- Telugu News Photo Gallery Cinema photos Director Trivikram Srinivas special focus on Guntur Kaaram to make it a boxoffice success
Gunturu Karam: గుంటూరు కారం పై మాటల మాంత్రికుడు స్పెషల్ ఫోకస్.. సంక్రాంతికి బాక్సాఫీస్ బద్ధలవ్వడం ఖాయం
మహేష్ బాబుతో చాలా మంది దర్శకులు పని చేసారు. కానీ త్రివిక్రమ్‌తో పని చేసినపుడు మాత్రమే కొత్తగా మారిపోతుంటారు మహేష్. మాటల మాంత్రికుడు కూడా సూపర్ స్టార్‌పై స్పెషల్ ఫోకస్ చేస్తుంటారు. గుంటూరు కారం కూడా దీనికి మినహాయింపేమీ కాదు. మరి ఇందులో మహేష్‌ని ఎలా ప్రజెంట్ చేసారు.. ఏ విషయాన్ని కొత్తగా పరిచయం చేయబోతున్నారు..? ఇండస్ట్రీలో ఒక్కో కాంబినేషన్‌కు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాంటి స్పెషల్ కాంబో మహేష్, త్రివిక్రమ్.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Jan 09, 2024 | 7:13 PM

మహేష్ బాబుతో చాలా మంది దర్శకులు పని చేసారు. కానీ త్రివిక్రమ్‌తో పని చేసినపుడు మాత్రమే కొత్తగా మారిపోతుంటారు మహేష్. మాటల మాంత్రికుడు కూడా సూపర్ స్టార్‌పై స్పెషల్ ఫోకస్ చేస్తుంటారు. గుంటూరు కారం కూడా దీనికి మినహాయింపేమీ కాదు. మరి ఇందులో మహేష్‌ని ఎలా ప్రజెంట్ చేసారు.. ఏ విషయాన్ని కొత్తగా పరిచయం చేయబోతున్నారు..?

ఇండస్ట్రీలో ఒక్కో కాంబినేషన్‌కు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాంటి స్పెషల్ కాంబో మహేష్, త్రివిక్రమ్. ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారంటే చాలు.. అభిమాలనులకు ఫుల్ మీల్స్ పక్కా. మరీ ముఖ్యంగా త్రివిక్రమ్‌తో పని చేసినపుడు కొత్తగా మారిపోతుంటారు మహేష్. అతడు, ఖలేజాల్లో అప్పటి వరకు చూడని మహేష్‌ను పరిచయం చేసారు త్రివిక్రమ్.

అతడులో మహేష్ పెద్దగా మాట్లాడడు. సైలెంట్‌గా ఉంటూనే అన్ని పనులు చేస్తుంటారు. ఇక ఖలేజా అయితే పూర్తిగా డిఫెరెంట్. అప్పటి వరకు మహేష్ బాబుతో అంత మాట్లాడించిన దర్శకుడు మరొకరు లేరు. పూర్తిగా ఓపెన్ అయిపోయిన మహేష్ బాబును అందులో చూపించారు త్రివిక్రమ్. దూకుడు రావడానికి కారణం ఖలేజా అంటూ శ్రీను వైట్ల కూడా ఓ టైమ్‌లో చెప్పారంటే.. దాని ప్రభావం తెలుస్తుంది.

గుంటూరు కారంలోనూ మహేష్ బాబును కొత్తగానే చూపిస్తున్నారు త్రివిక్రమ్. ఈ మధ్య సోషల్ మెసేజ్, సీరియస్ కథలు అంటూ బరువైన పాత్రలే చేస్తున్నారు మహేష్ బాబు. కానీ చాలా రోజుల తర్వాత చాలా లైటర్ కారెక్టర్‌ను ఇందులో ప్లే చేసారు మహేష్. గుర్తెట్టుకో.. రమణ గాడు అంటూ మహేష్ చెప్తున్న డైలాగ్స్ అదిరిపోయాయి. ఆయన కారెక్టరైజేషన్‌పై స్పెషల్ ఫోకస్ చేసారు గురూజీ.

ట్రైలర్‌లో మహేష్‌ను చూసి ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు. సింపుల్‌గా బీడీ కాలుస్తూ.. లుంగీ లుక్‌లో పక్కా మాస్‌గా కనిపిస్తున్నారు సూపర్ స్టార్. ఇలాంటి కారెక్టర్‌లో కదా మా మహేష్‌ను చూడాలనుకుంటున్నాం అంటూ విజిల్స్ వేస్తున్నారు. పక్కా పండగ సినిమాలా వస్తున్న గుంటూరు కారంలోని ఎమోషన్స్ వర్కవుట్ అయితే.. రేపు సంక్రాంతికి బాక్సాఫీస్ బద్ధలవ్వడం ఖాయం.





























