- Telugu News Photo Gallery Are you using condoms? Know these things for sure, check here is details in Telugu
Condoms Usage: కండోమ్స్ యూజ్ చేస్తున్నారా.. ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోండి!
కండోమ్స్ గురించి ప్రత్యేకంగా ఎవరికీ పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. జనన నియంత్రణకు కండోమ్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వీటి వలన ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో.. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. చాలా మందికి వీటి వినియోగం తెలీదు. ఎలా పడితే అలా ఉపయోగిస్తూ ఉంటారు. దీంతో వివిధ రకాల సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. కండోమ్స్ ని వాడుతూ ఉంటారు కానీ.. ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం మర్చిపోతూ ఉంటారు. కండోమ్స్ కి కూడా ఎక్స్ పైరీ..
Chinni Enni | Edited By: Ravi Kiran
Updated on: Jan 09, 2024 | 4:04 PM

కండోమ్స్ గురించి ప్రత్యేకంగా ఎవరికీ పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. జనన నియంత్రణకు కండోమ్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వీటి వలన ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో.. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. చాలా మందికి వీటి వినియోగం తెలీదు. ఎలా పడితే అలా ఉపయోగిస్తూ ఉంటారు. దీంతో వివిధ రకాల సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది.

కండోమ్స్ ని వాడుతూ ఉంటారు కానీ.. ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం మర్చిపోతూ ఉంటారు. కండోమ్స్ కి కూడా ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా గమనించి తీసుకోవాలి. లేదంటే ఆ తర్వాత ఇబ్బందులను ఎదుర్కొనాలి.

కొంత మంది ఫ్లేవర్డ్ కండోమ్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వీటిని వాడకపోవడమే బెటర్. ఎందుకంటే వీటిలో పలు రకాల రసాయనాలు కలుపుతారు. దీని వల్ల యోనిలో మంట, చికాకు, దురద వంటి సమస్యలు ఏర్పడతాయి.

కండోమ్స్ ని కొన్నాక ఎక్కడ పడితే అక్కడ స్టోర్ చేస్తూ ఉంటారు. కానీ వీటిని సూర్య రశ్మి, వేడి లేదా తేమ ప్రదేశాలకు చాలా దూరంగా ఉంచాలి. అలాగే వీటిని మీ బ్యాగ్ లేదా పర్స్ లో ఉంచుకుంటే లేటెక్స్ చెడి పోతుంది. చల్లని లేదా పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి.

సిలికాన్ ఆధారిత ల్యూబ్స్, లేటెక్స్ కండోమ్స్ ఉపయోగించవచ్చు. అలాగే చాలా కండోమ్స్ ని తిరిగి ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఏ మాత్రం సేఫ్ కాదు. ఒకసారి ఉపయోగించిన తర్వాత కండోమ్ ని మళ్లీ తిరిగి ఉపయోగించకూడదు. ఇలా చేస్లే పలు రకాల లైంగిక సమస్యలు వస్తాయి.





























