School Girls: వారిని కలవాలనీ.. ఇంట్లో తెలియకుండా కొరియా బయలుదేరిన ముగ్గురు బాలికలు..! ఆ తర్వాత ఏం జరిగిందంటే..
సౌత్ కొరియాలో పాప్ బ్యాండ్ స్టార్లకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందులోనూ బిటిఎస్ గా పేరొందిన పాప్ బ్యాండ్ ట్రూప్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. వారిని కలవాలన్న కోరికతో 8వ తరగతి చదివే ముగ్గురు బాలికలు సౌత్ కొరియా వెళ్లాలని నిశ్చయించుకున్నారు. ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయారు. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలోని వెట్రిపాడికి చెందిన ముగ్గురు మైనర్ బాలికలు(13) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 8వతరగతి చదువుతున్నారు...

సౌత్ కొరియాలో పాప్ బ్యాండ్ స్టార్లకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అందులోనూ బిటిఎస్ గా పేరొందిన పాప్ బ్యాండ్ ట్రూప్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. వారిని కలవాలన్న కోరికతో 8వ తరగతి చదివే ముగ్గురు బాలికలు సౌత్ కొరియా వెళ్లాలని నిశ్చయించుకున్నారు. ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయారు. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలోని వెట్రిపాడికి చెందిన ముగ్గురు మైనర్ బాలికలు(13) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 8వతరగతి చదువుతున్నారు. ఇటీవల మొబైల్ ఫోన్లకు అలవాటు పడిన విద్యార్థులు షాట్స్, రీల్స్, మ్యూజిక్ ఆల్బమ్స్ కు అడిక్ట్ అవుతున్నారు. ఈ ముగ్గురు బాలికలు కూడా సౌత్ కొరియాలో బిటిఎస్ అనే పాప్ బ్యాండ్ టీమ్ వీడియోలను రెగ్యులర్ గా చూస్తుంటారు. వారికి ఈ ముగ్గురు బాలికలు డైహార్ట్ ఫ్యాన్స్ గా మారిపోయారు. ఎంతలా అంటే వారిని కలిసేందుకు ఇంట్లోనుంచి పారిపోయేంత అభిమానులుగా మారిపోయారు.
ఇంట్లో తెలియకుండా అందరూ కలిసి 14 వేలు నగదు పోగు చేసుకున్నారు. చెన్నై లేదా ఆంద్రప్రదేశ్ లోని విశాఖపట్నం పోర్టు నుంచి సౌత్ కొరియా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇదంతా వీరు ఇంటర్నెట్ ద్వారా వివరాలు తెలుసుకుని ప్రయాణం మొదలుపెట్టారు. ముందుగా ఈరోడ్ నుంచి ఈనెల 4న ట్రైన్ లో బయలుదేరి చెన్నై చేరుకున్నారు. రాత్రి కావడంతో అతి కష్టంమీద హోటల్ లో రూమ్ సంపాదించి బస చేశారు. మరోవైపు పిల్లలు వెళ్లిన విషయం తోటి స్నేహితులద్వారా తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ వేగవంతం చేశారు. పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.
బస్టాండ్, రైల్వేస్టేషన్‌లలో తనిఖీలు ముమ్మరం చేశారు. బస్టాండ్, రైల్వే అధికారులకు అలెర్ట్ జారీ చేశారు. మరోవైపు బాలికలు ఎలా వెళ్ళాలో ప్లాన్ చేసుకున్నారు కానీ ఎంత డబ్బు అవసరమవుతుంది అనేది ఆలోచించలేదు. వారి వద్ద ఉన్న 14 వేలలో ఒక్కరోజుకే 3 వేలు ఖర్చు అయిపోయాయి. మిగిలిన డబ్బుతో కొరియా వెళ్లలేమన్న నిర్దారణకు వచ్చారు. తిరిగి ఇంటికి వెళ్లిపోదామని నిశ్చయించుకున్నారు. ట్రైన్ లో ఈరోడ్ కు బయలుదేరారు. భోజనం కోసమని వెల్లూరు స్టేషన్ లో దిగగా ట్రైన్ మిస్సయ్యారు. అప్పటికే సమాచారం ఉండడంతో రైల్వే పోలీసులు వారిని గుర్తించారు. వారిని స్థానిక కోర్టులులో హాజరు పరిచి, కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.