Ayodhya: న్యూయార్క్‌లోని ఐకానిక్ టైమ్స్ స్క్వేర్‌లో రామమందిర ప్రారంభోత్సవం ప్రత్యక్ష ప్రసారం
జనవరి 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమం విదేశాల్లో కూడా ప్రత్యక్ష ప్రసారం కానుంది. జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట ఫంక్షన్ ను లైవ్ టెలికాస్ట్ చేయనున్నామని చెప్పారు.
జనవరి 22వ తేదీన అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ కార్యక్రమానికి రామజన్మభూమి ట్రస్ట్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. విదేశాల్లో ఉన్న రామ భక్తులు, భారతీయులు సైతం ఈ శుభ ఘట్టాన్ని చూసేందుకు ఎదురుచూస్తున్నారు. జనవరి 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమం విదేశాల్లో కూడా ప్రత్యక్ష ప్రసారం కానుంది.
జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట ఫంక్షన్ ను లైవ్ టెలికాస్ట్ చేయనున్నామని చెప్పారు. విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు సమాచారం.
#WATCH USA: A digital billboard of #RamMandir comes up in New York’s Times Square.
Prime Minister Narendra Modi performed ‘Bhoomi Pujan’ of #RamMandir in Ayodhya, Uttar Pradesh earlier today. pic.twitter.com/Gq4Gi2kfvR
— ANI (@ANI) August 5, 2020
రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట తర్వాత భారతదేశం, రామభక్తులను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. దేశంలోని గ్రామ స్థాయిలో కూడా అయోధ్య ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు రామ భక్తులు ఇప్పటికే అన్ని సన్నాహాలు చేశారు. అంతేకాదు ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో ప్రసారం చేయాలని బీజేపీ పార్టీ కార్యకర్తలకు సూచించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, వేడుకలను ప్రధాని మోడీ పర్యవేక్షిస్తున్నారు. రామమందిర నిర్మాణ సమితి అధినేత నృపేంద్ర మిశ్రా మాట్లాడుతూ, రామ్‌లల్లా ప్రతిస్థ సందర్భంగా అనుసరించాల్సిన అన్ని చర్యల గురించి చెప్పారు.
పాత రామ విగ్రహం, కొత్త రామ విగ్రహం రెండూ గర్భాలయంలో ప్రతిష్టించనున్నారు. పాత రామ విగ్రహాన్ని ఉత్సవ రాముడిగా పిలుస్తారు. రెండు విగ్రహాలను కొత్త రామమందిరంలో ఉంచుతామని నృపేంద్ర మిశ్రా తెలిపారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..