Ayodhya: రాములోరి ఉత్సవాలకు రెడీ అవుతున్న మహిళలు.. రామమందిర థీమ్‌తో బనారసీ చీరకు భారీ డిమాండ్.. దేశ విదేశాల నుంచి ఆర్డర్స్..
అయోధ్యలో జరగనున్న రామ మందిర ప్రతిష్ఠాపన వేడుకల సందడి మొదలైంది. ఇప్పటికే హోటల్స్, రైళ్ళు, విమాన రంగాల్లో సందడి నేలకొండగా.. ఇప్పుడు చేనేత కార్మికుల వంతు వచ్చింది. అందమైన చీరలకు రామ మందిర నిర్మాణం సోయగాలు అద్దమంటూ మహిళలు కోరుతున్న నేపధ్యంలో చీరలను నేసే కార్మికులు బాల రామయ్య కొలువుండే 'రామమందిరం' థీమ్‌తో బనారసీ చీరలు ఫ్యాషన్ మార్కెట్ లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. చీరలపై వివిధ రామ మందిర చిత్రాలతో డిజైన్ చేయమంటూ నేత కార్మికులు కస్టమైజ్ చేసిన ఆర్డర్‌లను అందుకున్నారు.
భారతీయ సంప్రదాయంలో మహిళలు ధరించే చీర అత్యంత ప్రాముఖ్యత కల్గింది. ఇప్పుడు ప్రపంచం అరచేతిలో దర్శనం ఇస్తుంది. దీంతో చీరలను కట్టు బొట్టుని ఇష్టపడే విదేశీయుల సంఖ్య కూడా రోజు రోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా చీరలలో ఆధునిక జోడించి ధరించడానికి ఎక్కువ మంది మక్కువ చూపిస్తున్నారు. అయితే ప్రపంచంలోని కోట్లాది హిందువులు ఎదురుచూస్తున్నా శుభ సమయం రానే వచ్చింది. అయోధ్యలో జరగనున్న రామ మందిర ప్రతిష్ఠాపన వేడుకల సందడి మొదలైంది. ఇప్పటికే హోటల్స్, రైళ్ళు, విమాన రంగాల్లో సందడి నేలకొండగా.. ఇప్పుడు చేనేత కార్మికుల వంతు వచ్చింది. అందమైన చీరలకు రామ మందిర నిర్మాణం సోయగాలు అద్దమంటూ మహిళలు కోరుతున్న నేపధ్యంలో చీరలను నేసే కార్మికులు బాల రామయ్య కొలువుండే ‘రామమందిరం’ థీమ్‌తో బనారసీ చీరలు ఫ్యాషన్ మార్కెట్ లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. చీరలపై వివిధ రామ మందిర చిత్రాలతో డిజైన్ చేయమంటూ నేత కార్మికులు కస్టమైజ్ చేసిన ఆర్డర్‌లను అందుకున్నారు. ముఖ్యంగా చీరలోని పల్లుపై రామమందిరం నమూనాలతో పాటు రాముడి చిన్నతనం నుంచి రావణుడిని చంపడం వరకు రామయ్య జీవిత ఇతి వృత్తాన్ని వివరించే డిజైన్‌లతో పాటు చీర అంచులో ‘శ్రీరామ్’ అక్షరాలు ఉండే విధంగా మగువలు డిజైన్స్ కోరుకుంటున్నారు.
అయోధ్య రామమందిరంలో ‘ప్రాణ ప్రతిష్ఠ’ (ప్రతిష్ఠాపన) కోసం ముస్తాబవుతుండగా.. దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులు ప్రత్యేకమైన క్రియేషన్స్ ద్వారా ఆలయ ప్రారంభోత్సవం పట్ల తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు. వారణాసిలోని ముబారక్‌పూర్ ప్రాంతానికి చెందిన చేనేత కార్మికుడు అనిసూర్ రెహమాన్ మాట్లాడుతూ ఈ మహత్తర కార్యక్రమం సందర్భంగా వారణాసిలోని నేత సంఘంలో ఉత్సాహం నెలకొందని చెప్పారు. వాస్తవానికి “చారిత్రక విశేషాలను తెలియజేసే డిజైన్ల చీరలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.. అయితే రామ మందిరం మీద సెంటిమెంట్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది” అని రెహమాన్ చెప్పారు.
“మేము రామమందిరం థీమ్‌పై చీరలను సిద్ధం చేస్తున్నాము.. ఇవి త్వరలో ఫ్యాషన్ డిజైన్ చీరల్లో అగ్ర భాగంగా నిలుస్తాయని అంటున్నారు. రామ మందిర థీమ్ ఉన్న ఈ చీరలు ధరించి తమ తమ ప్రదేశాలలో జనవరి 22 న బాల రామయ్య విగ్రహ ప్రతిష్టాపన జరుపుకోవాలనుకునే మహిళలు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. తాము దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మాత్రమే కాదు అమెరికా వంటి ఇతర దేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయని ఆయన చెప్పారు.
చీరలు ఎలా ఉంటాయంటే..
రామ మందిరం నేపథ్యంపై డిజైన్ చేస్తున్న చీరల రకాలను రెహమాన్ వివరిస్తూ.. “ఒక రకమైన చీరలపై పల్లుపై రామాలయం ఉంటుంది. ఈ చీరలు ఎరుపు , పసుపు రంగులలో తయారు చేయబడ్డాయి… శాసనం బంగారు రంగులో ఉంటుంది.
రెండవ రకమైన చీరలు అనేక రంగులలో లభిస్తాయి. అవి అంతటా ‘శ్రీ రామ్’ అని వ్రాసిన అంచుని కలిగి ఉంటాయి.”
“మూడవ రకం చీరలు శ్రీరాముని బాల్యం నుండి రావణ సంహారం వరకు రామయ్య జీవిత ఇతి వృత్తాన్ని వివిధ దశలను వర్ణించే అత్యంత వివరణాత్మకమైనవి,” అన్నారాయన.
పీలి కోఠి ప్రాంతానికి చెందిన మరో చేనేత కార్మికుడు మదన్ మాట్లాడుతూ చీర పల్లుపై ‘రామ్ దర్బార్’ వర్ణన ఉన్న చీరలకు కూడా చాలా డిమాండ్ ఉందని చెప్పారు. “రామ మందిర్ నేపథ్యం ఉన్న చీరల కోసం యుఎస్ నుండి ఇప్పటికే రెండు ఆర్డర్లు ఉన్నాయి” అని మదన్ చెప్పారు. ఈ చీరలు రూ.7,000 నుంచి మొదలై రూ.లక్ష ధర వరకూ మార్కెట్ లో అందుబాటులో ఉండనున్నాయి.
శ్రేష్టమైన పనితనానికి ప్రసిద్ధి చెందిన బనారసి పట్టు చీరలు అన్ని తరాల మహిళలకు ఇష్టమైన చేనేత చీరలు.
ఆలయ మొదటి దశ పనులు పూర్తి కావస్తుండగా జనవరి 22న జరిగే సంప్రోక్షణ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. శతాబ్దానికి పైగా సాగిన దేవాలయం-మసీదు వివాదాన్ని పరిష్కరిస్తూ 2019లో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణాన్ని సమర్థించిన న్యాయస్థానం మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయంగా ఐదెకరాల స్థలాన్ని ఇవ్వాలని తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే..
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..