Ayodhya: అయోధ్యకు వెళ్లడంకంటే సింగపూర్, బ్యాంకాక్‌ కు వెళ్లడం ఈజీ.. ఆకాశాన్ని తాకుతున్న విమాన టికెట్ ధరలు

రామ్ లాలా విగ్రహ ప్రతిష్టాపనకు ముందు విమాన ఛార్జీలు కూడా చుక్కలను తాకుతున్నాయి. దేశంలో నలుమూలల నుంచి అయోధ్యకు వెళ్లే విమానాల ఛార్జీలు అనేక అంతర్జాతీయ మార్గాల్లోని విమానాల టికెట్ ధరల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే సింగపూర్, బ్యాంకాక్‌లకు వెళ్లడం కంటే ఇప్పుడు అయోధ్యకు వెళ్లడం ఖరీదైనదిగా మారింది. నిజానికి జనవరి 22న రామమందిరం ప్రారంభోత్సవానికి ముందే అయోధ్య నగరానికి పర్యాటకుల తాకిడి మొదలైంది. ఇది హోటల్,  రైలుతో పాటు ఇప్పుడు విమాన ఛార్జీలపై ప్రభావం చూపుతోంది.

Ayodhya: అయోధ్యకు వెళ్లడంకంటే సింగపూర్, బ్యాంకాక్‌ కు వెళ్లడం ఈజీ.. ఆకాశాన్ని తాకుతున్న విమాన టికెట్ ధరలు
Airfare To Ayodhya Hiked
Follow us
Surya Kala

|

Updated on: Jan 08, 2024 | 3:33 PM

అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరం చేశారు. రామ మందిరం ప్రారంభోత్సవం రోజుల్లో జరగనుండడంతో ప్రజల్లో విపరీతమైన ఉత్సాహం నెలకొంది. అదే సమయంలో, రామ్ లాలా విగ్రహ ప్రతిష్టాపనకు ముందు విమాన ఛార్జీలు కూడా చుక్కలను తాకుతున్నాయి. దేశంలో నలుమూలల నుంచి అయోధ్యకు వెళ్లే విమానాల ఛార్జీలు అనేక అంతర్జాతీయ మార్గాల్లోని విమానాల టికెట్ ధరల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే సింగపూర్, బ్యాంకాక్‌లకు వెళ్లడం కంటే ఇప్పుడు అయోధ్యకు వెళ్లడం ఖరీదైనదిగా మారింది.

నిజానికి జనవరి 22న రామమందిరం ప్రారంభోత్సవానికి ముందే అయోధ్య నగరానికి పర్యాటకుల తాకిడి మొదలైంది. ఇది హోటల్,  రైలుతో పాటు ఇప్పుడు విమాన ఛార్జీలపై ప్రభావం చూపుతోంది. జనవరి 19న ముంబయి నుంచి అయోధ్యకు వెళ్లే టిక్కెట్‌ను తనిఖీ చేయగా, ఇండిగో విమానానికి రూ. 20,700గా చూపిస్తోంది. అదేవిధంగా జనవరి 20వ తేదీ విమానానికి కూడా దాదాపు రూ.20 వేలు ధర పలుకుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు అన్ని విమానయాన సంస్థల పరిస్థితి కూడా ఇదే.

సింగపూర్ విమానాల టికెట్ ధర చౌకగా ఉంది..

ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం అయోధ్యకు విమాన ఛార్జీలు అనేక అంతర్జాతీయ విమాన టికెట్ ధర కంటే ఎక్కువగా ఉన్నాయి. జనవరి 19న ముంబై నుంచి సింగపూర్‌కు వెళ్లే విమాన టికెట్ ను పరిశీలిస్తే  నేరుగా ఎయిర్ ఇండియా విమానానికి రూ. 10,987గా చూపిస్తోంది. అదేవిధంగా జనవరి 19న ముంబై నుంచి నేరుగా బ్యాంకాక్‌కు వెళ్లేందుకు టికెట్ ధర రూ .13,800 లు చూపిస్తోంది.

ఇవి కూడా చదవండి

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు.. నగరంలో కొత్త విమానాశ్రయం ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ఈ విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు పెట్టారు. ఇటీవలే ఈ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రస్తుతం, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో అనే రెండు విమానయాన సంస్థలు మాత్రమే అయోధ్యకు విమానాలను నడుపుతున్నట్లు ప్రకటించాయి.

ఆలయ ప్రారంభోత్సవానికి ముందు అయోధ్యలో అనేక రకాల వ్యాపార కార్యకలాపాలు ఊపందుకున్నాయి. రానున్న రోజుల్లో ఏర్పడనున్న డిమాండ్‌, భారీ టూరిజం మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు నగరంలో కార్యకలాపాల కోసం సన్నాహాలు చేస్తున్నాయి. అయోధ్యలోని హోటల్స్ కోసం అత్యధికంగా వెదుకుతున్నారని ఆతిథ్య సంస్థ ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ వారం క్రితం చెప్పారు. ఇప్పుడు గోవా వంటి పర్యాటక ప్రాంతాలు  కూడా అయోధ్య కంటే పర్యాటకంగా వెనుకబడే పరిస్థితి నెలకొందని అంటున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..