Dawood Ibrahim: వేలానికి దావూద్ ఇబ్రహీం చిన్ననాటి ఇల్లు..! జనవరి 5న వేలంలో విక్రయించనున్న దావూద్ ఆస్తులు
1993లో ముంబై పేలుళ్ల సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం చిన్ననాటి ఇల్లు వేలం పాట వేయనున్నారు. మహారాష్ట్రలోని రత్నగిరిలో ఉన్న అతని ఇంటితోపాటు మరో మూడు ఆస్తులను వచ్చే శుక్రవారం వేలం పాట నిర్వహించున్నారు. ముంబాకే గ్రామంలోని అతనికి చెందిన మొత్తం 4 ఆస్తులను అధికారులు అమ్మకానికి ఉంచినట్లు వార్తలు వెలువడుతున్నాయి..

న్యూఢిల్లీ, జనవరి 3: 1993లో ముంబై పేలుళ్ల సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం చిన్ననాటి ఇల్లు వేలం పాట వేయనున్నారు. మహారాష్ట్రలోని రత్నగిరిలో ఉన్న అతని ఇంటితోపాటు మరో మూడు ఆస్తులను వచ్చే శుక్రవారం వేలం పాట నిర్వహించున్నారు. ముంబాకే గ్రామంలోని అతనికి చెందిన మొత్తం 4 ఆస్తులను అధికారులు అమ్మకానికి ఉంచినట్లు వార్తలు వెలువడుతున్నాయి. స్మగ్లర్స్ అండ్ ఫారెన్ ఎక్స్‌ఛేంజ్ మానిప్యులేటర్స్ (ఆస్తి జప్తు) యాక్ట్ (SAFEMA) కింద దావూద్ ఆస్తులన్నింటినీ అధికారులు సీజ్ చేశారు.
SAFEMA ప్రకారం.. రత్నగిరిలో ఉన్న దావూద్‌కు చెందిన రూ.19 లక్షల విలువ చేసే మొత్తం 4 ప్లాట్‌లు ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు దావూద్ ఆస్తులను అమ్మకానికి పెట్టినప్పటికీ అతనికి భయపడి ఎవరూ వాటిని కొనేందుకు ముందుకు రాలేదు. దీంతో వాటిని విక్రయించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలేమీ ఫలించలేదు. ఇప్పుడు వాటిని వేలం వేయాలని SAFEMA నిర్ణయించింది. ఆస్తుల వేలం జనవరి 5వ తేదీన ముంబైలో జరగనుంది. నేటితో రిజిస్ట్రేషన్లు ముగియనున్నాయి. గత తొమ్మిదేళ్లలో దావూద్ కుటుంబానికి చెందిన 11 ఆస్తులను వేలం వేసిన సంగతి తెలిసిందే. రూ. 3.52 కోట్ల గెస్ట్ హౌస్‌తో సహా రూ 4.53 కోట్లకు రెస్టారెంట్, రూ 3.53 కోట్లకు ఆరు ఫ్లాట్‌లను విక్రయించారు.
1993 ముంబై వరుస పేలుళ్లలో కీలక నిందితుడైన దావూద్ ఇబ్రహీం 1983లో ముంబైకి వెళ్లడానికి ముందు ముంబకే గ్రామంలో నివసించాడు. మార్చి 12, 1993న ముంబై (అప్పటి బొంబాయి) వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ వరుస బాంబు పేలుళ్లలో 257 మంది మరణానికి దారితీసింది. 700 మందికి పైగా గాయపడ్డారు. సుమారు రూ. 27 కోట్ల విలువైన ఆస్తి ధ్వంసమైంది. మహారాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించారు. జూన్ 16, 2017న ముస్తఫా దోస్సా, అబూ సలేంతో సహా అనేక మంది నిందితులు ఈ కేసులో దోషులుగా నిర్ధారించబడ్డారు. వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం ఈ దాడులకు ప్లాన్ చేసినట్లు రుజువైంది. దీంతో అతను భారతదేశాన్ని విడిచి పాక్‌కు పారిపోయాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




