Model Divya Pahuja: ఢిల్లీ హోటల్‌లో దారుణం.. మోడల్ దివ్య కాల్చివేత

ఎనిమిదేళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్‌ సందీప్‌ గడోలీ ప్రియురాలు, మాజీ మోడల్‌ దివ్యా పహుజా హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు కొందరు కాల్చిచంపారు. ఢిల్లీ శివారులోని గురుగ్రామ్‌లో ఓ హోటల్‌ గదిలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు బుధవారం (జనవరి 3) మీడియాకు తెలిపారు. ఐదుగురు వ్యక్తులు మంగళవారం రాత్రి దివ్య పహుజాను హోటల్‌ గదికి తీసుకొచ్చినట్లు తెలిసింది..

Model Divya Pahuja: ఢిల్లీ హోటల్‌లో దారుణం.. మోడల్ దివ్య కాల్చివేత
Ex Model Divya Pahuja
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 04, 2024 | 11:35 AM

గురుగ్రామ్‌, జనవరి 4: ఎనిమిదేళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్‌ సందీప్‌ గడోలీ ప్రియురాలు, మాజీ మోడల్‌ దివ్యా పహుజా హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు కొందరు కాల్చిచంపారు. ఢిల్లీ శివారులోని గురుగ్రామ్‌లో ఓ హోటల్‌ గదిలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు బుధవారం (జనవరి 3) మీడియాకు తెలిపారు. ఐదుగురు వ్యక్తులు మంగళవారం రాత్రి దివ్య పహుజాను హోటల్‌ గదికి తీసుకొచ్చినట్లు తెలిసింది. అనంతరం ఆమె మృతదేహాన్ని హోటల్ నుంచి కారులో తీసుకువెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. తుపాకీతో ఆమె తలపై కాల్చి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేసి అరెస్టు చేసిన నిందితులను విచారిస్తున్నారు. తదుపరి విచారణ జరుగుతోందని పశ్చిమ డిసిపి భూపేందర్ సింగ్ సాంగ్వాన్ తెలిపారు.

కాగా ఫిబ్రవరి 7, 2016న ముంబైలోని హోటల్‌లో గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీని పోలీసుల వేషంలో వచ్చిన కొందరు వ్యక్తులు తుపాకులతో కాల్చి హత్య చేశారు. ఈ కేసులో గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ దివ్యా పహుజా అరెస్టైన సంగతి తెలిసిందే. ఆమెతోపాటు, ఆమె తల్లిని, మరో ఐదుగురిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన ఏడేళ్ల తర్వాత బాంబే హైకోర్టు గత ఏడాది జూన్‌లో పహుజాకు బెయిల్ మంజూరు చేసింది. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్యాంగ్‌స్టర్ గాడోలిని అతని ప్రియురాలు పహుజా సహాయంతో ఓ నకిలీ ఎన్‌కౌంటర్‌లో కొందరు వ్యక్తులు హత్య చేశారు.

వీరేంద్ర కుమార్ అలియాస్ బైందర్ గుజ్జర్ అనే ప్రత్యర్థి ముఠాకు చెందిన మరో గ్యాంగ్‌స్టర్‌.. గడోలీని హతమార్చడానికి హర్యానా పోలీసు అధికారులతో కలిసి కుట్ర పన్నాడని ముంబై పోలీసులు తెలిపారు. అయితే ఎన్‌కౌంటర్ సమయంలో గుజ్జర్ జైలులో ఉన్నాడు. కాని అతను తన సోదరుడు మనోజ్ సహాయంతో కుట్ర పన్నాడు. పహుజా హనీ ట్రాప్‌ చేసి.. ఆమె సహాయంతో గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీని ముంబైకి రప్పించి, హతమార్చినట్లు ముంబై పోలీసులు చెబుతున్నారు. నకిలీ ఎన్‌కౌంటర్‌లో హరియాణా పోలీసులే అతడిని హతమార్చినట్లు దర్యాప్తులో తేలింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?