Watch: ఈమె అక్కకాదు.. తమ్ముడి శవాన్ని కూడా వదలకుండా ఇలా..! షాకింగ్ వీడియో చూసి భగ్గుమంటున్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో నిజంగా షాకింగ్‌గా ఉంది. హృదయ విదారకంగా ఉంది. సొంత అన్న మరణంతో చెల్లెలు కుంగిపోయింది. కానీ, ఆ బాధను కూడా రీల్స్ కోసం వాడుకుని అందరి చేత చీవాట్లు పెట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ్ముడు చనిపోయినా.. చుక్క కన్నీళ్లు పెట్టకుండా వీడియోలు తీస్తున్నారంటూ నెటిజన్లు భగ్గుమంటున్నారు.

ఇప్పుడంతా ఇంటర్‌నెట్ మాయాజాలం.. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ప్రజలు ఏదైనా చేసేందుకు సిద్ధపడుతున్న సమయం ఇది. వ్యూస్ లు, లైకుల రేసులో కొన్నిసార్లు మనుషులు మానవత్వం, సున్నితత్వం వంటి పరిమితులను దాటి ప్రవర్తిస్తున్నారు. . తాజాగా సోషల్ మీడియా వినియోగదారులను షాక్ కు గురిచేసే వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో, ఒక యువతి తన సోదరుడి మృతదేహం ముందే విపరీతంగా ప్రవర్తించింది. తమ్ముడు పోయిన బాధ ఏ మాత్రం లేకుండా శవాన్ని పక్కన పెట్టుకుని రీల్స్ తీసుకుంటోంది. ఆమె వీడియో షుట్ చేస్తుండగా, మరో మహిళ ఆమె ముందు అరుస్తూ ఏడుస్తోంది. ఈ వీడియో ఇంటర్ లో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు పట్టరాని ఆగ్రహంతో భగ్గుమంటున్నారు
ఈ వైరల్ వీడియో ప్రకారం.. ఒక గదిలో మృతదేహాన్ని ఉంచారు. ఆ పక్కనే కొందరు మహిళలు కూర్చుని ఏడుస్తున్నారు.వారిలో మృతుడి అక్కా, భార్య ఇతర మహిళలు కూడా కూర్చుని ఉన్నారు. ఇంతలో అతని అక్క చేతిలో సెల్ ఫోన్ పట్టుకుని వీడియో తీస్తుండగా, తోటి మహిళ ఏడవకు అంటూ ఆమెను ఓదారుస్తున్నటుగా నటిస్తోంది. ఇదంతా వారు వీడియోను షూట్ చేసుకుంటున్నారు.
View this post on Instagram
వైరల్ వీడియోలో వదిన బిగ్గరగా ఏడుస్తుంటే.. అన్నయ్య మృతదేహాన్ని చూసినా చెల్లెలు కన్నీళ్లు ఆపుకుని రీల్ షూట్ మొదలుపెట్టింది. వీడియో చూసిన జనాలు ఆశ్చర్యపోవడమే కాకుండా ఆమెపై ఆగ్రహంతో కామెంట్ల రూపంలో విరుచుకుపడ్డారు. ఈ వీడియో క్లిప్ జనవరి 16న Insta హ్యాండిల్ @noble_mobile_shopee ద్వారా షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ్ముడు చనిపోయినా.. చుక్క కన్నీళ్లు పెట్టకుండా వీడియోలు తీస్తున్నారంటూ నెటిజన్లు భగ్గుమంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




