AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం! 14 మంది మృతి.. 27 మందికి తీవ్ర గాయాలు

అసోంలోని గోలాఘాట్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణీకుల బస్సుతో వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు, ఒక మైనర్ బాలుడు సహా దాదాపు 14 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారి 37లోని డెర్గావ్ వద్ద తెల్లవారుజామున 5 గంటలకు ఈ సంఘటన జరిగింది...

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం! 14 మంది మృతి.. 27 మందికి తీవ్ర గాయాలు
Road Accident
Srilakshmi C
|

Updated on: Jan 03, 2024 | 9:07 AM

Share

గోలాఘాట్, జనవరి 3: అసోంలోని గోలాఘాట్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణీకుల బస్సుతో వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు, ఒక మైనర్ బాలుడు సహా దాదాపు 14 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారి 37లోని డెర్గావ్ వద్ద తెల్లవారుజామున 5 గంటలకు ఈ సంఘటన జరిగింది. సుమారు 45 మందితో గోలాఘాట్ నుంచి టిన్సుకియా వైపు వెళుతున్న బస్సును, అదే మార్గంలో ఎదురుగా వస్తున్న బొగ్గు లోడుతో వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన వారిని దేర్గావ్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలపాలైన వారిని జోర్హాట్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ (జేఎంసిహెచ్)కి తరలించారు.

కాగా జాతీయ రహదారికి ఒకవైపు రోడ్డు మరమ్మతులు జరుగుతున్నాయి. అందుకే రెండు వైపుల నుంచి వచ్చే వాహనాలు డివైడర్‌కి ఒకవైపు నుంచే వెళ్తున్నాయి. ఈ క్రమంలో అతి వేగంతో వస్తున్న ట్రక్కు బస్సును ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారని గోలాఘాట్ డిప్యూటీ కమిషనర్ పి ఉదయ్ ప్రవీణ్ తెలిపారు. బస్సులోని ప్రయాణికుల్లో ఎక్కువ మంది బరలుఖువా గ్రామానికి చెందినవారున్నారు. టిన్సుకియాలోని తిలింగ ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

బస్సు, ట్రక్కు నుంచి 12 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, గాయపడిన 27 మందిని జెఎంసిహెచ్‌కి తరలించగా, ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ట్రక్‌ డ్రైవర్‌ నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా ప్రమాదం జరిగినట్లుకేసు నమోదు చేసుకున్నామని, దర్యాప్తు ప్రారంభించామని గోలాఘాట్ పోలీసు సూపరింటెండెంట్ రాజేన్ సింగ్ మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..