Uttar Pradesh: వణికిస్తోన్న చలిపులి.. నేటి నుంచి శనివారం వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించిన సర్కార్‌

ఉత్తర భారతదేశంలో చలిగాలుల తీవ్రరూం దాల్చుతున్నాయి. ఈ క్రమంలో నోయిడాలోని పాఠశాలలు 8వ తరగతి వరకు విద్యార్థులకు సెలవులు ప్రకటించాయి. జనవరి 3 నుంచి 6 వరకు పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. 9 నుంచి 12వ తరగతుల విద్యార్థులకు తరగతులు కొనసాగుతాయని గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లా యంత్రాంగం మంగళవారం (జనవరి 2) ప్రకటించింది. వాతావరణ ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతుండటంతో..

Uttar Pradesh: వణికిస్తోన్న చలిపులి.. నేటి నుంచి శనివారం వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించిన సర్కార్‌
Noida Schools Shut
Follow us

|

Updated on: Jan 03, 2024 | 8:40 AM

న్యూఢిల్లీ, జనవరి 3: ఉత్తర భారతదేశంలో చలిగాలుల తీవ్రరూం దాల్చుతున్నాయి. ఈ క్రమంలో నోయిడాలోని పాఠశాలలు 8వ తరగతి వరకు విద్యార్థులకు సెలవులు ప్రకటించాయి. జనవరి 3 నుంచి 6 వరకు పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. 9 నుంచి 12వ తరగతుల విద్యార్థులకు తరగతులు కొనసాగుతాయని గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లా యంత్రాంగం మంగళవారం (జనవరి 2) ప్రకటించింది. వాతావరణ ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతుండటంతో ఇప్పటికే డిసెంబర్ 29 , 30 తేదీలలో నగరంలోని అన్ని పాఠశాలలు మూసివేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ చివరి వారంలో ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్‌కు పడిపోయింది. కొత్త ఏడాది తొలి రెండు రోజుల్లో రాష్ట్రంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. జనవరి 3 నుంచి పశ్చిమ యూపీలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఢిల్లీలో ఉదయం వేలల్లో బలమైన చలి గాలులు వీస్తున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తుంది. వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. పొగమంచు కారణంగా ఢిల్లీకి వచ్చే 26 రైళ్లు ఒకటి నుంచి ఆరు గంటలు ఆలస్యంగా నడవనున్నట్లు ప్రకటించాయి. ఉదయం 6.30 గంటల సమయంలో గాలి నాణ్యత సూచిక (AQI) 346 ఉన్నట్లు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా పేర్కొంది. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో గత 24 గంటల్లో వాతావరణం పొడిగా ఉంది.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కనిపించింది. తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని చోట్ల, పశ్చిమ ప్రాంతంలో ఒకటి లేదా రెండు చోట్ల చలిగాలులు వీస్తున్నట్లు లక్నోలోని వాతావరణ కేంద్రం తెలిపింది. కాన్పూర్, బరేలీ, మొరాదాబాద్, మీరట్, అయోధ్య, లక్నో, ఆగ్రా, మీరట్ డివిజన్‌లతో సహా ఇతర డివిజన్‌లలో పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే చాలా తక్కువగా నమోదైంది. ఆ రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత షాజహాన్‌పూర్‌లో 5.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. బండలో అత్యధికంగా 22.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..