Ram Mandir Inauguration: అయోధ్యలో శ్రీరాముడి విగ్రహం ఊరేగింపు వేడుకలు రద్దు.. కారణాలివే

రామ భక్తుల చిరకాల స్వప్నం సాకారం అవుతోంది. ఆధ్మాత్మిక విశ్వనగరి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. జనవరి 22న రామ్‌లల్లా విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవానికి.. సర్వం సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించ తలపెట్టిన ఓ ముఖ్యమైన వేడుకను రద్దు చేసింది అయోధ్య ట్రస్ట్.

Ram Mandir Inauguration: అయోధ్యలో శ్రీరాముడి విగ్రహం ఊరేగింపు వేడుకలు రద్దు.. కారణాలివే
Ayodhya Ram Mandir
Follow us
Basha Shek

| Edited By: TV9 Telugu

Updated on: Jan 09, 2024 | 11:36 AM

రామ భక్తుల చిరకాల స్వప్నం సాకారం అవుతోంది. ఆధ్మాత్మిక విశ్వనగరి అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. జనవరి 22న రామ్‌లల్లా విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవానికి.. సర్వం సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించ తలపెట్టిన ఓ ముఖ్యమైన వేడుకను రద్దు చేసింది అయోధ్య ట్రస్ట్. యూపీలో అద్భుతంగా నిర్మితమైన భవ్యరామమందిరం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. ఈ నెల 22న శ్రీ రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయంలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్టకు ముందు ఈ నెల 17న రాముడి విగ్రహాన్ని అయోధ్యలో ఊరేగిస్తామని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఈ వేడుకను కమిటీ రద్దు చేసింది. రాముడి విగ్రహం ఊరేగింపు లేకుండానే ఈ నెల 22న నేరుగా ఆలయంలో ప్రతిష్టిస్తామని ట్రస్ట్ స్పష్టం చేసింది. రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్టకు వీఐపీలతో పాటు వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. దీంతో అయోధ్య అంతటా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. నగరంలో భారీగా బలగాలను మోహరించడమే కాకుండా.. అయోధ్య వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతీ ఒక్కరి కదిలికల్ని పసిగట్టేలా టెక్నో పోలీసింగ్‌కు మరింత పదను పెట్టారు. భద్రతాపరంగా అయోధ్యను రెడ్‌. ఎల్లో జోన్‌లుగా విభజించారు.

రామమందిరం, కాంప్లెక్స్‌ రెడ్‌ జోన్‌ పరిధిలో ఉంటాయి. 6 CRPF బెటాలియన్లు, 3PAC ట్రూప్‌లు, 9 SSF కంపెనీలు.. అదనంగా 3 వందల మంది స్థానిక పోలీసులు.. 50 మంది ఫైర్‌ ఫైటర్స్‌ అందుబాటులో ఉంటారు. ఇక NDRF టీమ్స్‌, బాంబు డిటెక్షన్‌, డిస్పోజల్‌ స్క్వాడ్స్‌ , ఎలాంటి సిట్యుయేషన్‌నైనా టాకిల్‌ చేసేలా NSG, కమాండో యూనిట్స్‌ రౌండ్‌ ద క్లాక్‌ వాచ్‌ చేస్తుంటాయి.

ఇవి కూడా చదవండి

రాత్రి వేళల్లో రామ మందిరం వెలుగులు..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.