Republic day 2024: ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. ముఖ్యఅతిథిగా ప్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్.. పరేడ్‌లో చేరనున్న ఫ్రెంచ్ బృందం
ప్రధాని మోడీతో కలిసి జైపూర్‌లో పలు కార్యక్రమాల్లో మెక్రాన్ పాల్గొన్నారు. ప్రసిద్దిగాంచిన అంబర్‌ఫోర్ట్‌ను సందర్శించారు. మోడీతో కలిసి రోడ్‌షోలో పాల్గొన్నారు మెక్రాన్. ఈ సందర్భంగా.. రోడ్డు పక్కనున్న టీ స్టాల్‌లో టీ తాగి UPIతో చెల్లింపులు జరిపారు. ప్రఖ్యాత హావా మహల్ సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన హస్తకళల స్టాల్‌లో కొన్ని వస్తువులను ఫ్రాన్స్ అధ్యక్షుడు కొనుగోలు చేశారు.
రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్యఅతిధిగా విచ్చేశారు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్. జైపూర్‌లో రోడ్ షో తర్వాత.. మెక్రాన్‌కు అయోధ్య రామాలయ నమూనా అందజేశారు ప్రధాని మోడీ.
భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచ్చిన మెక్రాన్‌కు జైపూర్ ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం లభించింది. తొలిరోజు జైపూర్ చేరుకున్నారు. రాజస్థాన్ గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా, ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. రిపబ్లిక్ డే పరేడ్‌కు ఫ్రెంచ్ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా రావడం ఇది ఆరోసారి. జైపూర్‌లో ప్రధాని మోదీ, మాక్రాన్‌ల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరుగుతుందని వార్తా సంస్థ తెలిపింది
ప్రధాని మోడీతో కలిసి జైపూర్‌లో పలు కార్యక్రమాల్లో మెక్రాన్ పాల్గొన్నారు. ప్రసిద్దిగాంచిన అంబర్‌ఫోర్ట్‌ను సందర్శించారు. మోడీతో కలిసి రోడ్‌షోలో పాల్గొన్నారు మెక్రాన్. ఈ సందర్భంగా.. రోడ్డు పక్కనున్న టీ స్టాల్‌లో టీ తాగి UPIతో చెల్లింపులు జరిపారు. ప్రఖ్యాత హావా మహల్ సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన హస్తకళల స్టాల్‌లో కొన్ని వస్తువులను ఫ్రాన్స్ అధ్యక్షుడు కొనుగోలు చేశారు. ఆయా కార్యక్రమాల తర్వాత.. జైపూర్‌లోని రామ్‌బాగ్ ప్యాలెస్ హోటల్‌లో రెండు దేశాల అధినేతలు.. ద్వైపాక్షిక చర్చలు జరిపి ఢిల్లీకి ప్రయాణమయ్యారు. రాజస్థాన్ అసెంబ్లీలో బీజేపీ గెలిచిన తర్వాత ప్రధాని మోదీ రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి.
ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సంబంధాలతోపాటు.. రఫెల్ డీల్‌పై ఇద్దరు నేతలు చర్చించారు. భారత్- ఫ్రాన్స్ మధ్య 25 ఏళ్ల ద్వైపాక్షిక ఒప్పందం కుదిరి 25 ఏళ్లు పూర్తి కాగా.. గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారత్ వచ్చిన ఫ్రాన్స్ ఆరో అధ్యక్షుడిగా మెక్రాన్ నిలిచారు. గతంలో ఫ్రెంచ్ అధ్యక్షులు ఫ్రాంకోయిస్ హోలాండ్, నికోలస్ సర్కోజీ, జాక్వెస్ చిరాక్, వాలెరీ గిస్కార్డ్ డి ఎస్టేయింగ్ భారత్‌లో పర్యటించారు. మెక్రాన్ తన రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌తో పలు ఒప్పందాలు చేసుకోనున్నారు. ముఖ్యంగా.. రక్షణ, భద్రత, క్లీన్ ఎనర్జీ, వాణిజ్యం, పెట్టుబడులు, కొత్త సాంకేతికతోపాటు ఇతర రంగాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక.. రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కు అయోధ్య రామాలయ నమూనా అందజేశారు ప్రధాని మోదీ. ఫ్రాన్స్‌తో స్నేహబంధం ఎప్పటికీ కొనసాగుతుందని స్పష్టం చేశారు ప్రధాని మోదీ.
పరేడ్‌లో చేరనున్న ఫ్రెంచ్ బృందం: ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు 95 మంది సభ్యులతో కూడిన కవాతు బృందం, 33 మంది సభ్యులతో కూడిన బ్యాండ్ కాంటెంజెంట్, రెండు రాఫెల్ యుద్ధ విమానాలు, ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ ఏ330 మల్టీ రోల్ ట్యాంకర్ రవాణా విమానం కూడా వేడుకల్లో పాల్గొంటాయి
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..