Astro Tips: ఈ రాశికి చెందిన యువతికి ఇల్లాలుగా నడుచుకునే లక్షణాలు పుష్కలం.. భార్యగా పొందాలంటే మగవారికి అదృష్టం ఉండాలంట..

పెద్దలు పెళ్లి విషయంలో జాతకాలు చూసి మరీ కుదుర్చుకుంటారు. దీని కారణం కొన్ని రాశులకు చెందిన అమ్మాయిల నేచర్ కొన్ని రాశులకు సంబంధించిన అబ్బాయిలకు సరిపడుతుందట.. వీరి దాంపత్యం సుఖ సంతోషాలతో సాగుతుందని విశ్వాసం. కనుక కొన్ని రాశులకు చెందిన అబ్బాయిలు.. కొన్ని రాశులకు చెందిన యువతులను పెళ్లి చేసుకుంటే .. అబ్బాయి జీవితం సుఖ సంతోషాలతో పాటు సిరి సంపదలతో నిండిపోతుంది. కొన్ని రాశులకు చెందిన యువతులకు భార్యగా, ఇల్లాలుగా నడుచుకునే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయట.

Astro Tips: ఈ రాశికి చెందిన యువతికి ఇల్లాలుగా నడుచుకునే లక్షణాలు పుష్కలం..  భార్యగా పొందాలంటే మగవారికి అదృష్టం ఉండాలంట..
Astro Tips
Follow us
Surya Kala

|

Updated on: Jan 11, 2024 | 7:04 PM

జ్యోతిష్య శాస్త్రం మనుషుల భవిష్యత్ ను , మనుగడకు , మంచి చెడుల గురించి వెల్లడిస్తుంది. వాస్తవానికి మనుషుల వ్యక్తిత్వం, మనస్తత్వం చాలా తేడాగా ఉంటుంది. ఒకొక్కరి ఆలోచన ఒకొక్కరీతిలో ఉంటుంది. అయితే కొన్ని రాశులకు సంబంధించిన ఆలోచనలు, అభిప్రాయాలు మాత్రం దాదాపు ఒకే విధముగా ఉండి కొన్ని సార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. దీనికి కారణం ఆయా రాశుల ప్రభావం కావొచ్చు. పెద్దలు పెళ్లి విషయంలో జాతకాలు చూసి మరీ కుదుర్చుకుంటారు. దీని కారణం కొన్ని రాశులకు చెందిన అమ్మాయిల నేచర్ కొన్ని రాశులకు సంబంధించిన అబ్బాయిలకు సరిపడుతుందట.. వీరి దాంపత్యం సుఖ సంతోషాలతో సాగుతుందని విశ్వాసం. కనుక కొన్ని రాశులకు చెందిన అబ్బాయిలు.. కొన్ని రాశులకు చెందిన యువతులను పెళ్లి చేసుకుంటే .. అబ్బాయి జీవితం సుఖ సంతోషాలతో పాటు సిరి సంపదలతో నిండిపోతుంది. కొన్ని రాశులకు చెందిన యువతులకు భార్యగా, ఇల్లాలుగా నడుచుకునే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయట. కనుక ఈ రాశులకు చెందిన యువతులను పెళ్లి చేసుకున్న యువకుడి జీవితం ఒక పండగగా సాగిపోతుందట.. ఆ రాశులు ఏమిటో చూద్దాం..

వృషభ రాశి: ఈ రాశికి చెందిన యువతులు చాలా స్థిరమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశికి చెందిన స్త్రీలను పెళ్లి చేసుకున్న పురుషులు ఆదర్శవంతమైన భాగస్వామిగా భావించేలా జీవిస్తారు. మహిళలు తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు. ఇంటి వాతావరణం సంతోషంగా ఉండేలా చూస్తారు. ప్రేమకు అధినేత అయిన శుక్ర గ్రహం ఈ రాశికి చెందిన వ్యక్తులు పాలిస్తారు.

కర్కాటక రాశి: ఈ రాశికి చెందిన స్త్రీలు తమ భావోద్వేగ మేధస్సును కలిగి ఉంటారు. వీరు చంద్రునిచే పాలించబడతారు. అందుకే కర్కాటక రాశికి చెందిన వారు తమ శ్రేయస్సుని ప్రియమైనవారితో ముడిపెట్టుకుని అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. ఈ రాశి స్త్రీలు తమ ప్రేమతో మంచి  వాతావరణాన్నిసృష్టిస్తారు. కుటుంబమే తమ సర్వస్వంగా భావిస్తారు. తమ భర్తతో కలిసి కష్ట సుఖాలను పంచుకుంటారు.

ఇవి కూడా చదవండి

తుల రాశి: ఈ రాశికి చెందిన స్త్రీలు సంతులనం, సామరస్యాన్నికాపాడుకుంటూ జీవితంలో సుఖ సంతోషాలతో జీవిస్తారు. ప్రేమ, అందాన్ని ఇష్టపడతారు. శాంతిని కోరుకుంటారు. దౌత్యపరమైన తెలివి తేటలు కలిగి ఉంటారు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా సామరస్యపూర్వకంగా తమ భర్తకు సహకరిస్తారు. తమ  వైవాహిక జీవితాన్ని అందంగా..  మధురంగా మార్చుకుంటారు.

వృశ్చిక రాశి: ఈ రాశికి చెందిన స్త్రీల ఆశయం, సంకల్పం బలంగా ఉంటాయి. క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతారు. వీరు భర్తకు మంచి భాగస్వామిగా నిలుస్తారు. వీరిని భార్యగా పొందిన వ్యక్తి .. వృత్తిపరమైన రంగంలో సక్సెస్ అందుకుంటారు. తమ భాద్యతను బలంగా భావిస్తారు. ఈ రాశికి చెందిన స్త్రీలను ఎవరైనా భార్యగా పొందిన వ్యక్తుల జీవితంలోనైనా శాంతి, ప్రశాంతతను కలిగి ఉంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే