Nanotechnology: ఇంకెన్నీ రోజులు అవే కోర్సులు.. బీటెక్‌లో నానో, ఇప్పుడిదే హవా..
మిల్లి మీటర్‌లో పది లక్షల వంతును నానో మీటర్ అంటాము, అలాంటి పదార్దాలను అధ్యాయనం చేయడాన్ని నానో టెక్నాలజీ అంటారు. నానో టెక్నాలజీ అనే అంశాన్ని 1950లోనే ప్రముఖ నోబెల్ గ్రహీత శాస్త్రవేత్త రిచర్డ్ ఫెన్ మన్ ముందుగా కనుగొన్నారు. అయితే ఇదే రానురాను...
ఇంజినీరింగ్ అయ్యిన వెంటనే క్యాంపస్ ఇంటర్వ్యూ లు అటెండ్ అవ్వడం లేదా ఇతర కోర్సులు చేసి ఎదో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేరి జాబ్ చెయ్యడం ఈ రోజుల్లో పెద్ద విషయం ఏమి కాదు.. కానీ బీటెక్ అయిన వెంటనే మంచి కోర్సు ఎంచుకొని ఇంకా ఉన్నత చదువులు చదివి మంచి ఇండస్ట్రీలోకి వెళ్లడం సంథింగ్ స్పెషల్. ఇలాంటి ఐడియాలాజీ ఉన్నవారి భవిష్యత్‌కు కొన్నేళ్లపాటు ఢోకా లేదు అయితే మీ భవిష్యత్ కు ఇబ్బంది లేని కోర్సులు ఏమి ఉన్నాయి వాటి వల్ల ఎలాంటి జాబ్స్ ఉన్నాయి అనే విషయాలు తెలుసుకుందాం.
మిల్లి మీటర్‌లో పది లక్షల వంతును నానో మీటర్ అంటాము, అలాంటి పదార్దాలను అధ్యాయనం చేయడాన్ని నానో టెక్నాలజీ అంటారు. నానో టెక్నాలజీ అనే అంశాన్ని 1950లోనే ప్రముఖ నోబెల్ గ్రహీత శాస్త్రవేత్త రిచర్డ్ ఫెన్ మన్ ముందుగా కనుగొన్నారు. అయితే ఇదే రానురాను 1990 స్పెషల్ కోర్సుగా మారింది నానో రంగంలో ఒక కార్యక్రమాన్ని 2000లో అమెరికా ప్రారంభించింది. నానో టెక్నాలజీలో చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నవారికి నిధులు కూడా అందిస్తుంది. భారత దేశంలో కూడా సిఎన్ఆర్ రావు అనే శాస్త్రవేత్త నానో రంగంలో చాల కృషి చేశారు. నూతన పారిశ్రామిక విప్లవం తీసుకొచ్చే అవకాశం నానో రంగానికి ఉంది.
ఈ దిశగా జాతీయ టెక్నాలజీ మిషన్ ను భారత దేశం ప్రకటించింది. మెటీరియల్ వర్సెస్ మాలిక్యులర్ నానో శాస్త్రవేత్తలు మెటీరియల్ మాలిక్యులర్ స్థాయిలో పరిశోధనలు చేస్తారు. కొన్ని పదార్దాలను నానో స్థాయికి తీసుకొచ్చి వాటిపై పరిశోధనలు చెయ్యడానికి ఉత్సహం చూపుతుంటారు. బంగారం లాంటి పదార్థం సాధారణ పరిస్థితిలో రసాయనికంగా తటస్తంగా ఉంటుంది అదే నానో స్థాయికి వచ్చేసరికి ఎంతో సామర్థం గల రసాయనిక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. నానో స్థాయిలో పదార్థం వివిధ రకాలుగా ప్రవర్తిస్తుంది వీటిని నానో టెక్నాలజీ ద్వారా ఎంతో అద్భుతంగా అధ్యయనం చేయచ్చని ప్రముఖ శాస్త్రవేత్త లుబిక్ గట్టిగా చెప్తున్నారు.
నానో టెక్నాలజీని అందిస్తున్న సంస్థలు..
దేశంలో చాల సంస్థలు ఇప్పుడు నానో టెక్నాలజీని అందిస్తున్నాయి. నానో సైన్స్‌లో బీటెక్, ఎంటెక్ కోర్సులను అందిస్తున్నాయి. పలు ప్రైవేట్ యూనివర్సిటీలు నానో సైన్స్‌లో ఎమ్మెస్సీ లాంటి మాస్టర్ స్థాయి కోర్సులను అందిస్తున్నాయి. వీటికి ముందుగా నానో సైన్స్ లో అప్లయిడ్ సైన్స్ డిగ్రీ చేయడం చాలా ఉపయోగం అంటున్నారు. ప్రపంచ స్థాయిలో హార్వార్డ్, కర్నెల్, నార్త్ వెస్టర్న్, కొలంబియా, రెనె సెల్లార్ యూనివర్సిటీల్లో ఏర్పాటు చేశారు. ప్రతి యూనివర్సిటీలో ఒక్కో స్పెషలైజేషన్ ఉంది. జర్మనీ లండన్ బ్రిటన్ లాంటి దేశాలు కూడా నానో టెక్నాలజీ కోర్సుల్లో ముందున్నాయి. ప్రస్తుతం ఈ రంగానికి మంచి డిమాండ్ ఉంది.
ఉద్యోగ అవకాశాలు..
నానో రంగంలో డిగ్రీ పీజీలు చేసిన వారు ఆరోగ్య రంగం రీసెర్చ్, మందుల తయారీ, వ్యవసాయం, ఫుడ్, పర్యావరణ పరిశ్రమలు, బయోటెక్నాలజీ, కమ్యూనికేషన్, ఆటోమొబైల్‌తో పాటు అనేక రంగాల్లో వేల జీతాలతో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి సో ఊరికే రొటీన్ కాకుండా నానో ట్రై చేయండి.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..