- Telugu News Photo Gallery Cinema photos Star directors who are waiting for the dates of the heroes to make the film
Directors: హీరోల కోసం వెయిటింగ్‌లో దర్శకులు.. భారీగా పెరిగిన వెయిటింగ్ లిస్ట్..
మన హీరోల కోసం వెయిటింగ్‌లో ఉన్న దర్శకుల లిస్ట్ భారీగా పెరిగిపోతోంది. ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలు టైమ్ తీసుకుంటూ ఉండటంతో ఆ తరువాత చేయాల్సిన సినిమాల దర్శకులు మేరే టైమ్ కబ్ ఆయేగా అంటున్నారు. ఇంతకీ అలా వెయిటింగ్‌లో ఉన్న దర్శకులు ఎవరు? వెయిట్ చేయిస్తున్న హీరోలెవరు..? హావ్ ఏ లుక్.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Prudvi Battula
Updated on: Jan 09, 2024 | 4:08 PM

మన హీరోల కోసం వెయిటింగ్‌లో ఉన్న దర్శకుల లిస్ట్ భారీగా పెరిగిపోతోంది. ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలు టైమ్ తీసుకుంటూ ఉండటంతో ఆ తరువాత చేయాల్సిన సినిమాల దర్శకులు మేరే టైమ్ కబ్ ఆయేగా అంటున్నారు. ఇంతకీ అలా వెయిటింగ్‌లో ఉన్న దర్శకులు ఎవరు? వెయిట్ చేయిస్తున్న హీరోలెవరు..? హావ్ ఏ లుక్.

ట్రిపులార్ సెట్స్ మీద ఉండగానే గేమ్ చేంజర్ వర్క్ స్టార్ట్ చేసిన చరణ్, ఆ సినిమాను పూర్తి చేయడానికి మాత్రం చాలా టైమ్ తీసుకున్నారు. దీంతో నెక్ట్స్ చేయాల్సిన సినిమాలు డిలే అవుతున్నాయి. చాలా రోజులుగా చరణ్ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్న బుచ్చిబాబు, మెగా పవర్ స్టార్ ఎప్పుడు రెడీ అంటారా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

మరో ట్రిపులార్ హీరో ఎన్టీఆర్ కూడా నెక్ట్స్ మూవీ డైరెక్టర్‌ను వెయిటింగ్‌లో పెట్టారు. లాంగ్ బ్రేక్ తరువాత దేవరను పట్టాలెక్కించిన తారక్... ప్రస్తుతం ఆ సినిమాను చెప్పిన డేట్‌కు రిలీజ్ చేసేందుకు కష్టపడుతున్నారు. దీంతో ఆ తరువాత చేయాల్సి వార్ 2 డిలే అవుతోంది. ఆల్రెడీ వార్ 2ను స్టార్ట్ చేసిన డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, తారక్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు.

ట్రిపులార్ హీరోలు దర్శకులను వెయిటింగ్‌లో పెడితే... ట్రిపులార్ డైరెక్టర్‌ను వెయిటింగ్‌లో పెట్టారు సూపర్ స్టార్ మహేష్ బాబు. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో ఎనౌన్స్ అయిన సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం మహేష్ గుంటూరు కారం వర్క్‌లో బిజీగా ఉండటంతో ఆ సినిమా రిలీజ్ అయ్యాకే జక్కన్న మూవీ విషయంలో క్లారిటీ వస్తుంది.

ఇక పవర్ స్టార్ కోసం వెయిట్ చేస్తున్న దర్శకుల లిస్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే, క్రిష్, హరీష్ శంకర్, సుజిత్ లాంటి దర్శకులు పవన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలు పూర్తయితే కొత్త సినిమాలు స్టార్ట్ చేసేందుకు సురేందర్ రెడ్డి లాంటి వాళ్లు లైన్‌లో ఉన్నారు. కానీ పవన్ మాత్రం తిరిగి సెట్‌లో ఎప్పుడు అడుగుపెడతారో అర్ధం కావట్లేదు.





























