AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC DL Recruitment 2024: ఏపీ డిగ్రీ లెక్చరర్‌ పోస్టులు పెరిగాయ్‌.. మొత్తం ఎన్ని పోస్టులున్నాయంటే

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో గతేడాది డిసెంబర్‌ 30న 240 లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. తాజా ఈ పోస్టుల సంఖ్యను పెంచుతూ ఏపీపీఎస్సీ ప్రకటన వెలువరించింది. కొత్తగా మరో 50 పోస్టులను కలిపింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 290కి చేరింది. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. అర్హులైన అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో..

APPSC DL Recruitment 2024: ఏపీ డిగ్రీ లెక్చరర్‌ పోస్టులు పెరిగాయ్‌.. మొత్తం ఎన్ని పోస్టులున్నాయంటే
APPSC Junior Lecturers 2024
Srilakshmi C
|

Updated on: Jan 25, 2024 | 8:09 AM

Share

అమరావతి, జనవరి 25: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో గతేడాది డిసెంబర్‌ 30న 240 లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. తాజా ఈ పోస్టుల సంఖ్యను పెంచుతూ ఏపీపీఎస్సీ ప్రకటన వెలువరించింది. కొత్తగా మరో 50 పోస్టులను కలిపింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 290కి చేరింది. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. అర్హులైన అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఫిబ్రవరి 13వ తేదీ అర్ధరాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీలో ఉత్తీర్ణత పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే నెట్‌/ స్లెట్‌/ సెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. అర్హులైన అభ్యర్థులు జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుల వయో పరిమితి 2023 జులై 1 నాటికి 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌, ఎన్‌సీసీ కేటగిరీకి చెందినవారికి మూడేళ్లు చొప్పున వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అభ్యర్థులు దరఖాస్తు రుసుం కింద రూ.250తో పాటు ప్రాసెసింగ్‌ ఫీజు రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగులు/ఎక్స్‌సర్వీస్‌మెన్‌, తెల్లరేషన్‌ కార్డు కలిగిన మహిళలకు ప్రాసెసింగ్‌ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. మిగతా అందరూ రూ.370లు అప్లికేషన్‌ ఫీజు కింద చెల్లించాలి. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఏప్రిల్/ మే, 2024లో ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.57,700 నుంచి రూ.1,82,400 వరకు వేతనంగా చెల్లిస్తారు.

పరీక్ష విధానం

డిగ్రీ కాలేజీ లెక్చరర్‌ పోస్టులకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఉంటుంది. ప్రశ్నాపత్రం ఆబ్జెక్టివ్‌ రూపంలో ఉంటుంది. మొత్తం 450 మార్కులకు పరీక్ష ఉంటుంది. రెండు పేపర్లకు పరీక్ష ఉంటుంది. పేపర్‌- 1 150 ప్రశ్నలకు 150 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్‌ స్టడీస్‌, మెంటల్‌ ఎబిలిటీ (డిగ్రీ స్టాండర్డ్‌) నుంచి ప్రశ్నలు అడుగుతారు.150 నిమిషాల్లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. పేపర్‌- 2 పరీక్ష అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్టుపై ఉంటుంది. 150 ప్రశ్నలకు 300 మార్కులకు 150 నిమిషాల్లో పరీక్ష పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 నెగెటివ్‌ మార్కు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

సబ్జెక్టుల వారీగా పోస్టుల ఖాళీలు..

  • బయోటెక్నాలజీ సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 4
  • బోటనీ సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 20
  • కెమిస్ట్రీ సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 23
  • కామర్స్‌ సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 40
  • కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 49
  • కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 48
  • ఎకనామిక్స్‌ సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 15
  • ఇంగ్లిష్‌ సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 5
  • హిస్టరీ సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 15
  • మేథమేటిక్స్‌ సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 25
  • మైక్రోబయోలజీ సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 4
  • పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 15
  • తెలుగు సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 7
  • జువాలజీ సబ్జెక్టులో పోస్టుల సంఖ్య: 20

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..