TSPSC Chairman: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి నియామకం.. నేటి నుంచి విధుల్లోకి

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఛైర్మన్‌గా విశ్రాంత ఐపీఎస్‌ అధికారి మహేందర్‌రెడ్డి నియమితులయ్యారు. గురువారం రాత్రి టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఛీఫ్ సెక్రెటరీ సమక్షంలో tspsc చైర్మన్‌గా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. నేటి నుంచి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్ గా మహేందర్ రెడ్డి ఛార్జ్ తీసుకోనున్నారు. కాగా ఈ పదవికి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డితో..

TSPSC Chairman: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి నియామకం.. నేటి నుంచి విధుల్లోకి
TSPSC New chairman M Mahender Reddy
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 28, 2024 | 8:20 AM

హైదరాబాద్‌, జనవరి26: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఛైర్మన్‌గా విశ్రాంత ఐపీఎస్‌ అధికారి మహేందర్‌రెడ్డి నియమితులయ్యారు. గురువారం రాత్రి టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఛీఫ్ సెక్రెటరీ సమక్షంలో tspsc చైర్మన్‌గా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. నేటి నుంచి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్ గా మహేందర్ రెడ్డి ఛార్జ్ తీసుకోనున్నారు. కాగా ఈ పదవికి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు మరో ఇద్దరి పేర్లను కూడా స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలించినట్లు తెలుస్తోంది. వారిలో మహేందర్‌రెడ్డికే ఎక్కువ మద్ధతు తెల్పడంతో ఆయనను కమిషన్‌ ఛైర్మన్‌గా నియమించారు. గతేడాది ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో టీఎస్‌పీఎస్సీపై పెద్దఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షలను పారదర్శకంగా, కట్టుదిట్టంగా నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ఛైర్మన్‌ బాధ్యతలను విశ్రాంత ఐపీఎస్‌ అధికారి మహేందర్‌రెడ్డికి అప్పగించారు. కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యుల నియామకాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఛైర్మన్‌ పదవి కోసం 50 మంది, కమిషన్‌ సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ శాంతికుమారి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్‌) కార్యదర్శి నిర్మలతో కూడిన స్క్రీనింగ్‌ కమిటీ ఈ దరఖాస్తులను సోమవారం సచివాలయంలో పరిశీలించింది. వాటిల్లో ఛైర్మన్‌ పదవి కోసం మహేందర్‌రెడ్డితో పాటు ఓ విశ్రాంత అధికారి, రెండు నెలల్లో పదవీ విరమణ చేయనున్న మరో ఐపీఎస్‌ అధికారి పేర్లను ఎంపిక చేశారు. వీరిలో మహేందర్‌రెడ్డి ఒక్కరే తెలంగాణకు చెందినవారు కావడంతో ఆయన నియామకానికే ఎక్కువ మొగ్గు చూపారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ నియామకానికి సంబంధించిన ప్రతిపాదనను గవర్నర్‌ తమిళిసై తాజాగా ఆమోదం తెలపడంతో మార్గం సుగమం అయింది. టీఎస్‌పీఎస్సీ బోర్డులో మొత్తం 11 సభ్యుల్లో 10 స్థానాలు ఖాళీగా ఉండగా ప్రస్తుతం చైర్మన్‌తోపాటు ఐదుగురు సభ్యులను నియమించారు. ఇంకా నలుగురు సభ్యులను నియమించాల్సి ఉంది. సుమిత్రా ఆనంద్‌ తనోబా రాజీనామాను గవర్నర్ ఆమోదిస్తే ఆమె స్థానాన్ని కలిపి 5 సభ్యులను నియమించాల్సి ఉంటుంది.

11 నెలల పాటే చైర్మన్‌

టీఎస్‌పీఎస్సీలో కొత్త చైర్మన్‌గా నియమితులైన మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి ఆ పదవిలో కేవలం11నెలల పాటే కొనసాగే అవకాశం ఉంది. టీఎస్‌పీఎస్‌పీ నిబంధనల ప్రకారం చైర్మన్‌గా, కమిషన్‌ సభ్యులుగా నియమితులైనవాళ్లు 62 ఏండ్లు వచ్చేవరకు మాత్రమే పదవిలో కొనసాగుతారు. అలాగే 6 యేళ్ల పాటు మాత్రమే ఆ పదవిలో కొనసాగాల్సి ఉంటుంది. 1962లో డిసెంబర్‌3న జన్మించిన మహేందర్‌రెడ్డి.. ప్రస్తుతం ఆయనకు 61 సంవత్సరాల 1 నెల 22 రోజులు. మరో 11 నెలల గడిస్తే ఆయనకు 62 ఏండ్ల వయస్సు వస్తుంది. ఈ నేపథ్యంలోనే చైర్మన్‌గా మహేందర్‌రెడ్డి 11 నెలల పాటే కొనసాగే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.