AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sankranti: విశాఖలో అంబరాన్ని తాకుతున్న సంక్రాంతి సంబరాలు .. సాగర తీరంలో గాలిపటాల కనువిందు

సంక్రాంతి పండుగకు విశాఖ సాగర తీరంలో ఆకాశం అంతా గాలి పటాలతో కనువిందు చేస్తుంది. బీచ్ పరిసర ప్రాంతాల్లో కైట్ ఫెస్టివల్ సందడి నెలకొంది. పతంగులను ఎగురవేసేందుకు పెద్దలతో పాటు చిన్నారులు, మహిళలు యువతులు పోటీ పడుతున్నారు. విభిన్న ఆకృతుల్లో పతంగులు ఆకాశంతో ఎగరవెస్తూ సందడి చేస్తున్నారు. మార్వాడి మంచ్ సంఘం ఆధ్వర్యంలో బీచ్ రోడ్ లో చిన్నా , పెద్దా అంతా పాల్గొని పతంగుల పండుగను జరుపుకున్నారు.

Sankranti: విశాఖలో అంబరాన్ని తాకుతున్న సంక్రాంతి సంబరాలు .. సాగర తీరంలో గాలిపటాల కనువిందు
Sankranti In Visakha
Surya Kala
| Edited By: |

Updated on: Jan 16, 2024 | 1:17 PM

Share

తెలుగువారింట సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సాంప్రదాయ పద్దతిలో భోగి, సంకాంత్రి, కనుమగా జరుపుకుంటారు. ఇక ఏపీ ఆర్దిక రాజధాని విశాఖలో సంక్రాంతి సందడి మాములుగా ఓరేంజ్‌లో ఉంది. ఒకవైపు బీచ్‌లో కైట్‌ ఫెస్టివల్..మరోవైపు నెహ్రు యువ కేంద్రంలో బొమ్మల కొలువుతో ఎంజాయ్ చేస్తున్నారు విశాఖ వాసులు.

సంక్రాంతి పండుగకు విశాఖ సాగర తీరంలో ఆకాశం అంతా గాలి పటాలతో కనువిందు చేస్తుంది. బీచ్ పరిసర ప్రాంతాల్లో కైట్ ఫెస్టివల్ సందడి నెలకొంది. పతంగులను ఎగురవేసేందుకు పెద్దలతో పాటు చిన్నారులు, మహిళలు యువతులు పోటీ పడుతున్నారు. విభిన్న ఆకృతుల్లో పతంగులు ఆకాశంతో ఎగరవెస్తూ సందడి చేస్తున్నారు. మార్వాడి మంచ్ సంఘం ఆధ్వర్యంలో బీచ్ రోడ్ లో చిన్నా , పెద్దా అంతా పాల్గొని పతంగుల పండుగను జరుపుకున్నారు. సాగర తీరం అంతా రంగులమయమైంది. విశాఖకు వచ్చిన పర్యాటకులు సాగర తీరంలో ఈ సందడి వాతావరణాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. వివిధ ఆకృతుల్లో ఉన్న పతంగులు ఆకాశంలో ఎగురుతూ పక్షులను ఆకట్టుకున్నాయి. విశాఖ సాగర్ తీరంలో పతంగులు ఎగరవేయడం తమకు ఎంతో ఆనందానిచ్చిందని నగరవాసులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు విశాఖ నెహ్రూ యువ కేంద్రంలో సంక్రాంతి సందర్భంగా బొమ్మల కొలువు నిర్వహించారు. వివిధ రకాల చిట్టి చిట్టి బొమ్మలు కనువిందు చేసాయి. ముచ్చట గోలిపే బొమ్మలు చూసేందుకు పోటీ పడ్డారు ప్రజలు. భోగినాడు పెట్టి, కనుమ రోజున కొలువు ఎత్తేస్తారు. అలా మూడు రోజులే ఉంటుంది ఈ కొలువు. విశాఖలో బొమ్మల కొలువు ఆకట్టుకుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ప్రపంచంలో ఎన్ని రకాల క్యాలెండర్లు ఉన్నాయో తెలుసా..?
ప్రపంచంలో ఎన్ని రకాల క్యాలెండర్లు ఉన్నాయో తెలుసా..?
ప్రభుత్వం నుంచి మరో గుడ్‌న్యూస్.. ఉచితంగా రూ.5లక్షల జీవిత బీమా!
ప్రభుత్వం నుంచి మరో గుడ్‌న్యూస్.. ఉచితంగా రూ.5లక్షల జీవిత బీమా!
ఇమ్యూనిటీని పెంచే ఉసిరికాయ, పచ్చిమిర్చి పప్పు.. ఎలా చెయ్యాలంటే
ఇమ్యూనిటీని పెంచే ఉసిరికాయ, పచ్చిమిర్చి పప్పు.. ఎలా చెయ్యాలంటే
హైదరాబాద్ వాసులకు మరో సూపర్ గుడ్ న్యూస్
హైదరాబాద్ వాసులకు మరో సూపర్ గుడ్ న్యూస్
సరిహద్దులు లేని ప్రేమ.. సిసిటివి కెమెరా వారధిగా పలకరిపులు
సరిహద్దులు లేని ప్రేమ.. సిసిటివి కెమెరా వారధిగా పలకరిపులు
ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. దారుణంగా పడిపోయిన రూపాయి!
ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. దారుణంగా పడిపోయిన రూపాయి!
రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. కొత్తగా 2లక్షల పెన్షన్లు
రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. కొత్తగా 2లక్షల పెన్షన్లు
మష్రూమ్ చికెన్ మసాలా కర్రీ ఇలా చేస్తే.. మూడు ప్లేట్స్ లాగిస్తారు
మష్రూమ్ చికెన్ మసాలా కర్రీ ఇలా చేస్తే.. మూడు ప్లేట్స్ లాగిస్తారు
విద్యార్థులకు సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. నెలకు రూ.2వేలు..
విద్యార్థులకు సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. నెలకు రూ.2వేలు..
బట్టల మీద ఏ మరకైనా సరే.. ఈ సింపుల్ చిట్కాతో పోగొట్టుకోండి..
బట్టల మీద ఏ మరకైనా సరే.. ఈ సింపుల్ చిట్కాతో పోగొట్టుకోండి..