Tiranga Dhokla: రిపబ్లిక్ డే వేళ ఇంట్లోనే టేస్టీ టేస్టీ త్రివర్ణ ఢోక్లాను ఇలా తయారు చేసుకోండి..
గణతంత్ర దినోత్సవ వేడుకల సంబరాలు అంబరాన్ని తాకుతున్న వేళ పిల్లలంతా మిఠాయిలు పంచుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మూడు రంగుల మువ్వన్నెల జెండా ను తలపించేలా త్రివర్ణ వంటలు తయారు చేసి.. జాతీయజెండాకు వందనం చేద్దాం. ఉత్తర భారతదేశంలో అల్పాహారంగా ఎక్కువగా తీసుకునే ఢోక్లాలు.. మనకు సర్వసాధారంగంగా రెస్టారెంట్లలోనే లభిస్తాయి. ఈ రోజు త్రిరంగా ఢోక్లా తయారీ గురించి తెలుసుకుందాం..
భారతదేశంలో పండగ వచ్చిదంటే చాలు రకరకాల పిండి వంటల ఘుమలతో ఇల్లు నిండిపోతుంది. ఇంకా చెప్పాలంటే ప్రత్యేక వంటలు లేని సంబరాలు ఉండవు.. మరి జాతీయ పర్వదినం రిపబ్లిక్ డే కూడా భారతీయులకు వెరీ వెరీ స్పెషల్ పండగనే.. ఈ రోజు దేశమంతా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుంది. ప్రతి దేశభక్తి వెల్లివిరుస్తుంది. గణతంత్ర దినోత్సవ వేడుకల సంబరాలు అంబరాన్ని తాకుతున్న వేళ పిల్లలంతా మిఠాయిలు పంచుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మూడు రంగుల మువ్వన్నెల జెండా ను తలపించేలా త్రివర్ణ వంటలు తయారు చేసి.. జాతీయజెండాకు వందనం చేద్దాం. ఉత్తర భారతదేశంలో అల్పాహారంగా ఎక్కువగా తీసుకునే ఢోక్లాలు.. మనకు సర్వసాధారంగంగా రెస్టారెంట్లలోనే లభిస్తాయి. ఈ రోజు త్రిరంగా ఢోక్లా తయారీ గురించి తెలుసుకుందాం..
కావాల్సిన పదార్ధాలు:
బియ్యం – 3 కప్పులు
శనగ పప్పు – 1 1/2 కప్పులు
సన్న రవ్వ-3 స్పూన్లు
పుల్లటి పెరుగు- కప్పు
అల్లం పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు
పసుపు – టీ స్పూన్
కారం – టేబుల్ స్పూన్
బేకింగ్ సోడా – అర టేబుల్ స్పూన్
పచ్చి మిర్చి – రెండు
పుదీనా – కట్ చేసినది అర కప్పు
ఆవాలు – కొంచెం
ఉప్పు – రుచికి సరిపడినంత
నువ్వులు- టేబుల్ స్పూను
కొబ్బరి తురుము- రెండు స్పూన్లు
కొత్తిమీర – కొంచెం
తయారు చేసుకునే విధానం: తీసుకున్న బియ్యం, శనగపప్పుని శుభ్రం చేసి విడి విడిగా గిన్నెల్లో వేసి బాగా కడిగి నీరు పోసి సుమారు 8 గంటపాటు నానబెట్టాలి. తర్వాత నీరు వడకట్టి మిక్సీ గిన్నెలో వేసి గారెల పిండిలా పట్టుకోవాలి. ఇప్పుడు ఆ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని సన్నని రవ్వ కలిపి.. అందులో పుల్లటి పెరుగు, కొంచెం వేడి నీరు వేసి బాగా కలిపి మిశ్రమంపై ఒక మూత పెట్టి.. ఈ పిండిని సుమారు 6 గంటలు పక్కలు పెట్టుకోవాలి. అప్పుడు పచ్చి మిర్చి పుదీనా కొత్తిమీర వేసుకుని మొత్తగా పేస్ట్ చేసుకుని పక్కకు పెట్టుకుని.. నానబెట్టుకున్న పిండిని తీసుకుని తగినంత ఉప్పు, అల్లం తురుము, బేకింగ్ సోడా, కొంచెం నూనె, కొబ్బరి తురుము వేసుకుని బాగా కలపాలి. జెండాలో మూడు రంగులను తయారు చేసేలా పిండిని తీసుకుని మూడు సమాన భాగాలు గా చేయాలి.
ఇప్పుడు ఈ పిండిలో ఒక భాగానికి పుదీనా, పచ్చిమిర్చి కొత్తిమీర పేస్టు వేసుకుని బాగా కలుపుకోవాలి. అదే విధంగా మరొక భాగానికి పసుపు, కారం కలిపిన మిశ్రం వేసి కలుపుకోవాలి. ఒక భాగం తెల్లగానే ఉంచుకోవాలి. ఇప్పుడు కాస్త లోతుగా ఉన్న పాత్రలో ముందుగా పుదీనా జత చేసిన మిశ్రమాన్ని వేసి ఆవిరి మీద రెండు నిమిషాలు ఉడికించాలి. మళ్ళీ దాని మీద తెల్లగా ఉన్న పిండి మిశ్రమాన్ని వేసి మళ్ళీ ఆవిరి మీద రెండు నిముషాలు ఉడికించాలి. ఇప్పుడు పసుపు, మిరపకారం కలిపిన పిండిని వేసి సమానంగా పరిచి మళ్లీ ఆవిరిమీద ఉడికించుకోవాలి. ఒక పావుగంటలో ఢోక్లా సిద్దం అవుతుంది.
ఇప్పుడు స్టౌ మీద బాణలి పెట్టి కొంచెం నూనె వేసి వేడి ఎక్కిన తర్వాత ఆవాలు వేసి చిటపటలాడాక నువ్వులు వేసి వేయించాలి. అనంతరం ఈ పోపుని సిద్ధంగా ఉన్న ఢోక్లా మీద వెయ్యాలి. పైన కొబ్బరి తురుము వేసుకోవాలి. అంతే త్రివర్ణ ఢోక్లా రెడీ. దీనిని చట్నీతో లేదా టమాటా సాస్ తో సర్వ్ చేసుకోవచ్చు
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..