Tsunami Threat to India: భారత్‌కు సునామీ ముప్పు..? క్లారిటీ ఇచ్చిన హైదరాబాద్‌లోని ITEWC
జపాన్‌లో వరుస భూకంపాలు ఆదేశాన్ని గజగజ లాడించాయి. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.5 గా నమోదైంది. ఏకంగా 21 సార్లు భూమి కంపించింది. ఈ క్రమంలో ఇషికావా ద్వీపకల్పంలో వాజిమా పోర్టులో 4.21 గంటల సమయంలో దాదాపు 1.2 మీటర్ల ఎత్తులో సముద్ర అలలు ఎగసిపడ్డాయి. మరికొన్ని చోట్ల 5 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడ్డాయి. దీంతో హోక్కాయిడో నుంచి నాగసాకి వరకు సునామీ ముప్పు సంభవించే అవకాశం ఉన్నట్లు అధికారులు..
హైదరాబాద్, జనవరి 3: జపాన్‌లో వరుస భూకంపాలు ఆదేశాన్ని గజగజ లాడించాయి. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.5 గా నమోదైంది. ఏకంగా 21 సార్లు భూమి కంపించింది. ఈ క్రమంలో ఇషికావా ద్వీపకల్పంలో వాజిమా పోర్టులో 4.21 గంటల సమయంలో దాదాపు 1.2 మీటర్ల ఎత్తులో సముద్ర అలలు ఎగసిపడ్డాయి. మరికొన్ని చోట్ల 5 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడ్డాయి. దీంతో హోక్కాయిడో నుంచి నాగసాకి వరకు సునామీ ముప్పు సంభవించే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది మే నెలలో జపాన్‌లో దాదాపు రిక్టర్ స్కేల్‌పై 6.5 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. అప్పట్లో భూకంపం ధాటికి 13 మంది గాయపడగా, ఒకరు మృతి చెందారు. అప్పుడు కూడా భూకంప కేంద్రం ఇషికావా ప్రాంతంలోనే ఉండటం గమనార్హం.
జపాన్‌లో భూకంప తీవ్రత నేపథ్యంలో భారత్‌కు సునామీ ముప్పు ఉందేమోనని ఆందోళనలు తలెత్తుతున్నాయి. దీనిపై హైదరాబాద్‌లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS)కు చెందిన ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ (ITEWC) తాజాగా క్లారిటీ ఇచ్చింది. భూకేంద్ర ప్రాంతానికి సమీపంలో సముద్ర మట్ట మార్పులను పర్యవేక్షించే ITEWC ఏం చెప్పిందంటే.. భారత్‌కు సునామీ ముప్పు లేదని స్పష్టం చేసింది. అయితే.. పసిఫిక్ మహాసముద్రం సునామీ హెచ్చరిక కేంద్రం (PTWC), జపాన్ వాతావరణ సంస్థ (JMA).. జపాన్‌కు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. జపాన్‌లోని మధ్య భాగంలో సంభవించిన శక్తివంతమైన భూకంపాల కారణంగా అనేక ప్రాంతాలకు హై అలర్ట్ ప్రకటించాయి. జపాన్ దేశంలోని పశ్చిమ తీరంలో ఇషికావా, ఫుకుయ్, నీగాటా, టొయామా, యమగటా ఇతర ప్రిఫెక్చర్‌లతో సహా పలు ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. జపాన్‌తోపాటు రష్యాకు కూడా సునామీ ప్రమాద ఘటికలు మోగించింది. అయితే భారత్‌కు మాత్రం సునామీ ముప్పులేదని వివరించింది.
భారత్‌కు చివరిసారిగా సునామీ సంభవించింది అప్పుడే.. మళ్లీ ఇన్నాళ్లకు భయం భయం..
భారతదేశంలో 2004, డిసెంబర్ 26 లో చివరి సారిగా సునామీ తాకింది. సముద్రగర్భంలో సంభవించిన భూకంపం కారణంగా 14 దేశాలపై ప్రభావం చూపింది. భారతదేశం, శ్రీలంక, మాల్దీవులతోపాటు ఇతర దేశాలలో లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తరువాత 2007 అక్టోబర్‌లో హైదరాబాద్‌లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS)లో ITEWCని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ స్థాపించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.