- Telugu News Photo Gallery Former Governor ESL Narasimhan Visits Samathamurthy Sri Ramanuja Swamiji Temple
ESL Narasimhan: సమతామూర్తి సేవలో నరసింహన్ దంపతులు.. చినజీయర్ స్వామి ఆశీర్వచనం తీసుకున్న మాజీ గవర్నర్
భార్య విమలా నరసింహన్‌తో కలిసి సమతా మూర్తి కేంద్రానికి వచ్చిన మాజీ గవర్నర్ నరసింహన్‌కు వేద పండితులు శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు. అనంతరం చిన్న జీయర్ స్వామిని కలిసి ఆశీర్వచనాలు తీసుకున్నారు నరసింహన్ దంపతులు
Updated on: Jan 08, 2024 | 4:47 PM

మాజీ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సోమవారం (జనవరి 08) ముచింతల్ లోని రామానుజ సమతా మూర్తి కేంద్రాన్ని సందర్శించారు. భార్యతో కలిసి చిన్న జీయర్ స్వామి ఆశీర్వచనాలు తీసుకున్నారు.

భార్య విమలా నరసింహన్‌తో కలిసి సమతా మూర్తి కేంద్రానికి వచ్చిన మాజీ గవర్నర్ నరసింహన్‌కు వేద పండితులు శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు. అనంతరం చిన్న జీయర్ స్వామిని కలిసి ఆశీర్వచనాలు తీసుకున్నారు నరసింహన్ దంపతులు

ఈ సంరద్భంగా రామానుజుడి విగ్రహంతో పాటు ఆలయ పరిసరాల్లోని దేవాలయాలను పరిశీలించారు నరసిహంన్ దంపతులు.

చాలా రోజుల తర్వాత తెలంగాణకు వచ్చిన గవర్నర్ నరసింహన్ ఆదివారం (జనవరి 07) మాజీ సీఎం కేసీఆర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా నరసింహన్ దంపతులకు పట్టువ స్త్రాలు సమర్పించి సత్కరించారు కేసీఆర్.

అంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశారు నరసింహన్. తెలంగాణ సచివాలయంలో మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిసి అభినందనలు తెలిపారు.