AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISRO: తగ్గేదే లే.. సెంచరీ కొట్టేందుకు రెడీ అయిన ఇస్రో..

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ....ఇస్రో, సెంచరీ కొట్టడానికి సై అంటోంది. ఈ నెల 29న, 100వ రాకెట్‌ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. ఓ స్పెషల్‌ రాకెట్‌ ద్వారా శాటిలైట్‌ ప్రయోగంతో ఈ సెంచరీ స్పెషల్‌ ఉండనుంది. ఈ ప్రయోగంతో అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో కొత్త మైలురాయిని చేరుకోనుంది ఇస్రో.

ISRO: తగ్గేదే లే..  సెంచరీ కొట్టేందుకు రెడీ అయిన ఇస్రో..
100th Satellite
Ram Naramaneni
|

Updated on: Jan 26, 2025 | 6:24 PM

Share

2025లో తొలి ప్రయోగం కమ్‌ వందో రాకెట్‌ ప్రయోగానికి ఇస్రో…రెడీ వన్‌ టూ త్రీ అంటోంది. ఈ కీలక రాకెట్‌ ప్రయోగానికి ఇస్రో సైంటిస్టులు ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా GSLV F-15 రాకెట్‌తో NVS-02 నావిగేషన్‌ ఉపగ్రహాన్ని…జియో ట్రాన్స్‌మిషన్‌ ఆర్బిట్‌లోకి పంపనుంది. దీనికోసం శ్రీహరికోటలోని షార్‌ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ప్రయోగం విశేషాలేంటో తెలుసుకుందాం.

1980లో విజయవంతంగా తొలి శాటిలైట్‌ ప్రయోగం చేసింది ఇస్రో.  ఈ నెల 29న వందో రాకెట్‌ ప్రయోగాని రెడీ అయింది.  -GSLV F-15 రాకెట్‌ ద్వారా కక్ష్యలోకి NVS-02 శాటిలైట్‌ పంపనుంది. 36వేల కి.మీ. దూరంలో ఉన్న కక్ష్యలోకి చేరనుంది ఈ శాటిలైట్‌. ఉపగ్రహం బరువు 2,250 కిలోలు. పదేళ్ల పాటు ఈ శాటిలైట్‌ సేవలు అందించనుంది

ఇక ఈ ఉపగ్రహ ప్రయోగంతో భారత్‌కు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో తెలుసుకుందాం… 

  • –NVS-02…సెకండ్‌ జనరేషన్‌ నావిగేషన్‌ శాటిలైట్‌
  • –నావిగేషన్‌ వ్యవస్థను మరింత మెరుగు పరుస్తుంది
  • –5 ఉపగ్రహాల సిరీస్‌లో ఇది రెండోది
  • –అమెరికా గ్లోబల్‌ పొజిషన్‌ శాటిలైట్ వ్యవస్థ లాగా సేవలు అందిస్తుంది
  • –అందుబాటులోకి పొజిషనింగ్‌, నావిగేషన్‌, టైమింగ్‌ సేవలు
  • –ఈ సేవలు భారత ఉపఖండానికి మాత్రమే పరిమితం
  • –మన సరిహద్దులు దాటి 1500 కి.మీ. దూరం వరకు దీని పరిధి
  • –ఈ శాటిలైట్‌లో దేశీ తయారీ రుబిడియం ఆటమిక్‌ క్లాక్స్
  • –ఆర్మీ,నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు నావిగేషన్‌ సేవలు
  • –సముద్రంలో మత్స్య సంపద ఉన్న ప్రాంతాలను గుర్తిస్తుంది

గత ఏడాది, డిసెంబర్ 30 న ప్రయోగించిన PSLV- C 60 రాకెట్ ప్రయోగం ద్వారా 99 రాకెట్ ప్రయోగాలు పూర్తి చేసుకున్న ఇస్రో, మరో మూడు రోజుల్లో వందో ప్రయోగంతో సరికొత్త మైలురాయిని చేరుకోనుంది. 2025లోనూ అస్సల్‌ తగ్గేదేలే అంటోంది ఇస్రో. కొత్త ఏడాది ప్రారంభంలోనే మరో చరిత్ర సృష్టించింది. ఇటీవల నింగిలోకి పంపించిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసింది. స్పేడెక్స్‌ డాకింగ్‌ ప్రక్రియను విజయవంతంగా పరీక్షించి, ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా అవతరించింది భారత్‌. ఇప్పుడు ఈ వందో ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రోకి TV-9 ఆల్‌ ది బెస్ట్‌ చెబుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..