AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thailand: మనవాళిపై పగబట్టిన వైరస్.. గబ్బిలాల నుంచి కొత్త ప్రాణాంతక వైరస్.. మానవులకు సోకే ప్రమాదం ఉందని హెచ్చరిక

ప్రపంచాన్ని మరో వైరస్ కలవరపెడుతుంది. గబ్బిలాల నుంచి మరో వైరస్ పుట్టుకోచ్చింది. ఈ వైరస్ మానవులకు సోకే ప్రమాదం ఉందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ కొత్త వైరస్‌ను థాయ్‌లాండ్‌లో గుర్తించారు. గబ్బిలాల్లో మరో ప్రమాదరకమైన వైరస్‌ను ఎకోహెల్త్‌ అలయన్స్‌ పరిశోధనా సంస్థ గుర్తించినట్లు WHO భేటీలో వెల్లడించింది. ఇంతకు ముందెప్పుడూ ఈ వైరస్‌ను చూడలేదని శాస్త్రవేత్త డాక్టర్‌ పీటర్‌ దస్జాక్ వెల్లడించారు.

Thailand: మనవాళిపై పగబట్టిన వైరస్.. గబ్బిలాల నుంచి కొత్త ప్రాణాంతక వైరస్.. మానవులకు సోకే ప్రమాదం ఉందని హెచ్చరిక
New Virus In Thailand
Surya Kala
|

Updated on: Jan 15, 2024 | 6:59 AM

Share

మనవాళిపై వైరస్ లు పగబట్టినట్లు ఉన్నాయి. గత నాలుగు ఏళ్లగా వరసగా రకరాల వైరస్ లు మనవాళిపై దాడి చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. నాలుగేళ్ళ క్రితం చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ రకరకాల రూపాలని సంతరించుకుని విజృంభిస్తూనే ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ షాక్ న్యూస్ చెప్పింది. గబ్బిలాల నుంచి ప్రపంచ మానవాళికి మరో వైరస్ సోకే ప్రమాదం ఉందని తెలిపింది. థాయ్‌లాండ్‌లో వైరస్‌ను గుర్తించనట్లు చెప్పారు శాస్త్రవేత్తలు.

ప్రపంచాన్ని మరో వైరస్ కలవరపెడుతుంది. గబ్బిలాల నుంచి మరో వైరస్ పుట్టుకోచ్చింది. ఈ వైరస్ మానవులకు సోకే ప్రమాదం ఉందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ కొత్త వైరస్‌ను థాయ్‌లాండ్‌లో గుర్తించారు. గబ్బిలాల్లో మరో ప్రమాదరకమైన వైరస్‌ను ఎకోహెల్త్‌ అలయన్స్‌ పరిశోధనా సంస్థ గుర్తించినట్లు WHO భేటీలో వెల్లడించింది. ఇంతకు ముందెప్పుడూ ఈ వైరస్‌ను చూడలేదని శాస్త్రవేత్త డాక్టర్‌ పీటర్‌ దస్జాక్ వెల్లడించారు.

కరోనా స్థాయిలో వ్యాపించే సామర్థ్యం తాజాగా గుర్తించిన కొత్త వైరస్‌కూ ఉందని పీటర్‌ తెలిపారు. థారులాండ్‌లో ఓ గుహలోని గబ్బిలాల్లో దీన్ని గుర్తించినట్లు చెప్పారు. స్థానిక రైతులు ఈ గుహ నుంచి గబ్బిలాల ఎరువును పంట పొలాల్లో ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఎరువులోనే ఆ వైరస్‌ ఉన్నట్లు వెల్లడించారు. మనుషులతో తరచూ కాంటాక్ట్‌లోకి వస్తున్న ఈ వైరస్‌ భవిష్యత్‌లో అత్యవసర పరిస్థితులను తీసుకొచ్చే ప్రమాదం ఉందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌లో గతంలో పరిశోధనలు జరిపిన ఈ ఎకోహెల్త్‌పై గతంలో అనేక వివాదాలు చుట్టుముట్టాయి. ఈ ల్యాబ్‌ నుంచే కరోనావైరస్‌ లీకైందని వచ్చిన అనుమానాలనూ ఈ సంస్థ కొట్టిపారేసింది. మరోవైపు గత నెలలో ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగాయి. డిసెంబర్‌లో దాదాపు 10 వేల మరణాలు నమోదయ్యాయని డబ్ల్యుహెచ్‌ఓ తెలిపింది. కొత్త వేరియంట్‌ జెఎన్‌.1 వ్యాప్తితోపాటు క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో ప్రజలు గుమిగూడటమే అందుకు కారణమని వివరించింది. ఈ నేపథ్యంలో సంస్థ నిర్వహించిన అత్యవసర సమావేశంలో పీటర్‌ కొత్త వైరస్‌ గురించి వెల్లడించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..