AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya: రామయ్యకు కానుకల వర్షం.. ధన, ధాన్య, కనకాది వస్తువులతో అయోధ్యకు సీతామఢి వాసులు పయణం

అయోధ్యలో దివ్య, భవ్య రామాలయం ప్రారంభోత్సవమౌతున్న సందర్భంగా సీతామాత జన్మస్థలమైన బిహార్‌ మిథిల జిల్లా సీతామఢీ నుంచి భక్తులు భారీగా కట్నకానుకలు తెచ్చారు. రాముడి అత్తారింటి నుంచి రావాల్సిన కానుకలన్నీ ట్రక్కుల్లో తీసుకొచ్చామని సీతామఢీ వాసులు తెలిపారు. అయోధ్య తరహాలో సీతామాత జన్మభూమిని అభివృద్ధి చేయాలని బిహార్‌ వాసులు కోరుతున్నారు. సీతామఢి ప్రాంతాన్ని కూడా అయోధ్య మాదిరిగా తీర్చిదిద్దాలని భక్తులు కోరుతున్నారు.

Ayodhya: రామయ్యకు కానుకల వర్షం.. ధన, ధాన్య, కనకాది వస్తువులతో అయోధ్యకు సీతామఢి వాసులు పయణం
Ayodhya Gifts From Sitamarh
Mahatma Kodiyar
| Edited By: Surya Kala|

Updated on: Jan 15, 2024 | 10:06 AM

Share

అయోధ్యలో కొలువుదీరనున్న శ్రీ రామ చంద్రుడికి కానుకల వర్షం కురుస్తోంది. దేశ విదేశాల నుంచి బహుమతులు వస్తున్నాయి. వాటన్నింటిలోకి ప్రత్యేకంగా నిలుస్తున్నది మాత్రం శ్రీరాముడి అత్తమామల ఇంటి నుంచి వచ్చే కానుకలే. అవును.. సీతామాత స్వస్థలమైన బిహార్‌లోని సీతామఢి నుంచి కానుకలతో కూడిన ట్రక్కులు అయోధ్య చేరుకుంటున్నాయి. వాటిలో ధన, ధాన్య, కనకాది వస్తువులన్నీ ఉన్నాయి. అలాగే దుస్తులు, దుప్పట్లతో పాటు ఓ కొత్త జంటకు కావాల్సిన గృహోపకరణ వస్తువులు కూడా ఉన్నాయి. ఆ కానుకలు తీసుకుని అయోధ్య చేరుకున్న సీతామఢి వాసులు.. రామజన్మభూమి తరహాలోనే సీతాజన్మస్థలాన్ని కూడా అభివృద్ధి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.

సీతమ్మ లేని రాముడు లేడు, రామాయణం లేదని.. ఈ పరిస్థితుల్లో సీత పుట్టిన ఊరిని కూడా అభివృద్ధి చేస్తే మైథిలి ప్రాంతవాసులకు ఉపాధి లభిస్తుందని చెబుతున్నారు. శ్రీరాముడికి అందుతున్న కానుకలతో పాటు కొత్త వినతులు కూడా తెరపైకి వస్తున్నాయి.

అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రామాయణ్‌ సర్క్యూట్‌లో సీతామఢి పునౌరా ధామ్‌ కూడా ఉంది. ఇక్కడే సీతా కుండ్‌, సీతా వాటిక, లవ్‌-కుశ్‌ వాటిక ఉన్నాయి. అయోధ్యలో రామాలయ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో బిహార్‌లోని నితీశ్‌ ప్రభుత్వం ఇటీవలే ఈ క్షేత్ర అభివృద్ధి కోసం 72 కోట్ల రూపాయలు కేటాయించింది. పెద్ద ఎత్తున పనులు చేపట్టింది.

ఇవి కూడా చదవండి

ఆలయ నిర్మాణం సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే ప్రారంభమైందన్న విషయం అందరికీ తెలుసు. కానీ కొన్ని దశాబ్దాల క్రితమే ఆలయ నిర్మాణానికి అవసరమైన స్తంభాలు, ఇతర వస్తువులు సిద్ధమయ్యాయి. అయోధ్యలో ఆ ప్రాంతాన్ని రామ జన్మభూమి కార్యశాలగా పిలుస్తారు. అయోధ్యను సందర్శించడానికి వచ్చే ప్రతీ ఒక్కరూ ఆ కార్యశాలను సందర్శించకుండా తిరిగి వెళ్లరు. బండరాళ్లను అందమైన స్తంభాలుగా, ఆకృతులుగా మరల్చిన కార్యశాల వచ్చే ప్రతీ యాత్రికుణ్ణి, భక్తుణ్ణి మంత్రముగ్ధులను చేసిన ఆ కార్యశాలలో రూపుదిద్దుకుంటున్నాయి శిలాకృతులు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..