- Telugu News Photo Gallery Do you clean these body parts while taking a bath? Check here is details in Telugu
Bath Tips: స్నానం చేసేటప్పుడు ఈ శరీర భాగాలను క్లీన్ చేస్తున్నారా..
చాలా మంది నాభి అంటే బొడ్డును క్లీన్ చేసుకోవడం మర్చి పోతూ ఉంటారు. ఇది బ్యాక్టీరియా పెరగడానికి అనువైన ప్రదేశం. చాలా మంది నాభి శుభ్రం చేసుకోరు. దీని వల్ల అక్కడ దుర్వాసన వచ్చి.. బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా క్లీన్ చేసుకోండి. స్నానం చేసేటప్పుడు చెవుల వెనుక కూడా శుభ్రం చేసుకోవాలి. చెవుల వెనుక ఎక్కువగా నూనె, మృత కణాలు, చెమట అనేవి ఎక్కువగా చేరుతాయి. జస్ట్ వాటర్ తో తుడిచినంత మాత్రాన మురికి పోదు. సబ్బుతో శుభ్రంగా..
Chinni Enni | Edited By: Ravi Kiran
Updated on: Jan 09, 2024 | 6:30 PM

ప్రతి రోజూ స్నానం చేయడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. శరీరం శుభ్ర పడటమే కాకుండా.. కొన్ని రకాల రోగాలు రాకుండా ఉంటాయి. స్నానం సరిగ్గా చేయ్యకపోతే.. ఎన్నో అనారోగ్యాలకు గురి కావాల్సి వస్తుంది. సూక్ష్మ క్రిములు, మలినాలను క్లీన్ చేసుకునేందుకు స్నానం చేస్తారు. ఇలా స్నానం చేసేటప్పుడు అన్ని శరీర భాగాలను శుభ్రం చేసుకోవాలి. లేదంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

చాలా మంది నాభి అంటే బొడ్డును క్లీన్ చేసుకోవడం మర్చి పోతూ ఉంటారు. ఇది బ్యాక్టీరియా పెరగడానికి అనువైన ప్రదేశం. చాలా మంది నాభి శుభ్రం చేసుకోరు. దీని వల్ల అక్కడ దుర్వాసన వచ్చి.. బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా క్లీన్ చేసుకోండి.

స్నానం చేసేటప్పుడు చెవుల వెనుక కూడా శుభ్రం చేసుకోవాలి. చెవుల వెనుక ఎక్కువగా నూనె, మృత కణాలు, చెమట అనేవి ఎక్కువగా చేరుతాయి. జస్ట్ వాటర్ తో తుడిచినంత మాత్రాన మురికి పోదు. సబ్బుతో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

పాదాల్లో కూడా మురికి ఎక్కువగా చేరుతుంది. కానీ చాలా మంది పాదాలను శుభ్రం చేసుకోరు. పాదాలపై ఎక్కువగా దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు చేరతాయి. రోగాలను ఎక్కువగా వ్యాపింపజేసే బ్యాక్టీరియా పాదాలపై చేరుతుంది. కాబట్టి పాదాలను పైపైనే కాకుండా.. గోళ్లపై, వేళ్ల మధ్యలో కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

చేతి గోర్లను కూడా ఖచ్చితంగా శుభ్రం చేయాలి. గోర్లలో ఎక్కువగా మురికి, క్రిములు చేరతాయి. ఇది ఎన్నో రోగాలకు కారణం అవుతాయి. గోర్లను సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే.. శరీరంలోకి చేరి.. ఇమ్యూనిటీని దెబ్బతీస్తుంది. దీంతో పలు రకాల రోగాలు వచ్చే అవకశాం ఉంది.





























