Republic Day 2025: ఊరూ, వాడా గణతంత్ర వేడుకలు.. అబ్బురపరిచే రీతిలో త్రివర్ణ పతాక రెపరెపలు..
అటు,ఆంధ్రప్రదేశ్‌లోనూ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ పలువురు పాల్గొన్నారు.

దేశవ్యాప్తంగా 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. మారుమూల గ్రామాల నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు ఊరువాడా దేశభక్తి ఉప్పొంగింది. ఇటు తెలంగాణ, అటు ఏపీ వ్యాప్తంగా ఈ వేడుకలు అంబరాన్నంటాయి. సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు హాజరయ్యారు. అటు,ఆంధ్రప్రదేశ్‌లోనూ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ పలువురు పాల్గొన్నారు.
కర్నూలు జిల్లాలో 76వ గణతంత్ర వేడుకలు:
కర్నూలు జిల్లా ఆదోని మండలం అలసందగుత్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న విద్యార్థి పి.స్వప్న 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రయాన్ పై అర అంగుళం కలిగిన అతిచిన్న సూక్ష్మ కళాకృతిలో జాతీయ పతాకం ఆకృతిని తయారు చేసి అబ్బుర పరచింది. డ్రాయింగ్ ఉపాధ్యాయుడు యన్.కీర ప్రత్యేక శిక్షణతో ఈ సూక్ష్మకళాకృతిని చేసినట్టు తెలిపింది.
వీడియో ఇక్కడ చూడండి..
క్రయాన్ చాలా సున్నితంగా ఉండడం వలన చేసిన ప్రతిసారి విరిగిపోయేదని, రెండు రోజులుగా ప్రయత్నం చేసి తయారు చేశానని తెలుపింది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గిరిజాదేవి విద్యార్థి పి.స్వప్నని, డ్రాయింగ్ ఉపాధ్యాయుడు యన్.కీర ను ప్రత్యేకంగా అభినందించారు…

పిఠాపురంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన 250 అడుగుల త్రివర్ణ పతాకం:
కాకినాడ జిల్లా పిఠాపురం ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి… పిఠాపురం మండలం విరవాడ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన 250 అడుగుల త్రివర్ణ పతాకం ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.. ముందుగా భారీ త్రివర్ణ పతాకంతో హైస్కూల్ ఆవరణలో విద్యార్థులు కవాతు నిర్వహించారు… అలాగే భారత్ మాతాకీ జై అంటూ భారీ మువ్వెనలు జెండాతో గ్రామం మొత్తం విద్యార్థులతో కలిపి కూటమి నాయకులు ర్యాలీ నిర్వహించారు.. ఈ ర్యాలీతో గ్రామం మొత్తం దేశభక్తి అలుముకుంది.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నియోజకవర్గంలో భారీ జెండాతో చేసిన ఈ కార్యక్రమం పలువురికి ఆదర్శంగా నిలిచింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




