Sankranti: హరిదాసు అంటె పరమాత్మతో సమానం… అక్షయ పాత్రలో బియ్యం ఎందుకు పోస్తారంటే..

మన పెద్దలు హరిదాసుని పరమాత్మతో సమానంగా భావించేవారు.  శ్రీ మహ విష్ణువుకు ప్రతి నిధులు హరి దాసులు. వారి అక్షయ పాత్రలో బియ్యం పోస్తే మన తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపలు తోలగిపోతాయని విశ్వాసం. తమకు చేసిన దాన ధర్మాలను స్వీకరించి మనస్ఫూర్తిగా ఆయురారోగ్యాలు భోగభాగ్యలు కలగలని దీవిస్తారు. ఇలా నెలరోజులు పాటు హరినామన్ని గానం చేసి.. సంక్రాంతి రోజున స్వయం పాకంగా అందరు ఇచ్చే  ధన, ధాన్య, వస్తు దానాలను స్వీకరించి తమని ఆదరించిన కుటుంబం అన్నపూర్ణగా ఉండాలని దీవిస్తారు. 

Sankranti: హరిదాసు అంటె పరమాత్మతో సమానం... అక్షయ పాత్రలో బియ్యం ఎందుకు పోస్తారంటే..
Hari Dasu
Follow us
Surya Kala

|

Updated on: Jan 08, 2024 | 3:04 PM

తెలుగు వారు జరుపుకునే పండగల్లో అతి పెద్ద హిందూ పండగ సంక్రాంతి.  భోగి, మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ గా ఈ పండగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. సంక్రాంతి అనగానే తెలుగువారికి ముందుగా గుర్తుకొచ్చేది గోదావరి జిల్లాలు.. ధనుర్మాసం మొదలు… ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తలు గంగిరెద్దు ఆటలతో సందడి నెలకుంటుంది. అయితే నేటి తరానికి హరిదాసు అంటే సరిగ్గా తెలియదు కానీ.. కొన్ని సంవత్సరాలకు ముందు హరిదాసు అంటే.. తమ ఇంటికి వస్తున్న దైవంతో సమానంగా భావించే వారు. కాళ్ళకు గజ్జెలు భుజం మీద  వీణ శిరస్సు మీద అక్షయ పాత్ర పట్టుకుని హరినామ సంకీర్తన చేస్తూ వీధిలో నడిచి వస్తుంటే.. ఎంత దూరం లో ఉన్న హరిదాసు కాళ్ళ గజ్జల శబ్దం, హరిలోరంగ హరి అంటూ సాగే గానం విని ప్రతి ఇంట్లో పెద్దలు బియ్యం సిద్ధం చేసేవారు.

హరిదాసు ఇంటింటికీ తిరుగుతూ ఆగిన ప్రతి చోట తన స్వచ్ఛమైన గాత్రం తో గానాన్ని తగ్గట్టుగా భుజాన ఉన్న వీణ ను వాయిస్తూ కాళ్లను గజ్జెలు కదిలిస్తూ గీతాన్ని పూర్తి చేసిన వెంటనే శిరస్సు ను కిందకు వచ్చింది అక్షయ పాత్ర పడితే.. ఆ ఇంటి సభ్యులు తాము సిద్ధం చేసిన బియ్యాన్ని ఆ అక్షయ పాత్రలో పోసేవారు.

హరిదాసు అంటే..

మన పెద్దలు హరిదాసుని పరమాత్మతో సమానంగా భావించేవారు.  శ్రీ మహ విష్ణువుకు ప్రతి నిధులు హరి దాసులు. వారి అక్షయ పాత్రలో బియ్యం పోస్తే మన తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపలు తోలగిపోతాయని విశ్వాసం. తమకు చేసిన దాన ధర్మాలను స్వీకరించి మనస్ఫూర్తిగా ఆయురారోగ్యాలు భోగభాగ్యలు కలగలని దీవిస్తారు. ఇలా నెలరోజులు పాటు హరినామన్ని గానం చేసి.. సంక్రాంతి రోజున స్వయం పాకంగా అందరు ఇచ్చే  ధన, ధాన్య, వస్తు దానాలను స్వీకరించి తమని ఆదరించిన కుటుంబం అన్నపూర్ణగా ఉండాలని దీవిస్తారు.

ఇవి కూడా చదవండి

హరిదాసు నెత్తిమీద ధరించే పాత్రను అక్షయ పాత్రగా అది సూర్యభగవానుడు ప్రసాదించిన  పంచలోహ పాత్రగా భావిస్తారు. ధనుర్మాసం నెలరోజులు సూర్యోదయానికి ముందే శ్రీ కృష్ణ గోదాదేవిని స్మరించి, తిరుప్పావై పఠించి, అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు. ఇంటికి తిరిగి వెళ్లే హరిదాసు నోట హరినామ సంకీర్తన తప్ప మరేమి ఉండదు. ఎక్కడా అక్షయపాత్రను దించరు. ఇంటికి వెళ్ళాక ఇల్లాలు ఆ హరిదాసు పాదాలు కడిగి అప్పుడు హరిదాసు నెత్తిమీద అక్షయపాత్రను దించుతుంది.

హరిదాసులు శ్రీ కృష్ణునికి మరోరూపం అని పెద్దలు చెబుతారు. పేద, ధనిక అనే తారతమ్యభేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు. శ్రీ మద్రమారమణ గోవిందో హరీ అంటూ.. ఇంటి ముందు ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతారు.. గుమ్మంలో ఎవరూ లేకపోతే మరో ఇంటికివెళ్లారు.. అయితే ఎవరి ఇంటి నుంచి అయినా హరిదాసు ఉట్టి చేతులతో వెళ్ళితే ఆ ఇంటికి అరిష్టమంటారు పెద్దల నమ్మకం. అందుకనే గ్రామంలోకి హరిదాసు అడుగు పెట్టడానికి సంకేతం తెలియగానే.. ఇంటి ఇల్లాలు బియ్యంతో సిద్ధంగా గుమ్మంముందు నిల్చుంటుంది.

అక్షయపాత్రలో బియ్యం పోయడాన్ని శ్రీమహా విష్ణువుకు తమ శక్తి కొలది పెట్టిన నైవేద్యంగా భావిస్తారు భక్తులు. హరిదాసు తల మీద గుండ్రటి రాగి పాత్రను భూమికి సంకేతంగా శ్రీ మహావిష్ణువు పెట్టాడనే కథ కూడా ప్రచారంలో ఉంది.

అయితే కాలంలో వచ్చిన మార్పులో భాగంగా హరిదాసుని ఆదరించేవారు కరువు అయ్యారు. అయినప్పటికీ ఇప్పటికీ కొందరు తమ సంప్రదాయాన్ని అనుసరించి ఇంటి ముందుకు వస్తున్నారు. వారిని ఆదరించి చేయూతను ఇవ్వడం మన భాద్యత.. మన సంప్రాదయాన్ని.. మన కళను మనమే కాపాడుకోవాలి మరి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?