఆలయ శిల్పకారుడు వేలు ఆనందాచారిలకు పద్మశ్రీ దక్కాయి.

Padma Awards: యాదాద్రి జిల్లాకు వరించిన పద్మాలు.. స్వయంకృషితో అత్యున్నత స్థానాలకు చేరిన కళాకుసుమాలు ఎవరంటే..
padma shri award person in nalgonda
Follow us
M Revan Reddy

| Edited By: Surya Kala

Updated on: Jan 26, 2024 | 10:06 AM

స్వయంకృషితో అద్భుత ప్రతిభతో అత్యున్నత స్థానాలకు ఎదిగిన ప్రతిభావంతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మ పురస్కారాలు యాదాద్రి జిల్లాకు వరించాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొత్తం 132మందికి కేంద్రం పద్మ పురస్కారాలను ప్రకటించింది. సాహిత్యరంగంలో.. ప్రముఖ సాహితీవేత్త, ఇంటినే గ్రంథాలయంగా మార్చిన కూరెళ్ల విఠలాచర్య, భగవద్గీతను బంజారా భాషలోకి కేతావత్‌ సోమ్‌లాల్‌, యాదాద్రి ఆలయ శిల్పకారుడు వేలు ఆనందాచారిలకు పద్మశ్రీ దక్కాయి.

ఇంటినే లైబ్రరీగా మార్చిన సాహితీవేత్త…

యాదాద్రి ಜಿల్లా రామన్న పేటమండలం వెల్లంకికి చెందిన కూరెళ్ల విఠలాచార్య అక్షర యోధుడు, మధుర కవి. తెలుగు రచయిత, విశ్రాంత ఉపన్యాసకుడు, సామాజికవేత్త, గంథాలయ స్థాపకుడు. సాహిత్యమే ఊపిరిగా ఐదు దశాబ్దాలుగా రచనలు చేస్తున్నారు. కవిగా 22 పుస్తకాలను వెలువరించారు. విఠలేశ్వర శతకం, స్మ్రుత్యాంజలి, వెల్లకి వెలుగు, కూరెళ్ల పద్య కుసుమాలు వంటి రచనలు ప్రాచుర్యం పొందాయి. తెలుగు ఉపన్యాసకుడిగా పదవీ విరమణ తర్వాత 2014లో తన ఇంటిని రెండు లక్షల పుస్తకాలతో లైబ్రరీగా మార్చారు. ఎంతో మంది విద్యార్థులకు, నిరుద్యోగులకు, పరిశోధకులకు ఈ గ్రంథాలయం ఉపయోగంగా మారింది. ఈ లైబ్రరీ ఆధారంగా చేసుకుని ఇప్పటికే ఇక్కడ పరిశోధనలు చేసిన వారు 8 మంది విద్యార్థులు పీహెచీడీ పట్టాలు పొందారంటే.. ఈ లైబ్రరీ విశిష్టత తీరును గమనించవచ్చు. కూరెళ్లను స్ఫూర్తిగా తీసుకొని ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 20 గ్రామాల్లో యువకులు స్వచ్ఛంద గ్రంథాలయాలను నిర్వహిస్తున్నారు. 2018లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి విశిష్టపురస్కారం అందుకున్నారు. 2019లో తెలంగాణ ప్రభుత్వం ఆయనను ప్రతిష్ఠాత్మక దాశరథి పురస్కారంతో సత్కరించింది. కూరెళ్ళ చేస్తున్న కృషిని ఇటీవలే ప్రధాని మోదీ ఆదివారం రేడియో కార్యక్రమంలో మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో ప్రస్తావించి అభినందించారు. పట్టుదల ఉంటే వయస్సులో సంబంధం లేదని కూరెళ్ల నిరూపించారని మోదీ ప్రశంసించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రస్తావించడంతో విఠలాచార్య ఖ్యాతి జాతీయస్థాయిలో పలువురు దృష్టిని ఆకర్షించింది.

బంజారా భాషలోకి భగవద్గీతను అనువాదం చేసిన సోమ్ లాల్..

యాదాద్రి జిల్లా భువనగిరి మండలం ఆకుతోట బావి తండాకు చెందిన కేతావత్ సోమ్ లాల్ ను సాహిత్య రంగంలో పద్మ పురస్కారం దక్కింది. హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతను బంజారా భాషలోకి అనువదించడంతో ఈయనకు ఈ పురస్కారం వరించింది. కేతావత్‌ సోమ్‌లాల్‌ను ఈయన బంజారాలకు అర్థమయ్యేలా భగవద్గీతను మలిచారు. ఎస్బీఐలో పనిచేస్తూ పదవీ విరమణ చేసిన ఈయన బంజారా జాతి జాగృతి కోసం 200కి పైగా పాటలు రాశారు. జనగామలో హాస్టల్లో ఉంటూ చదివేటప్పుడు కేతావత్ సోమ్ లాల్ పక్కనే ఉన్న గుడిలో నుంచి రోజూ ఉదయాన్నే లౌడ్ స్పీకర్లో వచ్చే భగవద్గీ తను వినేవాడు. అప్పటినుంచే తమ జాతికి భగవద్గీతను ప్రజలకు దీనిని అర్థమయ్యేలా అందించాలని సోమ్ లాల్ భావించారు. 16నెలల పాటు అవిశ్రాంతంగా కృషిచేసి భగవద్గీతలోని 701 శ్ల్లోకాలను బంజారా భాషలోకి అనువదించారు.గీత అనువాదం 1989లోనే పూరయినా అది అచ్చు కావడానికి 35 ఏళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. 2014లో ఈయన రచించిన గ్రంథాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించింది. సాహిత్య, విద్యారంగంలో విశేష సేవలు అందించారు.

ఇవి కూడా చదవండి

అద్భుత శిల్పకళ ఆనందాచారి వేలు సొంతం…

ఏపీలోని చిత్తూరు జిల్లా వెన్నంపల్లిలో 1952లో పుట్టిన ఆనందాచారి వేలు హైదరాబాద్ లో స్థిర పడ్డారు. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో ఆనందాచారి వేలు కీలకంగా పనిచేశారు. ఆలయ నిర్మాణంలో అదనపు స్థపతి సలహాదారుడిగా పనిచేశారు. 1980లో దేవాదాయశాఖలో సహాయ స్థపతిగా చేరిన వేలు అన్నవరం, శ్రీశైలం, విజయవాడ, కాణిపాకం, సింహాచలం, యాదగిరిగుట్ట, బాసర, వేములవాడ, శ్రీకాళహస్తి ఆలయాల్లో పనిచేశారు. 2010లో పదవీ విరమణ చేసిన అనంతరం శ్రీశైల దేవస్థానంలో ఆస్థాన స్థపతిగా ఉన్నారు. 2015లో మొదలైన యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో ఈయన్ను యాదాద్రి ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ (వైటీడీఏ) ప్రధాన స్థపతిగా నియమించింది. టీవీ, రేడియాల్లో వేలు అనేక శిల్పకళా ప్రసంగాలు చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఈయన ప్రతిభను గుర్తించి 2017లో శిల్పకళ విభాగంలో ప్రతిభా పురస్కారం అందజేసింది. ప్రస్తుతం ఆయన కర్ణాటక కేరళ తెలంగాణ తదితర రాష్ట్రాల్లోని వివిధ దేవాలయాల పునర్నిర్మాణ జర్నోదరణ పనులను పర్యవేక్షిస్తున్నారు. 101 మెడిసిన్ వర్ణ చిత్రాలను చిత్రీకరించి 2002లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు ప్రయత్నం చేశారు. శిల్పకళలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను 2002 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. 2013లో కళా రత్న అవార్డు ను పొందారు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..