Visakha: విశాఖలో మరో డెస్టినేషన్ .. తెన్నేటి పార్కు వద్ద ఫ్లోటింగ్ సీ బ్రిడ్జ్.. ఎప్పటి నుంచి ప్రారంభం అంటే..

సముద్రంలో తేలియాడుతున్నట్టు కనిపించే ఈ వంతెనపై ఒకేసారి 100 మంది అడుగు పెట్టే విధంగా దీన్ని రూపొందించారు. అదే సమయం లో సముద్రంలోకి 100 మీటర్లు నడిచే అవకాశం ఉంది. ఆ మేరకు ఏర్పాట్లు దాదాపు పూర్తయింది. జిల్లా కలెక్టర్ కూడా ఆయిన వీ ఎం అర్ డీ ఏ కమిషనర్ డాక్టర్ ఏ . మల్లికార్జున్ టీవీ9 తో మాట్లాడుతూ సంక్రాంతి నాటికి ఎఫ్‌ఎస్‌బి పూర్తి చేయాలని మేము డివెలపర్‌ను కోరామని చెప్పారు

Visakha: విశాఖలో మరో డెస్టినేషన్ .. తెన్నేటి పార్కు వద్ద ఫ్లోటింగ్ సీ బ్రిడ్జ్.. ఎప్పటి నుంచి ప్రారంభం అంటే..
Floating Bridge In Visakha
Follow us
Eswar Chennupalli

| Edited By: Surya Kala

Updated on: Jan 08, 2024 | 3:11 PM

విశాఖలో ఇటీవలే అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ ప్రారంభం అయిన నేపథ్యం లో మరొక స్టన్నింగ్ డెస్టినేషన్ ను ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది విశాఖ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ. విదేశీ టూరిస్ట్ లతో పాటు పెద్ద సంఖ్యలో విశాఖకు టూరిస్టులు వచ్చే అవకాశం ఉండడం తో పలు పర్యాటక ప్రాజెక్టులను చేపట్టేందుకు సిద్ధమైన వీ ఎం అర్ డీ ఏ ఫ్లోటింగ్ సీ బ్రిడ్జ్ ను నిర్మించాలని నిర్ణయించింది. కేరళలోని త్రిసూర్‌లోని చావక్కడ్ బీచ్‌లోని ఎఫ్‌ఎస్‌బి తరహాలో రూపొందించబడిన దీని నిర్మాణం ఈ నెల 10 వ తేదీన ప్రారంభం కానుంది.

విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ – VMRDA జనవరి 10 నుండి ఈ ఫ్లోటింగ్ సీ బ్రిడ్జ్ పనిని ప్రారంభించడానికి టెండర్లను పూర్తి చేసి కాంట్రాక్టర్ ను కూడా ఎంపిక చేసింది. ప్రముఖ ప్రైవేట్ కంపెనీ M/S శ్రీ సాయి మోక్ష షిప్పింగ్ & లాజిస్టిక్స్‌కు ఇప్పటికే అంగీకార పత్రాన్ని కూడా జారీ చేసేసింది. పనులను పూర్తి చేసి, జనవరి 15న జరుపుకునే సంక్రాంతి నాటికి ఎఫ్‌ఎస్‌బిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో వెళ్తోంది.

ఒకేసారి 100 మంది అడుగు పెట్టే అవకాశం

సముద్రంలో తేలియాడుతున్నట్టు కనిపించే ఈ వంతెనపై ఒకేసారి 100 మంది అడుగు పెట్టే విధంగా దీన్ని రూపొందించారు. అదే సమయం లో సముద్రంలోకి 100 మీటర్లు నడిచే అవకాశం ఉంది. ఆ మేరకు ఏర్పాట్లు దాదాపు పూర్తయింది.

ఇవి కూడా చదవండి

టికెట్ ధర 150 రూపాయల వరకు ఉండే అవకాశం

జిల్లా కలెక్టర్ కూడా ఆయిన వీ ఎం అర్ డీ ఏ కమిషనర్ డాక్టర్ ఏ . మల్లికార్జున్ టీవీ9 తో మాట్లాడుతూ సంక్రాంతి నాటికి ఎఫ్‌ఎస్‌బి పూర్తి చేయాలని మేము డివెలపర్‌ను కోరామని చెప్పారు. అది సాధ్యం కాకపోతే, జనవరి 20 నాటికి మేము మరో లక్ష్యాన్ని పెట్టుకున్నాము. ఇది ప్రభుత్వం నుండి జీరో-ఇన్వెస్ట్‌మెంట్ ప్రాజెక్ట్, అయితే VMRDAకి ఆపరేటర్ నుంచి ఏటా 15.3 లక్షల ఆదాయం వస్తుంది.

అనంతరం మరింత వివరిస్తూ గత సంవత్సరం చవక్కాడ్ బీచ్‌లోని ఎఫ్‌ఎస్‌బిని పరిశీలించడానికి ఒక అధికార బృందం త్రిస్సూర్‌ని సందర్శించింది. అది పర్యాటకులను బాగా ఆకర్షిస్తున్నట్లు గుర్తించాం. అందువల్ల  మేము అదే ప్రాజెక్ట్ ను ఇక్కడ ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నామన్నారు.

ఈ ఎఫ్‌ఎస్‌బి మొత్తం 100 మీటర్ల పొడవు వంతెనగా ఉంటుంది. సముద్రం లో 15 మీటర్ల వంతెన బీచ్‌లో, మిగిలిన 85 మీటర్ల పొడవైన వంతెన సముద్రపు నీటిపై తేలుతుంది. వ్యూ పాయింట్ వంతెన చివరిలో ఉంటుంది. వంతెన వెడల్పు సుమారు మూడు మీటర్లు. దీనిని HDPE మాడ్యులర్ ఫ్లోటింగ్ ఇటుకలతో నిర్మించనున్నారు. 1 కోటి వరకు నిర్మాణ వ్యయం అవుతుందని అంచనా వేశారు.

వీ ఎం అర్ డీ ఏ అధికారి మాట్లాడుతూ “ఎఫ్‌ఎస్‌బికి వచ్చే సందర్శకుల సౌకర్యార్థం పర్యాటక సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి సుమారు 100 చదరపు గజాల బీచ్‌ఫ్రంట్ ల్యాండ్‌ను కేటాయించామన్నారు. ఆంధ్రా యూనివర్శిటీ సెంటర్ ఫర్ స్టడీస్ మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రాజెక్ట్ రూపొందించబడుతుందనీ, ఆర్కే బీచ్, కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియం వంటి ప్రదేశాలను అధ్యయనం చేసిన తర్వాత తెన్నేటి పార్క్ వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వివరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..