రిపబ్లిక్ డే 2024
దేశంలో భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. బ్రిటీష్ పాలనతో పూర్తి తెగతెంపులు చేసుకుంటూ.. నాటి నుంచే భారత్ స్వతంత్ర గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ప్రతి యేటా ఆ రోజున రిపబ్లిక్ డేగా యావత్ దేశం ఘనంగా జరుపుకుంటోంది. దేశ విజయ గాథలను స్మరించుకుంటూ.. నూతన ఉత్తేజంతో కొత్త లక్ష్యాల వైపు అడుగులు వేయించేందుకు దేశ పౌరులకు రిపబ్లిక్ డే పండుగ ప్రేరణగా నిలుస్తోంది. దేశానికి సంబంధించి మూడు జాతీయ సెలవు దినాల్లో ఇది కూడా ఒకటి. భారత స్వాతంత్ర దినోత్సవం (ఆగస్టు 15), గాంధీ జయంతి (అక్టోబర్ 2)ని కూడా జాతీయ సెలవు దినాలుగా జరుపుకుంటున్నాం. ప్రజలను మమేకం చేస్తూ రిపబ్లిక్ డే వేడుకలను కేంద్రం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు దేశ వ్యాప్తంగా అధికారికంగా ఘనంగా నిర్వహిస్తున్నాయి.
రిపబ్లిక్ డే రోజున దేశ రాజధాని న్యూ ఢిల్లీలోని రాజ్‌పథ్ దగ్గర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము జాతీయ పతాకను ఎగురవేస్తారు. ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, విదేశీ దౌత్యవేత్తలు, విదేశీ అతిథులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా నిర్వహించే పరేడ్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. దేశ త్రివిధ దళాలు తమ శక్తిసామర్థ్యాలు, ఆయుధ సంపత్తిని పరోడ్‌లో ప్రదర్శిస్తాయి. భిన్న సంస్కృతులు, సాంప్రదాయాలతో కూడిన భారత్‌లోని భిన్నత్వంలో ఏకత్వానికి ఈ పరేడ్ అద్దంపడుతుంది. పరేడ్‌లో పాల్గొనే వివిధ రాష్ట్రాల కళాకారులు, శకటాలు తమ సాంస్కృతిక వైభవాన్ని చాటుతాయి. రిపబ్లిక్ సందర్భంగా పలు పాఠశాలలు, కళాశాలలు విద్యార్థుల్లో దేశ భక్తిని పెంపొందించేలా వ్యాస రచన వంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తాయి. రిపబ్లిక్ డే రోజున దేశ నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించిన వారికి, వివిధ రంగాల్లో సేవలందించిన వారికి రాష్ట్రపతి పద్మా అవార్డులను అందజేయడం ఆనవాయితీగా వస్తోంది.
2007లో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు రష్యా అధ్యక్షుడు పుతిన్, 2015లో నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. 2024 రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు.
News not found!