Andhra Pradesh: మూడుముళ్ల బంధంతో ఒక్కటైన.. ‘స్పెయిన్‌ అబ్బాయి.. కోనసీమ అమ్మాయి’

ఆ ఇద్దరి ప్రేమ ఎల్లలు దాటింది. స్పెయిన్‌కి చెందిన కుర్రాడు ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమకు చెందిన అమ్మాయిని ప్రేమించాడు. ఇరుకుటుంబాల్లోని పెద్దలను ఒప్పించి వీరి ప్రేమను ఏడడుగుల బంధంలోకి ఆహ్వానించారు. దిండి రిసార్ట్స్‌లో ఇరు కుటుంబాల నడుమ హిందూ సంప్రదాయ పద్ధతిలో వారిరువురు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వివరాల్లోకెళ్తే.. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేటకు చెందిన..

Andhra Pradesh: మూడుముళ్ల బంధంతో ఒక్కటైన.. 'స్పెయిన్‌ అబ్బాయి.. కోనసీమ అమ్మాయి'
Spanish Man Marries Konaseema Woman
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 05, 2024 | 7:20 AM

కోనసీమ, జనవరి 5: ఆ ఇద్దరి ప్రేమ ఎల్లలు దాటింది. స్పెయిన్‌కి చెందిన కుర్రాడు ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమకు చెందిన అమ్మాయిని ప్రేమించాడు. ఇరుకుటుంబాల్లోని పెద్దలను ఒప్పించి వీరి ప్రేమను ఏడడుగుల బంధంలోకి ఆహ్వానించారు. దిండి రిసార్ట్స్‌లో ఇరు కుటుంబాల నడుమ హిందూ సంప్రదాయ పద్ధతిలో వారిరువురు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వివరాల్లోకెళ్తే.. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేటకు చెందిన సంజనా కోటేశ్వరి అనే యువతి స్పెయిన్‌లో ఉద్యోగం చేస్తోంది. అదే దేశంలో ఓ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్న రొసిజ్ఞాని అనే యువకుడితో సంజనాకు పరిచయం ఏర్పడింది. అనతికాలంలో వీరి పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది.

ఇద్దరి మనసులు కలవడంతో ఇరుకుటుంబాలకు తమ ప్రేమ విషయం తెలిపారు. వారి నుంచి కూడా గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో తాజాగా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. గురువారం తెల్లవారుజామున 3.36 గంటలకు దిండి రిసార్ట్స్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. స్పెయిన్‌ నుంచి వరుడు, వరుడి తల్లిదండ్రులు, మేనత్త, సోదరి, బావతో పాటు 40 మంది బంధువులు జనవరి 1న దిండి రిసార్ట్స్‌కు చేరుకున్నారు. ఆ రోజు నుంచి తెలుగు సంప్రదాయాల ప్రకారం వివాహ సంప్రదాయాలను శాస్త్రోక్తంగా జరిపించారు. వివాహతంతును హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు.

ఇక పెళ్లికి హాజరైన స్పెయిన్‌ మహిళలు నిండైన చీర కట్టులో కనిపించారు. పురుషులు కుర్తా పైజమా వంటి సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. అంబాజీపేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సీఈవో కుంపట్ల అయ్యప్పనాయుడు.. వధువు సంజనా కోటేశ్వరికి స్వయానా చిన్నాన్న. ఆయనే అక్కడి పెళ్లి ఏర్పాట్లన్నింటినీ స్వయంగా పర్యవేక్షించారు.

ఇవి కూడా చదవండి

సంక్రాతి సెలవులు ప్రకటించిన తెలుగు రాష్ట్రాలు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు సంక్రాంతి పండుగకు సంబంధించి అధికారికంగా పాఠశాలలకు సెలవులను ప్రకటించాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఏపీలో జ‌న‌వ‌రి 13వ తేదీ నుంచే సెలవులు ప్రారంభం కానున్నాయి. మొత్తం ఆరు రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 18 వరకు సెలవులు ఉండగా 19 నుంచి స్కూళ్లు ప్రారంభం అవుతాయి. అటు తెలంగానలో జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని తెలిపింది. జనవరి 13న రెండో శనివారం కాగా.. 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగలు ఉన్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.