Sankranti: కోనసీమలో ముందే మొదలైన సంక్రాంతి సంబరాలు.. నేటి తరానికి సాంప్రదాయ వంటలు, వేడుకలను పరిచయం చేస్తూ..

ఎంత బిజీ బిజీ లైఫ్ తో ఉన్నా సరే.. సంక్రాంతి వస్తే చాలు నగర వాసులు తమ సొంతూళ్లకు పయనం అవుతారు. తమ ఫ్యామిలీ సభ్యులతో స్నేహితులతో సరదాగా గడపడానికి ఈ పండగే ఒక వేదికగా మలచుకుంటున్నారు. సంక్రాంతిని గోదావరి జిల్లా వాసులు నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు. బోగి, మకర సంక్రాంతి,  కనుమ, ముక్కనుమ గా జరుపుకుంటారు. ఈ సంబరాలను నేటి తరం కూడా మరచిపోకుండా కొన్ని పాఠశాలలు తమ విద్యార్థులతో ముందుగానే జరుపుకుంటున్నారు. ఈ సంక్రాంతి వేడుకల్లో పెద్దలను పిల్లలను ఏకం చేస్తున్నారు. తాజాగా కోనసీమ జిల్లాలో ముందుగానే సంక్రాంతి సందడి మొదలైంది. 

Sankranti: కోనసీమలో ముందే మొదలైన సంక్రాంతి సంబరాలు.. నేటి తరానికి సాంప్రదాయ వంటలు, వేడుకలను పరిచయం చేస్తూ..
Sankranti 2024
Follow us

|

Updated on: Jan 11, 2024 | 4:41 PM

హిందువులు జరుపుకునే పండగల్లో పెద్ద పండగ సంక్రాంతి. ఈ పండగ పేరు చెబితే చాలు ముందుగా అందరి మదిలో మెదిలేది గోదావరి జిల్లాలు. నెల రోజుల ముందు నుంచే పల్లెల్లో సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. ముంగిట ముత్యాల ముగ్గులు, ముగ్గుల్లో గొబ్బెమ్మలు.. హరిదారు కీర్తనలు, గంగి రెద్దు ఆటలు.. కొత్త అల్లుళ్ళు, కోడి పందాలతో సంక్రాంతి సంబరాలు నిండిపోతాయి. అయితే కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా పల్లెలు పట్నాల బాట పట్టాయి. ఎంత బిజీ బిజీ లైఫ్ తో ఉన్నా సరే.. సంక్రాంతి వస్తే చాలు నగర వాసులు తమ సొంతూళ్లకు పయనం అవుతారు. తమ ఫ్యామిలీ సభ్యులతో స్నేహితులతో సరదాగా గడపడానికి ఈ పండగే ఒక వేదికగా మలచుకుంటున్నారు.

సంక్రాంతిని గోదావరి జిల్లా వాసులు నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు. బోగి, మకర సంక్రాంతి,  కనుమ, ముక్కనుమ గా జరుపుకుంటారు. ఈ సంబరాలను నేటి తరం కూడా మరచిపోకుండా కొన్ని పాఠశాలలు తమ విద్యార్థులతో ముందుగానే జరుపుకుంటున్నారు. ఈ సంక్రాంతి వేడుకల్లో పెద్దలను పిల్లలను ఏకం చేస్తున్నారు. తాజాగా కోనసీమ జిల్లాలో ముందుగానే సంక్రాంతి సందడి మొదలైంది.

రాజోలు నియోజకవర్గ వ్యాప్తంగా  పలు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో సంక్రాంతి సంబరాలు ముందుగానే జరుపుకున్నారు. నేటి యువతరంలో కనుమరుకుతున్న సంస్కృతి సంప్రదాయాలను విద్యార్థిని విద్యార్థులకు తెలియజేసే ఉద్దేశంతో స్కూల్ యాజమాన్యం సంబరాలను నిర్వహించారు.

సంక్రాంతికి చేసే సాంప్రదాయ పిండి వంటలు, ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు భోగి మంటలు, బుడబుక్కల వేషాలు వంటి వేషధారణలు పిల్లలతో ధరింపజేశారు. మన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టు పడే విధంగా సంక్రాంతి పాటలతో అలరింప చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అయ్యో భగవంతుడా.. పెన్ను గుచ్చుకుని నాలుగేళ్ల పాప మృతి
అయ్యో భగవంతుడా.. పెన్ను గుచ్చుకుని నాలుగేళ్ల పాప మృతి
ట్యాక్స్ పేయర్స్ కి గుడ్ న్యూస్.. నిర్మలమ్మ పద్దులో కీలక నిర్ణయం
ట్యాక్స్ పేయర్స్ కి గుడ్ న్యూస్.. నిర్మలమ్మ పద్దులో కీలక నిర్ణయం
బ్లాక్ కలర్ డ్రస్ లో మైండ్ బ్లాక్ చేస్తోన్న చందమామ
బ్లాక్ కలర్ డ్రస్ లో మైండ్ బ్లాక్ చేస్తోన్న చందమామ
అరంగేట్రంలోనే 2 ట్రోఫీలు గెలిచిన ముగ్గురు.. లిస్టులో మనోళ్లు..
అరంగేట్రంలోనే 2 ట్రోఫీలు గెలిచిన ముగ్గురు.. లిస్టులో మనోళ్లు..
రాత్రి చిమ్మ చికట్లోనే ఏదో జరుగుతోంది.. ఊరంతా ఇదే తంతు
రాత్రి చిమ్మ చికట్లోనే ఏదో జరుగుతోంది.. ఊరంతా ఇదే తంతు
హైదరాబాద్‌లో అట్టహాసంగా మొదలైన సెయిలింగ్‌ వీక్‌-2024 పోటీలు
హైదరాబాద్‌లో అట్టహాసంగా మొదలైన సెయిలింగ్‌ వీక్‌-2024 పోటీలు
అలాంటి వారిని ఉరి తీయాలి.. రాశిఖన్నా డిమాండ్
అలాంటి వారిని ఉరి తీయాలి.. రాశిఖన్నా డిమాండ్
లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న మహిళా జర్నలిస్ట్ హఠాత్తుగా ఎద్దు దాడి
లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న మహిళా జర్నలిస్ట్ హఠాత్తుగా ఎద్దు దాడి
పోలవరంలో ముగిసిన విదేశీ నిపుణుల బృందం పర్యటన.. త్వరలోనే నివేదిక
పోలవరంలో ముగిసిన విదేశీ నిపుణుల బృందం పర్యటన.. త్వరలోనే నివేదిక
గోవా వెళ్తున్నవారికి అలెర్ట్.. మీకు భారీ ఫైన్
గోవా వెళ్తున్నవారికి అలెర్ట్.. మీకు భారీ ఫైన్