Astro Tips: గ్రహాల ప్రకారం రోజుకో రంగు దుస్తులు ధరించండి.. జీవితంలో సమస్యలు తొలగుతాయి..

రామ్ లల్లా వారంలో ఏడు రోజులు ఒకొక్క రోజు ఒకొక్క రంగు డ్రెస్ ను ధరించనున్నారు. సోమవారం తెలుపు రంగు, మంగళవారం ఎరుపు రంగు బట్టలు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం లేత పసుపు లేదా క్రీమ్ రంగు దుస్తులు, శనివారం నీలం , ఆదివారం గులాబీ రంగు దుస్తులు ధరించనున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏ రోజు , ఏ రంగు దుస్తులు ధరించడం ప్రయోజనకరమో రోజు , రంగులను బట్టి అర్థం చేసుకుందాం.

Astro Tips: గ్రహాల ప్రకారం రోజుకో రంగు దుస్తులు ధరించండి.. జీవితంలో సమస్యలు తొలగుతాయి..
Vedic Astrology
Follow us
Surya Kala

|

Updated on: Jan 26, 2024 | 8:25 AM

అయోధ్యలోని రామ మందిరంలో బాల రాముడి మహా సంప్రోక్షణ కార్యక్రమం ముగియగానే ఆలయానికి భారీగా భక్తులు చేరుకుంటున్నారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ట జరగగా.. మర్నాటి నుంచి భక్తులకు బాల రామయ్య తన దర్శనం ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో దేశంలో అన్ని దారులు అయోధ్య రామాలయం వైపే అన్న చందంగా పరిస్థితి నెలకొంది. అయితే బాల రామయ్యకు రోజూ చేసే పూజ, నైవేద్యం, ఏ రోజు ఎలాంటి దుస్తులు ధరించాలి అనే విషయాల్లో సన్నాహాలు పూర్తి అయినట్టు తెలుస్తోంది. యూపీలోని అంబేద్కర్‌నగర్ జిల్లా నివాసి అయిన డ్రెస్ డిజైనర్ మనీష్ త్రిపాఠి రామ్ లల్లా దుస్తులను డిజైన్ చేసే బాధ్యతను తీసుకున్నారు. రామ్ లల్లా వారంలో ఏడు రోజులు ఒకొక్క రోజు ఒకొక్క రంగు డ్రెస్ ను ధరించనున్నారు. సోమవారం తెలుపు రంగు, మంగళవారం ఎరుపు రంగు బట్టలు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం లేత పసుపు లేదా క్రీమ్ రంగు దుస్తులు, శనివారం నీలం , ఆదివారం గులాబీ రంగు దుస్తులు ధరించనున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏ రోజు , ఏ రంగు దుస్తులు ధరించడం ప్రయోజనకరమో రోజు , రంగులను బట్టి అర్థం చేసుకుందాం.

నమ్మకాల ప్రకారం ఎవరైనా గ్రహాలకు ఒక రంగు ఉంటుంది. దాని ప్రకారం రోజుకి ఒక రంగు ఉంటుందని.. దాని ప్రకారం వేర్వేరు బట్టలు ధరించాలి. శాస్త్రాల్లో ఆదివారం నుండి సోమవారం వరకు ధరించాల్సిన వస్త్రాల గురించి చెప్పబడింది. ఎందుకంటే రోజు ప్రకారం దుస్తులు ధరించడం వల్ల గ్రహాల అనుగ్రహంతో పాటు భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. అందువల్ల, ప్రతిరోజూ వేర్వేరు రంగుల బట్టలు ధరించడం ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి  వక్తులు కూడా ప్రతిరోజూ వేర్వేరు రంగుల దుస్తులను ధరించాలి.

సోమవారం: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం తెల్లటి రంగు దుస్తులు ధరించడం అత్యంత శ్రేష్టం.  తెలుపు రంగు చంద్రునితో సంబంధం కలిగి ఉంటుంది. కనుక ఈ రోజున తెల్లని రంగు దుస్తులు ధరించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మంగళవారం: మంగళవారం నాడు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా అంగారక గ్రహం అనుకూలంగా ఉంటుందని.. హనుమంతుడి ఆశీర్వాదాలు లభిస్తాయని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఎరుపు రంగు దుస్తులు ధరించడం వల్ల కూడా జీవితంలో కలిగే ఇబ్బందులనుంచి బయటపడతారు.

బుధవారం : బుధవారం నాడు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలని గ్రంధాల్లో పేర్కొనబడింది. బి దీని వెనుక ఉన్న నమ్మకం ఏమిటంటే బుధ గ్రహం వాక్కుతో సంబంధం కలిగి ఉంటుంది. అందువల్ల ఆకుపచ్చ రంగు ఈ రోజున ప్రయోజనాలను అందిస్తుంది.

గురువారం: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం పసుపు రంగు దుస్తులను ధరించడం మంచిది. ఇలా చేయడం వలన బృహస్పతి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. బృహస్పతి అనుగ్రహం ఉన్న వ్యక్తి జీవితంలో డబ్బు కొరత ఉండదు.

శుక్రవారం: శుక్రవారం లక్ష్మీ దేవి, శుక్రగ్రహానికి చెందిన రోజు. ఈ రోజున ఎరుపు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించడం వల్ల వ్యక్తికి లక్ష్మీదేవి , శుక్రుడి అనుగ్రహం లభిస్తుంది. ఆకస్మిక ఆర్థిక లాభం కూడా ఉంటుంది.

శనివారం: శనివారం శనీశ్వరుడికి చెందిన రోజు ఈ రోజున మీరు ఏదైనా నీలం వంటి ముదురు రంగు దుస్తులను ధరించవచ్చు. ముదురు రంగు దుస్తులు ధరించడం వలన శనిదేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు.  అయితే మీరు శనివారం నలుపు రంగు దుస్తులను ధరించకూడదు.

ఆదివారం: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆదివారం గ్రహాల రాజు సూర్యుడికి చెందిన రోజు. కాబట్టి ఈ రోజున సూర్యభగవానుని అనుగ్రహం పొందడానికి ఎరుపు రంగు దుస్తులను ధరించాలి. ఎరుపు రంగు దుస్తులు ధరించడం వల్ల సూర్య భగవానుడి తో  పాటు అన్ని గ్రహాల ఆశీర్వాదం లభిస్తుంది. జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా ఈజీగా పరిష్కరించుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!