AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramatirtham: సీతారాములు విడిది చేసిన ఈ క్షేత్రం హొన్నావర్. ఈ క్షేత్రంలోని తీర్ధం అనేక వ్యాధులకు ఔషధం..

త్రేతాయుగంలో లంకకు వెళ్లి సీతాదేవిని రక్షించడానికి దానవ చక్రవర్తి రావణాదిలను సంహరించి తర్వాత శ్రీరాముడు.. లక్ష్మణ, సీత, హనుమంతుడితో కలిసి అయోధ్యకు తిరిగి వస్తుండగా రామయ్య తన వాళ్లతో కలిసి ఈ ప్రాంతానికి వచ్చాడు. అప్పుడు ఈ ప్రదేశం దట్టమైన అడవి కావడంతో దాహం తీర్చుకోవడానికి చుక్క నీరు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. అప్పుడు శ్రీరాముడు, లక్ష్మణుడు రెండు దివ్య బాణాలను ప్రయోగించి రెండు తీర్థాలను సృష్టించారు. తరువాత కాలక్రమంలో రామతీర్థంగా ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రం.

Ramatirtham:  సీతారాములు విడిది చేసిన ఈ క్షేత్రం హొన్నావర్. ఈ క్షేత్రంలోని తీర్ధం అనేక వ్యాధులకు ఔషధం..
Honnavar ramalingeswara temple
Surya Kala
|

Updated on: Jan 08, 2024 | 7:39 PM

Share

లంకలో ఉన్న సీత దేవిని రావణాసురుడు చెర నుంచి విడిపించడానికి శ్రీ రాముడు తన వానర సైన్యంతో వెళ్లి యుద్ధం చేసి రావణుడిని సంహరించాడు. తర్వాత విభీషుడిని లంకకు అధిపతిగా నియమించి భార్య సమేతుడై అయోధ్యకు పయణం అయ్యాడు. రామాయణం ప్రకారం బ్రాహ్మణుడైన రావణుడిని సంహరించిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వెళ్లే మార్గంలో తన పాప విముక్తి కోసం అనేక ప్రదేశాలలో పాప పరిహారం కోసం అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించాడు.. వివిధ రకాల పూజలను చేశాడనే ప్రస్తావన ఉంది. అలాంటి పుణ్యక్షేత్రాలలో ఒకటి శ్రీరామ తీర్థం. ఈ క్షేత్రం ఉత్తర కర్ణాటకలోని హొన్నావర్ తాలూకాలో ఉంది.

త్రేతాయుగంలో లంకకు వెళ్లి సీతాదేవిని రక్షించడానికి దానవ చక్రవర్తి రావణాదిలను సంహరించి తర్వాత శ్రీరాముడు.. లక్ష్మణ, సీత, హనుమంతుడితో కలిసి అయోధ్యకు తిరిగి వస్తుండగా రామయ్య తన వాళ్లతో కలిసి ఈ ప్రాంతానికి వచ్చాడు. అప్పుడు ఈ ప్రదేశం దట్టమైన అడవి కావడంతో దాహం తీర్చుకోవడానికి చుక్క నీరు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. అప్పుడు శ్రీరాముడు, లక్ష్మణుడు రెండు దివ్య బాణాలను ప్రయోగించి రెండు తీర్థాలను సృష్టించారు. తరువాత కాలక్రమంలో రామతీర్థంగా ప్రసిద్ధి చెందింది ఈ క్షేత్రం.

శివ భక్తుడైన రావణుని సంహరించిన పాపానికి ప్రాయశ్చిత్తంగా శివాలయాన్ని నిర్మించమని దేవతలు శ్రీరాముడిని ఆదేశించారు. శ్రీరాముడు బలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు. అందుకే ఈ ఆలయాన్ని రామేశ్వర ఆలయం అని పిలుస్తారు. ఈ ప్రాంతంలోని ఈ (రామ) తీర్థంలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయి. మానసిక వ్యాధులు నయమవుతాయి. చర్మవ్యాధులు నయమవుతాయని, భయం తొలగిపోయి జీవితంలో కొత్త ఆశ, ఆత్మవిశ్వాసం పుడుతుందని నమ్మకం.

భక్తులు ఆ తీర్థంలోని నీటిని సేకరించి ఇంటికి తీసుకొచ్చి అత్యవసర పరిస్థితుల్లో తీర్థంగా వాడుకోవడం ఆనవాయితీ. అవతార పురుషుడిగా పేరొందిన శ్రీ ధర స్వామి ఈ ప్రదేశంలో సుమారు 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఈ క్షేత్రాన్ని కేంద్రంగా చేసుకుని చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో పర్యటించి పదుల సంఖ్యలో ఆలయాలు స్థాపించి వందలాది మంది భక్తుల సమస్యలను పరిష్కరించి పరి వ్రాజకులుగా స్థిరపడ్డారు. ఆలయం వెనుక భాగంలో శ్రీధర స్వామి నిర్మించిన దత్తాత్రేయ మందిరం, ధ్యాన మందిరం ఉన్నాయి. ఈ క్షేత్రంలో భక్తులు వారాల తరబడి బస చేసి యోగా, ధ్యానం, పూజలు నిర్వహించి మానసిక ప్రశాంతత పొందుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..