AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీశైల మలన్న దర్శనానికి వెళ్తున్న యువకులపై ఎలుగుబంటు దాడి.. ఒకరికి సీరియస్!

శ్రీశైలం - సున్నిపెంటలో ఈ మద్యకాలంలో చిరుతపులులు ఎలుగుబంట్లు ఎక్కువైయ్యాయి. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట చిరుతపులులు సంచరిస్తున్నాయని, వాటి నుంచి రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. తాజా శ్రీశైలం వెళ్తున్న ముగ్గురు యువకులపై ఎలుగుబంటు దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

శ్రీశైల మలన్న దర్శనానికి వెళ్తున్న యువకులపై ఎలుగుబంటు దాడి.. ఒకరికి సీరియస్!
Bear Attack
J Y Nagi Reddy
| Edited By: Balaraju Goud|

Updated on: Jan 26, 2025 | 5:17 PM

Share

ఒకవైపు చిరుతలు, మరోవైపు పెద్ద పులులు.. తాజాగా ఎలుగుబంట్లు.. ఇలా ఒకదాని తర్వాత మరోకటి అడవులు వదిలి జనావాసాల్లోకి వస్తున్నాయి. శ్రీశైలం సున్నిపెంట రోడ్డు మార్గంలో ముగ్గురు యువకులపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో శ్రీశైలం వెళ్లే భక్తుల్లో ఆందోళన నెలకొంది. ఎటు వైపు నుంచి ఏ జంతువు దాడి చేస్తుందోనన్న వణికిపోతున్నారు.

నంద్యాల జిల్లా శ్రీశైలం – సున్నిపెంట ఘాట్ రోడ్డులో ముగ్గురి యువకులపై ఎలుగుబంటి దాడి చేసింది. ఎలుగుబంటి దాడిలో ముగ్గురు యువకులు గాయాలపాలైయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన సున్నిపెంట వైద్యాశాలకు తరలించారు. వైద్యులు ప్రథమ సికిచ్చ నిర్వహించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు జిల్లా వైద్యశాలకు రెఫర్ చేశారు. అయితే సున్నిపెంటకు చెందిన రామ్ నాయక్ వారి స్నేహితులతో కలసి స్కూటి మీద శ్రీశైలానికి ఉదయాన్నే బయలుదేరాడు. శ్రీశైలం రోడ్డులోని సున్నిపెంట ఈద్గా సమీపంలోని పొదల నుంచి ఎలుగుబంటి ఒక్కసారిగా బయటకు వచ్చి స్కూటీపై వెలుతున్న వారిపై దాడి చేసింది.

ఈ హఠాత్తు పరిణామంతో రామ్ నాయక్ తోసహా ముగ్గురు యువకులు కిందపడిపోయారు. దీంతో ముగ్గురిపై ఎలుకు బంటు దాడి చేసి గాయపరిచింది. అటు నుంచి ఆర్టీసి బస్సు ఎదురుగా వచ్చి హారన్ వేయడంతో ఎలుగుబంటి అడవిలోకి పారిపోయిందని బాధితులు తెలిపారు. దీంతో ప్రాణాపాయం నుంచి ముగ్గురు యువకులు బయటపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు గాయపడ్డ యువకులను హుటాహుటిన దగ్గరలోని సున్నిపెంట ప్రభుత్వ వెద్యశాలకు తరలించారు. శ్రీశైలం – సున్నిపెంటలో ఈ మద్యకాలంలో చిరుతపులులు ఎలుగుబంట్లు ఎక్కువైయ్యాయి. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట చిరుతపులులు సంచరిస్తున్నాయని, వాటి నుంచి రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..