Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tholu Bommalata: ఆదరణ కరువై కనుమరుగైపోతున్న తోలుబొమ్మలాట.. వీధిన పడుతున్న కళాకారులు

ప్రేక్షకులకు సినిమా పరిచయం లేని రోజుల్లో ఓ వెలుగు వెలిగిన తోలుబొమ్మలాట ప్రదర్శన క్రమంగా ఆదరణ కోల్పోతూ వస్తోంది. సినిమాల రాకతో తోలు బొమ్మలాట ప్రభావం కొంత తగ్గినా.. టీవీలు, ఆ తర్వాత ఫోన్ల రాకతో బొమ్మలాట దాదాపుగా కనుమరుగైంది. చాలా ప్రాంతాల్లో తోలుబొమ్మలాట కళాకారులు, వారి వారసులు ప్రత్యామ్నాయ వృత్తులను ఆశ్రయించారు. దీంతో తర్వాత తరం బొమ్మలాట కళకు దూరమైంది.

Tholu Bommalata: ఆదరణ కరువై కనుమరుగైపోతున్న తోలుబొమ్మలాట.. వీధిన పడుతున్న కళాకారులు
Tholu Bommalata
Follow us
Surya Kala

|

Updated on: Jan 15, 2024 | 8:46 AM

ఓ వెలుగు వెలిగిన తోలుబొమ్మలాట రోజు రోజుకూ ఆదరణ కోల్పోతూ వస్తోంది. టీవీలు, ఫోన్ల రాకతో దాదాపుగా కనుమరుగైంది. కళాకారులు, వారి వారసులు ప్రత్యామ్నాయ వృత్తులను ఆశ్రయించారు. ప్రభుత్వం తమను ప్రోత్సహించాలని కోరుతున్నారు కళాకారులు. ప్రేక్షకులకు సినిమా పరిచయం లేని రోజుల్లో ఓ వెలుగు వెలిగిన తోలుబొమ్మలాట ప్రదర్శన క్రమంగా ఆదరణ కోల్పోతూ వస్తోంది. సినిమాల రాకతో తోలు బొమ్మలాట ప్రభావం కొంత తగ్గినా.. టీవీలు, ఆ తర్వాత ఫోన్ల రాకతో బొమ్మలాట దాదాపుగా కనుమరుగైంది. చాలా ప్రాంతాల్లో తోలుబొమ్మలాట కళాకారులు, వారి వారసులు ప్రత్యామ్నాయ వృత్తులను ఆశ్రయించారు. దీంతో తర్వాత తరం బొమ్మలాట కళకు దూరమైంది.

ఒకప్పుడు బొమ్మలాటకు గ్రామాల్లో తిరుగులేని ఆదరణ ఉండేది. క్రీస్తు పూర్వమే పుట్టిన బొమ్మలాట కళ 1980వ దశకం వరకు వైభవంగా నడిచింది. బొమ్మలాట కళాకారులు రామాయణం, భారతంలోని దాదాపు 30 ఘట్టాలను ప్రదర్శించేవారు. ఈ తోలు బొమ్మలాట ప్రదర్శనకు పది మంది కళాకారులు అవసరం. హార్మోనియం, తబలా, డబ్బా తదితర సంగీత వాయిద్యాలను వాయించే వారితోపాటు మిగిలిన వారు బొమ్మలు ఆడించడం, పద్యాలు పాడటం, అర్థం చెప్పేందుకు మరికొంతమంది కళాకారులు పనిచేసేవారు. మహిళలు సైతం పోటాపోటీగా పౌరాణిక ఘటనలను పద్యాల ద్వారా చెప్పి వినసొంపుగా అర్థాలు విడమరిచి చెప్పేవారు. తోలుబొమ్మలాటలో బొమ్మలు ఆడించడం ఒక కళ అయితే, వాటికి అనుగుణంగా పద్యాలు పాడి అర్థాలు చెప్పడం అంతకుమించిన కళ.

తోలుబొమ్మలాటకు క్రమంగా ఆదరణ తగ్గడంతో కళాకారులు వీధిన పడ్డారు. వృత్తిని పక్కనపెట్టి బతుకుదెరువు కోసం రకరకాల వృత్తులను ఎంచుకొక తప్పని పరిస్థితి. కళను ప్రోత్సహించాలంటున్న కళాకారులు అంతరించిపోతున్న బొమ్మలాట కళను నిలబెట్టుకునేలా ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఆత్మకూరు నియోజకవర్గంలో ఈ కళాకారుల కుటుంబాలు దశాబ్దాల క్రితం ఇక్కడ స్థిరపడ్డాయి. దీంతో స్థానిక ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి తోలుబొమ్మలాట ప్రదర్శన కోసం సొంత నిధులతో 15 లక్షల వ్యయంతో భవనాన్ని నిర్మిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..