Ayodhya: అయోద్యలో సెక్యూరిటీపై స్పెషల్‌ ఫోకస్‌.. మెరికల్లాంటి బలగాల పహారా

శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ.. విశ్వ నలు చెరుగుల వీనులవిందుగా శ్రీరామ నామ స్మరణ... అటు కనుల పండువగా అయోధ్యలో ఆధ్మాత్మిక వెలుగులు.. రామ్‌లల్లా విగ్రహ మహాప్రతిష్టాపనకు వేళాయింది. యువశిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ భక్తితో చెక్కిన బాలరాముడి విగ్రహం సిద్ధంగా ఉంది.

Ayodhya: అయోద్యలో సెక్యూరిటీపై స్పెషల్‌ ఫోకస్‌.. మెరికల్లాంటి బలగాల పహారా
Ayodhya
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 07, 2024 | 10:01 PM

రామ్‌లల్లా  విగ్రహ ప్రాణప్రతిష్టకు మాన్యులు, సామాన్యులు సకల జనులు తరలి వస్తారు. రద్దీకి తగ్గట్టు ఏర్పాట్లు  సహా అయోధ్య అంతటా భద్రత కట్టుదిట్టం చేశారు. భారీగా బలగాలను మోహరించడమే కాకుండా.. అయోధ్య వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతీ ఒక్కరి కదిలికల్ని పసిగట్టేలా  టెక్నో పోలీసింగ్‌కు మరింత పదను పెట్టారు. ఆర్టిఫియల్‌ ఇంటిలెజెన్స్‌ను వినియోగిస్తున్నారు. డ్రోన్‌లతో నిఘా ఉంటుంది. యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌ కూడా వుంటుంది. అనుమతి లేకుండా ఎవరైనా ఎక్కడైనా డ్రోన్‌లను వాడితే ఇట్టే పసిగట్టే టెక్నాలజీ వాడుతున్నారు.

భద్రతపరంగా అయోధ్యను రెడ్‌, ఎల్లో రెండు  జోన్‌లుగా విభజించారు. రామమందిరం, కాంప్లెక్స్‌ రెడ్‌ జోన్‌ పరిధిలో ఉంటాయి. 6 CRPF బెటాలియన్లు, 3PAC ట్రూప్‌లు,  SSF  కంపెనీలు 9.. అదనంగా 3 వందల మంది స్థానిక పోలీసులు..50 మంది  ఫైర్‌ ఫైటర్స్‌  అందుబాటులో ఉంటారు. ఇక NDRF  టీమ్స్‌, బాంబు డిటెక్షన్‌, డిస్పోజల్‌ స్క్వాడ్స్‌ , ఎలాంటి సిట్యుయేషన్‌నైనా టాకిల్‌ చేసేలా NSG, కమాండో యూనిట్స్‌  రౌండ్‌ ద క్లాక్‌ వాచ్‌ చేస్తుంటాయి.

ఇక ఎల్లో జోన్‌ పరిధిలోనూ భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు.  ఎల్లో జోన్‌లో కనక్ భవన్, హనుమాన్‌గఢి ప్రాంతాలు ఉన్నాయి. ఎయిర్‌పోర్ట్‌, రైల్వే స్టేషన్‌ సహా..భక్తుల కోసం ఏర్పాటు చేసిన టెంట్‌ సిటీ ఏరియాలోనూ  హై సెక్యూరిటీ కొనసాగుతుంది. 50 వేల మంది సెక్యూరిటీ సిబ్బంది ఇప్పటికే విధుల్లో ఉన్నారు. అయోధ్య భద్రత కోసమే ప్రత్యేకంగా  90 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. అత్యాధునిక భద్రతా పరికరాలను సమకూర్చారు. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా అయోధ్యలో AI ఆధారిత వ్యవస్థను ఇప్పటికే స్ట్రెంథెన్‌ చేశారు.

అలా భద్రతను కట్టుదిట్టం చేయడం సహా  భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపడుతున్నారు.  అన్ని శాఖల సమన్వయంతో  అయోధ్య శ్రీరామరాజ్యాన్ని తలపిస్తోంది. ఇప్పటికే  రామరథాలుగా  భారతీయ రైల్వే శాఖ  అయోధ్యకు  35 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. త్వరలో ఆ సంఖ్య వందకు  పెంచబోతుంది.  దేశ నలుమూలల నుంచి 4వేల మంది సాధువులు అయోధ్య వేడుకకు హాజరు కాబోతున్నారు. ఎటు చూడు కమనీయ..రమణీయమే. రామయానాన్ని కళ్లకు కట్టేలా అద్భుత  నిర్మాణం..మరోవైపు భారీ వృక్షాలు.. ఉద్యాన వనాలు…  అయోధ్యలో అడుగుపెట్టగానే  ఆహ్లాదభరిత వాతావరణం ఉండనుంది.

వేడుకకు తరలివచ్చే భక్తుల కోసం ఏకంగా టెంట్‌ సిటీని ఏర్పాటు చేశారు.  భక్తులకు వసతితో పాటు  లగేజీ భద్రపర్చుకోవడం కోసం ప్రత్యేక లాకర్స్‌ ఏర్పాటు చేశారు.  దివ్య , భవ్యంగా  మర్యాదపురుషుడి  మందిరం సిద్దం…..  గణగణ  గుడి గంటలు సిద్దం… ఈ శతాబ్దం తరించే… భావితరం స్మరించే మహావేడుకకు సర్వం సిద్ధం..సకలం రామమయం.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..