సంక్రాంతి తర్వాత ఈ నెల 18 నుంచి ఏడు రాశుల వారికి దాదాపు నెల రోజుల పాటు లక్ష్మీయోగం పట్టబోతోంది. బుధ, శుక్రుల కలయిక వల్ల ఈ యోగం ఏర్పడుతుంది. శుక్రుడు ఈ నెల 18న ధనూరాశిలోకి ప్రవేశించి, అదే రాశిలో ఉన్న బుధుడిని కలవడం జరుగుతుంది. ఈ యోగం వల్ల అనుకోకుండా డబ్బు కలిసి రావడం, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా నూరు శాతం సత్ఫలితాలనివ్వడం, ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి జీవితంలో రాబడి, వ్యాపారాల్లో లాభాలు తప్పకుండా పెరిగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎటువంటి ఆర్థిక లావాదేవీని జరిపినా ఉత్తరోత్రా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి పొందడానికి అవకాశం ఉంటుంది. మొత్తానికి ఆర్థికపరంగా శుభ వార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఈ ఏడు రాశులుః మేషం, మిథునం, సింహం, కన్య, వృశ్చికం, ధనుస్సు, కుంభ రాశులు.