Health Tips: విషపూరితంగా మారుతున్న గాలి.. ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం రోజూ ఈ ప్రాణాయామం చేయండి

దేశంలో రోజు రోజుకీ పెరుగుతున్న కాలుష్యం ఆందోళన కలిగిస్తుంది. గాలి చాలా విషపూరితంగా మారింది.  దీని ప్రభావం ఆరోగ్యంపై కనిపిస్తాయి. వాయు కాలుష్యం పెరిగినప్పుడు ఆ ప్రభావం నేరుగా ఊపిరితిత్తులపై  చూపుతుంది. దీని కారణంగా శ్వాస సంబంధిత అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. బయటికి వెళ్లేటప్పుడు మాస్క్ ధరించాలి. అంతేకాదు  రోజూ కొంత సమయం ప్రాణాయామం చేస్తే.. విషపూరితమైన గాలి మధ్య కూడా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

Surya Kala

|

Updated on: Nov 05, 2023 | 10:11 AM

ఊపిరితిత్తులలో కొంచెం సమస్య వచ్చినా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యవస్థ ద్వారా శరీరం నుండి కార్బన్ డయాక్సైడ్ ను బయటకు పంపి ఆక్సిజన్‌ను లోపలికి తీసుకుంటాము. అయితే గాలి కూడా కలుషితమైనప్పుడు.. ఊపిరితిత్తులను ఆరోగ్యకరమైనదిగా ఉంచుకోవడం ఒక సవాలు. ప్రస్తుతానికి ఊపిరితిత్తులకు ఏ ప్రాణాయామం మేలు చేస్తుందో తెలుసుకుందాం.

1 / 6
అనులోమ విలోమ ప్రాణాయామ సాధన ప్రతి రోజూ చేయడం వల్ల ఊపిరితిత్తుల బలం అలాగే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ప్రాణాయామం ద్వారా ఆక్సిజన్ పీల్చడంతో పాటు కార్బన్ డై ఆక్సైడ్ బయటకు వెళ్లి రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. శ్వాస సంబంధిత సమస్య ఉన్నవారికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

2 / 6
భస్త్రిక ప్రాణాయామం.. ఇది శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.  కాళ్లను ఫోల్డ్ చేసి మెడ, వెన్నెముకను నిఠారుగా చేసి.. సుఖాసనంలో కూర్చోండి. ఇప్పుడు దీర్ఘంగా ఊపిరి పీల్చుకోండి. త్వరగా వదలండి. ఈ చర్యను ఒకే సారి పది సార్లు పునరావృతం చేయవచ్చు. ఈ ఆసనం ప్రయోజనాల గురించి మాట్లాడితే ఇది గొంతు సంబంధిత సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతుంది.

3 / 6
కపాలభాతి ప్రాణాయామం.. ఈ కపాలభాతి సాధన చేయడం వల్ల ఊపిరితిత్తులకు చాలా మేలు జరుగుతుంది. జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా.. శ్వాసకోశ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు  డయాబెటిక్ రోగులకు ఇది చాలా ప్రభావవంతమైన ప్రాణాయామంగా పరిగణించబడుతుంది. ఈ ప్రాణాయామం కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో..  గుండె ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

4 / 6
నాడీ శోధన ప్రాణాయామం.. శరీరంలో ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరచడంలో నాడి శోధన ప్రాణాయామం చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. మీ శ్వాసను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.  ఇలా చేయడం ద్వారా ఒత్తిడి స్థాయిని తగ్గిస్తుంది.. రాత్రి మంచి నిద్రను అందిస్తుంది.

5 / 6
ప్రాణాయామానికి సరైన సమయం.. ఏదైనా వ్యాయామం చేయడానికి ఉదయం లేదా సాయంత్రం సరైన సమయం. మరోవైపు మీరు ప్రాణాయామం చేయాలనుకుంటే, ఉదయం 5 నుండి 7 గంటల వరకు సమయం ఉత్తమంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ సమయంలో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. గాలి కూడా శుభ్రంగా ఉంటుంది.

6 / 6
Follow us