Bhogi 2024: భోగి లాంటి పండుగను భారతదేశంలోనే కాదు ఇరాన్‌లో కూడా జరుపుకుంటారని తెలుసా.. విశిష్టత ఏమిటంటే

దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వంటి ప్రాంతాల్లో సంక్రాంతి గా మూడు రోజుల పాటు జరుపుకుంటే.. ఉత్తరాదిలో పంజాబ్‌, హిమాచల్, హర్యానా, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో లోహ్రిగా జరుపుకుంటారు. ఈ రోజు అగ్నిని పూజిస్తూ ఈ పండుగను జరుపుకుంటారు.  దక్షిణాది లో భోగి పండగను .. పంజాబ్ రాష్ట్రంలో లోహ్రి పండుగగా అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు ఎందుకంటే భోగి పండగ చాలా ప్రత్యేకమైనది.  ఆరోజున మంటలు వేసి అగ్ని దేవుడిని పూజిస్తారు. భోగి లాంటి పండుగను ఇరాన్‌లో కూడా జరుపుకుంటారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

Bhogi 2024: భోగి లాంటి పండుగను భారతదేశంలోనే కాదు ఇరాన్‌లో కూడా జరుపుకుంటారని తెలుసా.. విశిష్టత ఏమిటంటే
Chaharshanbe Suri
Follow us
Surya Kala

|

Updated on: Jan 08, 2024 | 9:04 PM

కొత్త ఏడాదిలో మొదటి పండుగ భోగి. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో రకరకాల పేర్లతో మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. వాస్తవంగా దేశవ్యాప్తంగా పండుగలు సంక్రాంతి సంబరాలతో ప్రారంభమవుతాయి. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వంటి ప్రాంతాల్లో సంక్రాంతి గా మూడు రోజుల పాటు జరుపుకుంటే.. ఉత్తరాదిలో పంజాబ్‌, హిమాచల్, హర్యానా, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో లోహ్రిగా జరుపుకుంటారు. ఈ రోజు అగ్నిని పూజిస్తూ ఈ పండుగను జరుపుకుంటారు.  దక్షిణాది లో భోగి పండగను .. పంజాబ్ రాష్ట్రంలో లోహ్రి పండుగగా అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు ఎందుకంటే భోగి పండగ చాలా ప్రత్యేకమైనది.  ఆరోజున మంటలు వేసి అగ్ని దేవుడిని పూజిస్తారు.

భోగి లాంటి పండుగను ఇరాన్‌లో కూడా జరుపుకుంటారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇరాన్‌లో రాత్రి సమయంలో మంటలు వేసి అనంతరం తమ స్నేహితులకు, సన్నిహితులకు డ్రై ఫ్రూట్స్ అందిస్తారు. అయితే ఇక్కడ ఈ పండుగ పేరు చహర్‌షన్‌బే సూరి. ఈ పండగను సరిగ్గా మన భోగి వలెనే జరుపుకుంటారు.

చహర్‌షన్‌బే సూరి ప్రత్యేకం

ఇరాన్ పార్సీ ప్రజలు చహర్‌షన్‌బే సూరి అనే పండుగను జరుపుకుంటారు. ఇరాన్‌లో ఈ పండుగను సంవత్సరంలో చివరి బుధవారం జరుపుకుంటారు. రాత్రి సమయంలో ప్రజలు తమ ఇళ్ల ముందు మంటలను వెలిగించి దాని పై నుంచి దూకుతారు. అంతేకాదు ఇరానియన్ ప్రజలు డ్రై ఫ్రూట్స్‌ను మంటల్లో వేస్తూ పాట కూడా పాడతారు – ‘ఓ ఆతీష్-ఎ-ముకద్దస్! జర్దీ-ఎ-మాన్ అజ్ తు సుర్ఖి-ఎ-తు అజ్ మాన్.'( sorkhi-ye to az man, zardi-ye man az to) అంటూ ( ఓ పవిత్రమైన అగ్ని! మీరు మా జీవితంలో నిస్తేజమైన రంగుని తీసివేసి.. మీ ప్రకాశవంతమైన ఎరుపు రంగుతో మమ్మల్ని నింపండి) అంటూ తమ ఆత్మను శుద్దీకరణ చేయమంటూ పాట ద్వారా అగ్నిని ప్రార్ధిస్తారు.

ఇవి కూడా చదవండి

అగ్ని పవిత్రమైనది

వాస్తవానికి, ఇరాన్, భారతదేశంలో జరుపుకునే పండుగ పేర్లు నిస్సందేహంగా భిన్నంగా ఉంటాయి. కానీ హిందువుల పండగ భోగి.. ఇరాన్‌లో జరుపుకునే పండుగ చహర్‌షన్‌బే సూరి రెండూ కొత్త సీజన్‌ను స్వాగతించడానికి వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగను జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశ్యం అగ్ని శక్తితో నింపబడాలని కోరుకోవడం. అయితే, రెండు ప్రాంతాలలో దీనిని జరుపుకోవడానికి భిన్నమైన సంప్రదాయాలు ఉన్నాయి.

ఇరాన్ ఇస్లామిక్ దేశమైనప్పటికీ, ఇక్కడి సమాజం గత సంస్కృతితో సంబంధాలను తెంచుకోలేదు. ఇక్కడి ప్రజలు అగ్నిని అత్యంత శ్రేష్ఠమైనదిగా, పూజనీయమైనదిగా భావిస్తారు. కనుక నేటికీ ఇరాన్‌లో కూడా అగ్నికి అంకితమైన పండుగ భోగిని అత్యంత ఘనంగా జరుపుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.