Republic Day 2024: రిపబ్లిక్ డే, ఇండిపెండెంట్ డే రోజుల్లో జాతీయ జెండా ఎగరేసే విషయంలో తేడాలున్నాయని మీకు తెలుసా..
భారతదేశం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో.. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సంవత్సరం ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది. భారతదేశంలో రిపబ్లిక్ డే వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. కవాతులు, విభిన్న సాంస్కృతిక ప్రదర్శనలు వంటి వివిధ కార్యక్రమాలతో ఈ వేడుకలను నిర్వహించనున్నారు. అయితే ఈ రోజున భారత జెండా ఎగురవేయబడదని మీకు తెలుసా? 'జెండా ఎగురవేయడం' .. 'జెండా ఆవిష్కరణ' అనే పదాలు సాధారణంగా పరస్పరం ఒకేలా అనిపిస్తున్నా.. అవి జాతీయ జెండాను ప్రదర్శించడంలో విభిన్న పద్ధతులను సూచిస్తాయని తెలుసా..
భారతీయులు అందరూ ఘనంగా జరుపుకునే జాతీయ పండగలు స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం. మన దేశానికి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్య్రం వచ్చిన తేదీ ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవంగా.. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజైన జనవరి 26న రిపబ్లిక్ డే గా అత్యంత ఘనంగా జరుపుకుంటాం. ఈ రెండు రోజులు దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్ర కోట లో మాత్రమే కాదు ఆఫీసుల్లో, స్కూల్స్ లో ఇలా బహిరంగ ప్రదేశాల్లోని కుండల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. జెండాకు వందనం చేస్తారు.
భారతదేశం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో.. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సంవత్సరం ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది. భారతదేశంలో రిపబ్లిక్ డే వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. కవాతులు, విభిన్న సాంస్కృతిక ప్రదర్శనలు వంటి వివిధ కార్యక్రమాలతో ఈ వేడుకలను నిర్వహించనున్నారు. అయితే ఈ రోజున భారత జెండా ఎగురవేయబడదని మీకు తెలుసా? ‘జెండా ఎగురవేయడం’ .. ‘జెండా ఆవిష్కరణ’ అనే పదాలు సాధారణంగా పరస్పరం ఒకేలా అనిపిస్తున్నా.. అవి జాతీయ జెండాను ప్రదర్శించడంలో విభిన్న పద్ధతులను సూచిస్తాయని తెలుసా..
భారతదేశంలో గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జెండాను ఎలా ప్రదర్శించాలి.. జెండాను ఆవిష్కరించడానికి.. ఎగురవేయడానికి మధ్య తేడా ఏమిటి చూద్దాం.. ఆగస్టు 15కి, జనవరి 26కి జెండా ఎగరేసే విషయంలో కొన్ని తేడాలున్నాయి. గణతంత్ర దినోత్సవం రోజున భారత జెండాను ఆవిష్కరిస్తారు.. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎగురవేస్తారు..
జనవరి 26న జెండా ఆవిష్కరణ
గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ జెండాను భారత రాష్ట్రపతి ఆవిష్కరిస్తారు. అంటే అప్పటికే ధ్వజస్తంభం పైనే అప్పటికే జెండా ఉంటుంది. అంటే ఇక జెండాని పైకి లాగాల్సిన పని ఉండదు. అంటే భారత దేశం ఇప్పటికే స్వతంత్రంగా ఉందని అర్థం. 1950లో భారత రాజ్యాంగాన్ని ఆమోదించి అమల్లోకి వచ్చిన రోజకి చిహ్నం గణతంత్ర దినోత్సవం. వలస పాలన నుండి సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మారడాన్ని హైలైట్ చేస్తూ రాజ్యాంగంలో నిర్దేశించిన సూత్రాల పట్ల నిబద్ధతను పునరుద్ధరించడానికి సంకేతకు గుర్తుగా రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు.
ఆగష్టు 15వ తేదీన జెండా ఎగురవేయడం
స్వాతంత్య్ర దినోత్సవం రోజున త్రివర్ణ పతాకాన్ని ధ్వజస్తంభం కింది భాగంలో కట్టి పైకి లాగుతారు. ప్రధాన మంత్రి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. బ్రిటీష్ వలస పాలన నుంచి విముక్తి పొంది.. దేశానికి స్వాతంత్య్రం పొందిన చరిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా అలా చేస్తారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..