- Telugu News Photo Gallery Does drinking milk make you gain weight? How true is this? check here is details in Telugu
Interesting Facts: పాలు తాగితే బరువు పెరుగుతారా? ఇందులో నిజమెంత..
పాలు బలవర్ధకమైన ఆహారం కాబట్టి.. పాలు తాగితే బరువు పెరుగుతారని అనుకుంటారు. ఇది నిజంగానే అపోహ అని కొట్టి పారేస్తున్నారు ఆరోగ్య నిపుణులు. మీరు తీసుకునే పాల రకం బట్టి మీరు బరువు పెరుగుతారా.. లేదా అనేది ఆధార పడి ఉంటుందని అంటున్నారు. క్రీమ్ లేని, క్యాలరీ కంటెంట్ తక్కువగా ఉన్న మిల్క్ తీసుకుంటే వెయిట్ లాస్ అయ్యేందుకు హెల్ప్ అవుతాయి. అలాగే పాలను పదే పదే మరిగించడం వల్ల వాటిలో..
Updated on: Jan 09, 2024 | 5:04 PM

శరీరానికి మంచి పోషకాలు అందించే ఆహారాల్లో పాలు కూడా ఒకటి. ఉదయం టీ నుంచి రాత్రి పడుకునేంత వరకూ పాలతో చాలా రకాల పనులు ఉంటాయి. పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు. శరీరానికి కావాల్సినంత కాల్షియం లభిస్తుంది. అయితే ఈ పాల విషయంలో మనం అనేక అపోహలు వింటూ ఉంటాం. మరి వాటిల్లో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం.

పాలు బలవర్ధకమైన ఆహారం కాబట్టి.. పాలు తాగితే బరువు పెరుగుతారని అనుకుంటారు. ఇది నిజంగానే అపోహ అని కొట్టి పారేస్తున్నారు ఆరోగ్య నిపుణులు. మీరు తీసుకునే పాల రకం బట్టి మీరు బరువు పెరుగుతారా.. లేదా అనేది ఆధార పడి ఉంటుందని అంటున్నారు. క్రీమ్ లేని, క్యాలరీ కంటెంట్ తక్కువగా ఉన్న మిల్క్ తీసుకుంటే వెయిట్ లాస్ అయ్యేందుకు హెల్ప్ అవుతాయి.

అలాగే పాలను పదే పదే మరిగించడం వల్ల వాటిలో పోషకాలు తగ్గుతాయని చాలా మంది అంటూంటారు. ఇది కూడా తప్పు అని నిపుణులు అంటున్నారు. పాలు ఆరోగ్యంగా ఉండాలంటే.. కాబ బెట్టాలని చెబుతున్నారు. పాలను మరగ బెట్టడం వల్ల అందులో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. అయితే ఒకసారి మరిగించిన పాలను రెండు సార్లకు మించి మళ్లీ వేడి చేయకూడదు.

పాలు తాగడం వల్ల శ్లేష్మం ఉత్పత్తి అవుతుందని కొందరు అంటారు. దగ్గు ఎక్కువుగా ఉన్నప్పుడు స్కిమ్డ్ మిల్క్ తీసుకుంటే.. కఫం పెరుగుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అదే విధంగా పాలు తాగడం వల్ల మొటిమలు వస్తాయని చాలా మంది అంటారు. పాలు తాగడం వల్ల మొటిమలు వస్తాయి అనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని తెలుస్తోంది. ఇది హార్మోన్ల పరిస్థితిపై ఆధార పడి ఉంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.




