Andhra Pradesh: రిపబ్లిక్ డే వేడుకల్లో రకరకాల పాములు.. భయపడకండి.. అసలు కథ వేరే!
పాడేరు తలారి సింగి గిరిజన సంక్షేమ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్యఅతిథిగా కలెక్టర్ దినేష్ కుమార్ హాజరయ్యారు. ఎస్పీ అమిత్ బర్దర్ కూడా పాల్గొన్నారు. పరేడ్ ఘనంగా జరిగింది. శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఇందులో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు రిపబ్లిక్ డే వేడుకల్లో ఆ పాములు ప్రత్యేకత సంతరించుకున్నాయి. అందరి దృష్టిని ఆకర్షించాయి. జెర్రిపోతు, రక్తపింజరి, నాగుపాము, బొడ్డ పాము.. ఇలా అటు ఇటు కదులుతూ కనిపించాయి. పాములేంటి..? ప్రత్యేకత ఏంటి అనేగా మీ ఆలోచన..? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!
పాడేరు తలారి సింగి గిరిజన సంక్షేమ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్యఅతిథిగా కలెక్టర్ దినేష్ కుమార్ హాజరయ్యారు. ఎస్పీ అమిత్ బర్దర్ కూడా పాల్గొన్నారు. పరేడ్ ఘనంగా జరిగింది. శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు సత్కరించారు కలెక్టర్. మరోవైపు వివిధ శాఖల ఆధ్వర్యంలో దాదాపుగా 15వ కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఉత్పత్తులు అవగాహన పెంచే లా ప్రదర్శన పెట్టారు.
అయితే అటవీ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్టాల్‌లో నాలుగు జాతుల పాములను ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. జెర్రిపోతూ, రక్తపింజరి, నాగుపాము, బొడ్డ పాములను ప్రదర్శనకు పెట్టారు. పాము కాటు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఏ పాము ఎంతటి అపాయం అన్న దానిపైనా వివరించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్లాస్ కేజ్ లలో ఈ పాములను ఉంచారు. వీటితోపాటు పాముల రకాలతో పోస్టర్ను కూడా ఏర్పాటు చేశారు అధికారులు. అందరూ ఆ పాములను ఆసక్తిగా తిలకిస్తూనే.. వాటి గురించి అడిగి తెలుసుకున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
